ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్". శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు, అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము సందర్బముగా నివాళి అర్పిద్దాం మరి.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.