Blogger Widgets

మంగళవారం, మార్చి 08, 2016

మహిళలూ మహారాణులు

మంగళవారం, మార్చి 08, 2016

ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.  ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటారు.  ఒక్కొక్క ప్రాంతంలో వారి ప్రదేశాన్ని బట్టి వారి మహిళలకు ఇచ్చే ప్రేమ, గౌరవం, మర్యాద, ఆర్ధిక స్వాతంత్రం,  సామాజిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, వారివారి సొంత గుర్తింపు కలిగించుకోవటానికి ఒక గుర్తుగా వుంటుంది ఈ మహిళా దినోత్సవం.  ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఈరోజును గుర్తించారు.  మన భారతదేశం లో అనాదికాలం నుండి మహిళకు ప్రత్యేకత నిచ్చేవారు.  స్త్రీని ఒక దేవతా స్వరూపంగా భావించేవారు.  పర స్త్రీ అంటే మాతృమూర్తిగా భావించేవారు. 

 నేడు మనదేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి.  ఆధునికత అనే పేరుతో పరిస్థితులు మారిపోయాయి.  ఇది చాలా బాధాకరమైన విషయం.  అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా ప్రయాణిస్తున్న మహిళ మరలా అసమర్ధురాలిగా, అభద్రతా భావంవల్ల తను నిజంగా ఆత్మన్యూన్యతా భావం కలిగి మేము అసమర్దులమని దేనికి దైర్యం లేక  ఎన్నో ఆసలు కోరికలు వున్నా మేము ఏమి చెయ్యలేము అన్న భావంతో అడుగుముందుకు వేయలేకపోతున్నారు.  ఒకవేళ దైర్యం తెచ్చుకొని అడుగుముందుకు వేస్తే దానికి అనేక అడ్డంకులు కలిగి మానసిక వత్తిడి కలిగి ప్రయాణాన్ని ఆపేస్తున్నారు.   కుటుంబాలలో కూడా వారికి శారీరక మానసిక హింస ను ఎదుర్కొంటున్నారు.  అలాంటి జీవితాన్ని కాదని బయటికి వచ్చి స్వేచ్చగా వుండాలని వున్నా వుండలేని సామాజిక పరిస్థితి.  ఇవన్ని ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు.  ఈ మహిళా దినోత్సవాలు లాంటివి ఎన్ని జరుపుకున్నా మార్పు వస్తుందా?    స్త్రీ పట్ల వివక్ష అసలు అమ్మ కడుపులో నుండే మొదలు అవుతుంది.  స్త్రీగా పుట్టడమే పాపం అన్నట్టు వుంటుంది ఆమె జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితులతో.  ఎన్ని చట్టాలలో మార్పు తెచ్చినా విద్యాభివృద్ది సాధించినా,  భూ ఆస్తి హక్కు కలిగించిన నేటి మహిళా పరస్థితి మారలేదు అనటంలో జగమెరిగిన సత్యం.
చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఎక్కడికక్కడ స్త్రీకి అన్యాయం జరుగుతూనే వుంది.  ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.  భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీగారు అన్నట్టు ఏనాడైతే ఒక మహిళా అర్దరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా నడవగాలదో ఆనాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది . కాని 69 సంవత్సరాలు గడిచినా ఈ మహిళా స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే వున్నారు.  అలా మారినరోజు ను నిజమైన మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.  
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 

1 కామెంట్‌:


  1. ఆవకాయ బూజు పట్ట కుందా ఉండాలిని కోరు కుంటున్నా ఈ మహిళా దినోత్సవ దినాన !

    జిలేబి

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)