నేడు మనదేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి. ఆధునికత అనే పేరుతో పరిస్థితులు మారిపోయాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా ప్రయాణిస్తున్న మహిళ మరలా అసమర్ధురాలిగా, అభద్రతా భావంవల్ల తను నిజంగా ఆత్మన్యూన్యతా భావం కలిగి మేము అసమర్దులమని దేనికి దైర్యం లేక ఎన్నో ఆసలు కోరికలు వున్నా మేము ఏమి చెయ్యలేము అన్న భావంతో అడుగుముందుకు వేయలేకపోతున్నారు. ఒకవేళ దైర్యం తెచ్చుకొని అడుగుముందుకు వేస్తే దానికి అనేక అడ్డంకులు కలిగి మానసిక వత్తిడి కలిగి ప్రయాణాన్ని ఆపేస్తున్నారు. కుటుంబాలలో కూడా వారికి శారీరక మానసిక హింస ను ఎదుర్కొంటున్నారు. అలాంటి జీవితాన్ని కాదని బయటికి వచ్చి స్వేచ్చగా వుండాలని వున్నా వుండలేని సామాజిక పరిస్థితి. ఇవన్ని ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు. ఈ మహిళా దినోత్సవాలు లాంటివి ఎన్ని జరుపుకున్నా మార్పు వస్తుందా? స్త్రీ పట్ల వివక్ష అసలు అమ్మ కడుపులో నుండే మొదలు అవుతుంది. స్త్రీగా పుట్టడమే పాపం అన్నట్టు వుంటుంది ఆమె జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితులతో. ఎన్ని చట్టాలలో మార్పు తెచ్చినా విద్యాభివృద్ది సాధించినా, భూ ఆస్తి హక్కు కలిగించిన నేటి మహిళా పరస్థితి మారలేదు అనటంలో జగమెరిగిన సత్యం. గాంధీగారు అన్నట్టు ఏనాడైతే ఒక మహిళా అర్దరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా నడవగాలదో ఆనాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది . కాని 68 సంవత్సరాలు గడిచినా ఈ మహిళా స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే వున్నారు. అలా మారినరోజు ను నిజమైన మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.