తాళపాక అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట.
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె |
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె |
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద |
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె |
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు |
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి |
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి |
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.