ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్ బాండా జిల్లా రాజ్ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
రామచరిత మానస్:
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన్ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
ప్రధమ సోపానం
బాలకాండము
మంగళాచరణం
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||
వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||
ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||
|| స్వస్తి || _/\_
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.