ఈ రోజు జర్మనీ చరిత్రలో .అసలు ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. జర్మనీని తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడగొడుతూ మధ్యలో నిర్మించిన గోడను కూల్చేసిన సంఘటనకు నేటితో సరిగ్గా 26 సంవత్సరాలు పూర్తైయ్యాయి.
బెర్లిన్ గోడ జర్మనీ రాజధాని బెర్లిన్ లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు మరియు పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది.
ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. జర్మనీ దేశాలు రెండూ ఏకమైతున్నాయని తీర్మానించిన రోజు నవంబరు 9, 1989, ఒక పండుగ రోజులాగా జరుపుకున్నారు. తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది. ప్రచ్చన్న యుద్ధానంతరము, బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరము తిరిగి ఒక నగరము ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు మంది.
బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మని విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.