Blogger Widgets

ఆదివారం, మార్చి 27, 2016

ఎక్స్ కిరణాలు

ఆదివారం, మార్చి 27, 2016

     విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్.
  • రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు  ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
  • రాయింట్జన్ మార్చి 27, 1845 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది.1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు.   ఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అందురు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
  • రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్(శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.
  • ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
  • ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది.  దురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
  • 1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
  • రమ్ ఫోర్డ్ మెడల్ (1896)
  • మాటెక్కీ మెడల్ (1896)
  • ఎలియట్ క్రెస్సన్ మెడల్ (1897)
  • భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి (1901)
నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థం రాంట్జెనీయం(Rg) అని IUPAC సంస్థ నామకరణం చేసింది. IUPAP కూడా ఈ పేరును నవంబర్ 2011 లో దత్తత తీసుకుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)