Blogger Widgets

గురువారం, ఫిబ్రవరి 28, 2013

"జాతీయ విజ్ఞాన శాస్త్రదినము @ రామన్‌ ఎఫెక్ట్‌

గురువారం, ఫిబ్రవరి 28, 2013

మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చును

ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలోను, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో సహకరించాడు.  ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది అని అందరికి తెలిసినవిషయమే .
రామన్ వర్ణపటములో ప్రధాన రేఖకు ఒకవైపు స్టోక్ రేఖలు క్రాంతి వంతమైన మరోవైపు ప్రతి స్టోక్ రేఖలు (కాంతిహీన రేఖలు) ఏర్పడటాన్ని పరిశీలించవచ్చు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు. ప్రపంచం నలుదిశల రామన్ పేరు మారుమోగిపోయింది.

భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ. 
 జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్‌ సైన్స్‌ డే లక్ష్యాలు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.


1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన  నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త
సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు.  ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు.  1986  నుండి  జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం.  నేషనల్ సైన్సు డే సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. 

శనివారం, డిసెంబర్ 22, 2012

జాతీయ గణితదినోత్సవ శుభాకాంక్షలు.

శనివారం, డిసెంబర్ 22, 2012

ఈ రోజు మన భారతదేశం గర్వించదగ్గ సంఖ్యా మాంత్రికుడు,  శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం.  ఈ సందర్బముగా మనం ఆయనని గుర్తుచేసుకుందాం.  శ్రీనివాస రామానుజన్ 22/12/1887 లో శ్రీనివాస అయ్యంగార్, కోమలత్తమ్మాళ్ పుణ్యదంపతులకు తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను. తన తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. అతని తండ్రి సంపాదించే జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. రామానుజన్ చిన్నతనం నుండే విశిష్ట లక్షణాలు కలిగి వుండేవాడు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం కలిగివున్నాడు.  అతను చిన్నవయసులోనే ప్రముఖమైన  ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ కనుక్కున్నాడు.  చిన్నతనమునుమ్డే అద్భుత ప్రతిభను ప్రదర్శించేవారు రామానుజన్.  జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడు. తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి. 
రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో ఓ చిన్నగుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. జీతం కూడా బాగా తక్కువ. జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తనకు దొరికిన తీరిక సమయంను పూర్తిగా సంఖ్యా మేజిక్ చేయటానికి ఉపయోగించుకున్నారు.  నిరంతరం సంఖ్యా ప్రయోగములు చేసేవారు. ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు.    ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్ ని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్ లో ఈయనకు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గా ఎన్నుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్, జాకోబి వంటి గొప్ప శాస్త్రజ్ఞుల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు. క్షయ సోకడంతో రామానుజన్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఏప్రిల్ 26, 1920న చనిపోయేనాటి వరకు గణితంలో నిత్యం చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు. ఈయనకు ఎనలేని దైవచింతన వుండేది. దైవం, శూన్యం, అనంతం ఇలాంటి అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. శ్రీనివాస రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ 'సహజ గణితశాస్త్ర మేధావి'. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది.  శ్రీనివాస రామానుజన్ జన్మదినము సందర్భముగా ఈరోజును జాతీయ గణితదినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సందర్భముగా అందరికి జాతీయ గణితదినోత్సవ శుభాకాంక్షలు.

బుధవారం, డిసెంబర్ 12, 2012

రేడియో సంకేతాల ప్రసారం 12/12

బుధవారం, డిసెంబర్ 12, 2012

wireless receiver
12 /12 / 1901 లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి మొట్టమొదట రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. ఆ ప్రయోగము విజయవంతముగా పనిచేసింది.  దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీలు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి. Hats off to  మార్కొని.

Marconi Wireless Radio Wave meter

మంగళవారం, అక్టోబర్ 30, 2012

కారుణ్యమూర్తి హెన్రీ డ్యూనాంట్‌

మంగళవారం, అక్టోబర్ 30, 2012


''మన నాగరికతకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు కాని, శాంతి ఎలాగ సాధించాలో తెలియదు'' అని ఇటాలియన్‌ రచయిత గుల్మిల్మో పెరేరో'' తన పుస్తకంలో ఎంతో భాదను వ్యక్తం చేశారు.  

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.
ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. 
దేశ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమతమవుతున్న సమయంలో ఈ ప్రపంచంలో 125 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ఏర్పడింది.  చిన్న చిన్న విషయాలలోనే  పెద్ద విషయాలు దాగివుంటాయి. అక్కడనుండే గొప్ప  గొప్ప ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అనే విషయాన్ని రుజువు చేసారు  కారుణ్యమూర్తి, కర్తవ్య దీక్షాపరుడు అయిన హెన్రీ డ్యూనాంట్‌ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్రుల సహాయ కార్యక్రమం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది.  అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
హెన్రీ డ్యూనాంట్‌ (1828-1910) చేసిన ఆ గొప్ప సేవలో నుండే 'రెడ్‌ క్రాస్‌'' జన్మించింది. 1862లో తన ఈ ''చిన్న'' ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాత్రుల దయనీయస్థితి గురించి యూరప్‌లో ప్రజలు మేల్కొన్నారు. ఈయనే రెడ్ క్రాస్ ను ఏర్పరచారు. డ్యూనాంట్‌ స్విట్జర్‌లాండ్‌ దేశస్థుడు కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జండారంగులను తల్లక్రిందులు చేసి తెల్ల జెండాపై ఎర్రక్రాసును రెడ్‌క్రాస్‌ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించారు. నోబెల్‌ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్‌ బహుమతిని డ్యూనాంట్‌కు ఇవ్వడం జరిగింది. అంతేకాక 1963లో రెడ్‌క్రాస్‌ శతజయంతి సందర్భంగా నోబెల్‌ శాంతి బహుమానాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఇచ్చి గౌరవించారు.  
యుద్ధంలో మరణించడం, క్షతగాత్రులుకావడం వారి కర్మ, నుదిటివ్రాత, అన్నభావం నుండి బయటపడింది. ఏ దేశానికి చెందిన వారైనా, గెలిచినా, ఓడినా ఆ క్షతగాత్రు లకు సేవచేయడం మానవధర్మంగా ఈ రెడ్‌క్రాస్‌ భావిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలలో ''రెడ్‌క్రాస్‌'' ఎనలేని సేవ చేసింది. జర్మనీలో హిట్లర్‌ యుద్ధంలో 'రెడ్‌క్రాస్‌'' జోక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల జర్మన్‌ యుద్ధ శిబిరాలలో 90 శాతం మంది చనిపోయారు. దాన్నిబట్టి హిట్లర్‌ ఎంత కౄరుడో ప్రపంచానికి అర్థమయ్యింది. ఈనాడు వందకుపైగా దేశాలు రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహ్మదీయ దేశాలు కూడా రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. ఆ ముస్లిం దేశాలలో రెడ్‌క్రాస్‌ గుర్తు తెల్లజెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. ఇరాన్‌లో రెడ్‌క్రాస్‌ ఎర్రని సింహం, సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్‌క్రాస్‌ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వామ్యమయ్యాయి.
పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్‌క్రాస్‌ లక్ష్యాలుగా మారాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలి అన్నది రెడ్‌క్రాస్‌ ఆకాంక్ష. రెడ్‌క్రాస్‌ ఒకనైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారుమబ్బులులాగా వస్తూ వుంటే, రెడ్‌క్రాస్‌ చీకట్లో కాంతిరేక లాగా మెరుస్తోంది.  యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.
స్విడ్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. నేడు హెన్రీ వర్ధంతి సందర్బంగా ఈ కారుణ్యమూర్తికి  మన బ్లాగ్ ద్వారా నివాళి అందిస్తున్నాను .

సోమవారం, అక్టోబర్ 01, 2012

అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు'

సోమవారం, అక్టోబర్ 01, 2012

ఒక పర్యావరణ వ్యవస్థ, జీవ వ్యవస్థ, జీవారణ్య ప్రాంతాలు లేదా మొత్తం భూమిపై ఉన్న జీవ రూపాల యొక్క భేదమే జీవవైవిధ్యం . జీవశాస్త్ర వ్యవస్థల స్వస్థతా పరిమాణంగా జీవవైవిధ్యం తరచూ ఉపయోగించబడుతుంది. నేడు భూగోళంపై ఉన్న అనేక మిలియన్ల విభిన్నజాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామంనుండి అభివృద్ధి చెందింది.  కాలుష్యం, వాతావరణమార్పులు కూడా జీవవైవిధ్యాన్ని అంతరింపజేస్తున్నాయి కదా అందే ముఖ్యవుద్దేసంగా ఈరోజు ప్రపంచ జీవవైవిధ్య  (biodiversity) సదస్సు హైదరబాదులో ఈరోజు ప్రారంభము అయ్యాయి . దీనికి ప్రపంచంలో 193 దేశాల ప్రతినిధులు హాజరు అవుతున్నారు.
భూగోళంలో వున్న భిన్న వృక్ష, జంతుజాతులు, ఆ జాతుల్లో వున్న మొత్తం తేడాలన్నింటినీ కలిపి జీవవైవిధ్యంగా పరిగణిస్తున్నాం. జీవావిర్భావం తర్వాత గత 3,500 కోట్ల సంవత్సరాలకుపైగా జరిగిన పరిణామక్రమంలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. నిపుణుల అంచనా ప్రకారం భూగోళంలో భిన్నమైన, గుర్తించగల 100 నుండి 300 లక్షల వృక్ష, జంతుజాలాలు వున్నాయి. కానీ, వీటిలో ఇప్పటి వరకు అధ్యయనం చేసి, గుర్తించగలిగింది సుమారు 14.35లక్షల రకాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా 7.51లక్షల రకాలు కీటకజాతి కి చెందినవి. ఆతర్వాత 2.81లక్షల జంతుజాతికి చెందినవి. ఉన్నత వృక్షజాతికి చెందినవి 2.48లక్షల రకాలు గుర్తించబడినవి. ఇక మిగ తావి ప్రోటోజోవా, ఆల్గేలు, ఫంజీ, బ్యాక్టీరియా తదితరాలు. అడవుల్లో కొత్తగా అధ్యయనం చేస్తున్న కీటకజాతుల్లో ఆరింటిలో ఐదు కొత్తరకా లుగానే గుర్తించబడుతున్నాయి. తద్వారా మనం గుర్తించిన జంతు జాలాల కన్నా ఇంకా గుర్తించాల్సినవే చాలా ఎక్కువగా వున్నాయని ఈ ధోరణి తెలుపుతుంది. ఇలా గుర్తించిన రకాలలో కూడా అంతర్గతంగా ఎంతో వైవిధ్యం గుర్తించబడింది. ఉదా: వరి శాస్త్రీయపరంగా ఒకే ఒక మొక్క. కానీ దీనిలో మన దేశంలోనే వేల రకాలు గుర్తించబడ్డాయి. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనే జీవప్రక్రియలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మారుతున్న వాతా వరణ, పర్యావరణ ధోరణిని తట్టుకోవడానికి ఈ వైవిధ్యం ఎంతో ఉప యోగపడుతుంది. ఈ వైవిధ్యమే లేకుంటే భూగోళంలో ఏ చిన్న దుష్ప రిణామం వచ్చినా ఈ రకాలు అంతరించి, మానవ ఆహారలభ్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
What is biodiversity

సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, తరగని జీవ సంపదకు భారతదేశం నిలయం. పలురకాల ఆవాసాలకు, ఆవరణ వ్యవస్థలకు, వాటి వైవిధ్యానికి మనదేశం పెట్టింది పేరు. ఉష్ణమండల వర్షారణ్యాల నుండి, ఆల్పైన్‌, సమశీతోష్ణ అడవులు, తీరప్రాంత చిత్తడి అడవులు, మడ అడవులు ఇలా ఎంతో వైవిధ్యభరిత జీవావరణ వ్యవస్థల్ని ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు జీవవైవిధ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వైశాల్యంలో కేవలం 2.4 శాతం ఉన్న మనదేశంలో 7.3 శాతం జీవజాతులు (సుమారుగా 89,451 జాతులు) ఉండటం విశేషం. జీవ భూగోళ ప్రాంతాలు పది ఉన్నాయి. వీటిలో ఎడా రులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఉష్ణ, సమశీతోష్ణ అరణ్యాలు, గడ్డి మైదానాలు, నదీపరీవాహక ప్రాం తాలు, అర్చిపెలాగో ద్వీపాలు, మడ (మాంగ్రూస్‌) అడవులు ఇందుకు నిదర్శనాలు. ప్రపంచపు 18 స్థూల వైవిధ్యం ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. క్షీరదాల్లో 7.6 %, పక్షుల్లో 12.6%, సరీసృపాలు 6.2%, ఉభయచరాల్లో 4.4%, చేపల్లో 11.7%, పుష్పించే మొక్కల్లో 11.7% మనదేశంలోనే ఉన్నా యంటే జీవవైవిధ్యపరంగా మనదేశ ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. ఆసియా ఏనుగు, బెంగాల్‌ పులి, ఆసియా సింహం, చిరుత, రైనాసెరాస్‌ వంటి ఎన్నోరకాల ప్రత్యేక జాతులకు మనదేశం ప్రసిద్ధి. ఈ జీవ వైవిధ్య కేంద్రాల్లోనే మనం పండించే అనేకరకాల మొక్కలు ఉద్భవించాయి. రకరకాల పంట మొక్కల ఉద్భవానికి నిలయమైన 12 కేంద్రాల్లో మనదేశం ఒకటి. ఇంతటి గొప్ప జీవవైవిధ్య వనరులు క్రమంగా అదృశ్యం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అందుకే ముఖ్య వనరుగా, సంపదగా ఉన్న మనదేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఈ జరగబోయే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు' స్ఫూర్తినిచ్చి, కార్మోన్ముఖులను చేస్తాయని ఆశిద్దాం.  మన రేపటి పౌరులకు మన వనరు సంపద ను కాపాడి అందించగలరు అని ఆశిద్దాము.

మంగళవారం, ఆగస్టు 07, 2012

"హరిత విప్లవ పిత" పుట్టినరోజు శుభాకాంక్షలు.

మంగళవారం, ఆగస్టు 07, 2012



"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్‌.ఎస్‌. స్వామినాధన్‌ భారత వ్యవసాయరంగంలో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం.  నేడు మనకు తగినంత ఆహారం పొందడం అంటు జరుగుతోంది అంటే దీని కారణం అయిన Prof M.S. స్వామినాథన్.  ఈయన ఒక ఆదర్శ శాస్త్రవేత్త మరియు ఈయనను హరిత విప్లవం కారకుడుగా చెప్పుకోవచ్చు . M.S. స్వామినాథన్ ఆగష్టు 7, 1925 న గల కుంభకోణం లో జన్మించాడు. స్వామినాథన్కు  11 ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. స్వామినాథన్  భారతదేశం లో వున్నా శాస్త్రవేత్తలలో గొప్ప  జన్యుశాస్త్రవేత్త మరియు ప్రఖ్యాత అంతర్జాతీయ నిర్వాహకుడు, ఉంది "హరిత విప్లవం," ఒక కార్యక్రమం ఇది కింద గోధుమ, బియ్యం మొలకల అధిక దిగుబడి రకాలు పేద రైతుల రంగాలలోనాటింపచేశారు . స్వామినాథన్ భారతదేశం లో గోధుమ అధిక దిగుబడి రకాల పరిచయంచేసి  మరియు అభివృద్ధి పరిచారు, తన నాయకత్వం మరియు విజయం కోసం "భారతదేశం లో హరిత విప్లవం తండ్రి", అని అంటారు. అతను M.S. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గా వున్నారు. అతని పేర్కొంది దృష్టి ఆకలి మరియు పేదరికం ప్రపంచం ఉద్యమించారు. డా స్వామినాథన్ ముఖ్యంగా పర్యావరణపరంగా స్థిరమైన వ్యవసాయం ఉపయోగించి, స్థిరమైన అభివృద్ధికి భారతదేశం కదిలే ఒక న్యాయవాది ఉంది , స్థిరమైన ఆహార భద్రత కలిగించారు మరియు ఒక "సతత హరిత విప్లవం" అని పిలిచే జీవవైవిధ్యం చూపించారు, విప్లవం యొక్క సంరక్షణ 1972 నుండి 1979 వరకు ఆయన అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్గా, మరియు అతను 1979 నుండి 1980 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అతను అంతర్జాతీయ వరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1982-88) డైరెక్టర్ జనరల్ పనిచేశాడు మరియు 1988 లో ప్రకృతి మరియు సహజ వనరుల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అధ్యక్షుడు అయ్యాడు.  డాక్టర్ స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి మరియు సహజ వనరుల పరిరక్షణకు లో సమస్యలు విస్తృత న సహచరులు మరియు విద్యార్ధులు సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పని చేసింది.  స్వామినాథన్ "ఎకనామిక్ ఎకాలజీ యొక్క తండ్రి" గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వర్ణించారు.  డాక్టర్ స్వామినాథన్ అనేక అసాధారణ అవార్డులు మరియు బహుమతులు అందుకున్నాడు. ఈ బహుమతులు కొనసాగటానికి మరియు తన పని విస్తరించేందుకు సహాయం చేసింది, ఇది పెద్ద మొత్తంలో డబ్బు, ఉన్నాయి.  జీవ ఒక పర్యావరణ సంబంధిత నిలకడగా ఆధారంగా ఉత్పాదకత, మరియు "1991 జీవ వైవిధ్య పరిరక్షణా ప్రోత్సాహకం.  అతను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నుండి 50 గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉంది.  జాతీయ అవార్డులు అతను దేశం ప్రయోజనకరంగా తన పని కోసం భారతదేశం లో పలు అవార్డులను సన్మానించారు చెయ్యబడింది.  ఇన్ని చేసిన ఇంత గొప్ప హరిత విప్లవకారుడు M . S. స్వామినాధన్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి.  So, M . S .స్వామినాధన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కావునా.  ఆయనకీ మన బ్లాగ్ ద్వారా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ M . S . స్వామినాధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.

సోమవారం, ఆగస్టు 06, 2012

పెన్సిలిన్ ప్రదాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్

సోమవారం, ఆగస్టు 06, 2012

 పెన్సిలిన్‌,అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, జయంతి

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన  1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు  .  ఈయన 1923లో లైసోజేమ్‌ అనే ఎంజైమును కనిపెట్టాడు.  1928లో పెన్సిలిన్‌ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు.  పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.  ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.  మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.  1999లో టైమ్స్‌ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది.  ఫ్లెమింగ్‌ పెడింగ్టన్‌లోని సెయింట్‌ మెరీస్‌ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్‌ చదివారు.  ఫ్లెమింగ్‌ సిప్టమర్‌ మేరియన్‌ మెకెల్రాట్‌ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు.  ఫ్లెమింగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఆర్మి మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కనిపెట్టడానికి ప్రేరణ.  పెన్సిలిన్‌ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.  పెన్సిలిన్‌ స్కార్లెట్‌ ఫీవర్‌, న్యుమోనియా, మెనింజైటిస్‌, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది.  ఫ్లెమింగ్‌కు రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌, ఇంగ్లాడు హంటేరియన్‌ ప్రొఫెసర్‌ షిప్‌ ఇచ్చింది.  ఫ్లెమింగ్‌ 11.3.1955న గుండెపోటుతో మరణించారు.   వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు. 

శనివారం, ఆగస్టు 04, 2012

Pencil Story

శనివారం, ఆగస్టు 04, 2012

Nicolas-Jacques Conté పేరు విన్నారా?  వింటే సరే వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఈయన గురించి.  మనం చిన్నప్పటినుండి స్కూల్కి వెళ్ళేప్పుడు మన చేతిలో వుండే పెన్సిల్ను మొట్టమొదట  కనుక్కున్నారు .  ఈరోజు 4 August 1755 Nicolas-Jacques Conté న పుట్టిన రోజు.  ఈయన ఫ్రెంచ్ పైంటర్, balloonist, army officer, మరియు ఈయన మనం వాడుకొనే ఆధునిక పెన్సిల్ ను కనుక్కొన్నారు. 
NICOLAS-JACQUES CONTÉ

శుక్రవారం, ఆగస్టు 03, 2012

లిఫ్ట్ కనిపెట్టినవారు ఓటిస్

శుక్రవారం, ఆగస్టు 03, 2012



E.G. ఓటిస్ఇలాషా గ్రేవ్స్ ఓటిస్ (august 3 1811-61), అమెరికన్ శాస్త్రవేత్త యొక్క చిత్రంఅతను 1854 లోన్యూ యార్క్ వరల్డ్ యొక్క ట్రేడ్ ఫెయిర్ లో అది ప్రదర్శించడంపై తన 'భద్రతా ఎలివేటర్ ఉంది.  ఆతను ప్రదర్శన సమయంలో, ఓటిస్ మద్దతు కేబుల్ కట్ కలిగి ముందు లిఫ్ట్ వేదిక మీద పెరిగింది. అతని లిఫ్ట్ డిజైన్ ఒక భద్రతా బ్రేక్పడిపోవడం నుండి వేదిక నిరోధించే మరియు ఓటిస్ గాయపర్చని ఇది ఒక పరికరం ప్రవేశపెట్టారు. 1852 లో పేటెంట్ అతని కల్పనఅతని గొప్ప మెప్పును తెచ్చింది మరియు అతను Yonkers, న్యూయార్క్ వద్ద ఒక కర్మాగారాన్ని ఏర్పాటుమొదటి పబ్లిక్ లిఫ్ట్ బ్రాడ్వే, న్యూయార్క్ లో ఒక స్టోర్ లో మార్చి 1857, 23 వ  ప్రారంభించారు. అతను కూడా ఒక ఆవిరి-నడుపబడే ఎలివేటర్ పేటెంట్ పొందారు.  మొట్ట మొదట లిఫ్ట్ ను కనుక్కున్నది ఓటిస్  .  ఓటిస్ పుట్టున రోజు నేడే.  అలాంటి శాస్త్రవేత్త గురించి తెలుస్కోవటం గొప్పగా వుంది కదా.  ఎందుకంటే మనం లిఫ్ట్ ఎప్పుడు ఎక్కుతూ వుంటాము.  కానీ ఎవరు తయారు చేసారో తెలిసింది కదా.

శుక్రవారం, జులై 20, 2012

జన్యుశాస్త్రానికి ఆద్యుడు

శుక్రవారం, జులై 20, 2012

ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు.  ఆయన ఎవరో తెలుసుకుంటారా.  ఈరోజు 1822 జులై 20 న  జన్యు శాస్త్రానికి ఆద్యుడు  గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము.  ఈయన  ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌.  అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.  మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి  మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి.  మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది.  జన్యుశాస్త్రం  వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
 
మెండల్ అనువంశిక సిద్ధంతములు:
సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.
ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది.  మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.

శుక్రవారం, జూన్ 15, 2012

మెరుపులో నిజాలు.

శుక్రవారం, జూన్ 15, 2012

 mcdowel2

ఆకాశం వైపు చూస్తే మనకు నీలి మేఘాలు మెత్తటి దూదిపింజలుగా కనిపిస్తాయి.  అవి అమాయకముగా ఒక ప్రదేశము నుండి మరొక  ప్రదేశానికి యాక్టివ్ గా వెల్తున్నాయి.   నీరు, మంచు లోపల ఆకర్షణ శక్తి ద్వారా వెచ్చని గాలి ప్రవాహాల ద్వారా చుట్టూ కదిలే, మరియు గడ్డకట్టి, మేఘము లో నీరు  evaporating చెందుతుంది  . ఒక  బెలూన్ rubbing వంటి స్టాటిక్ విద్యుత్ సృష్టించవచ్చు, అలాగే  క్లౌడ్ లో రేణువులు ఆవేశం వల్ల  విధ్యుత్ పుడుతుంది అని మొట్టమొదట  బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను శాస్త్రవేత్త తన గాలిపటం ప్రయోగము ద్వారా నిరూపించారు.  ఈరోజు బెంజమిన్ ఫ్రాంక్లిన్ జన్మదినము సందర్బముగా మనము ఆయన ప్రయోగము గురించి తెలుసుకుందాం.

ఒక ముఖ్యమైన విద్యుదావేశ వేర్పాటు వల్ల   నిర్మించిన ఒకసారి, క్లౌడ్ గ్రౌండ్ లో సానుకూల ఛార్జ్ ప్రేరేపిస్తుంది. ఆ  చార్గే చివరకు భూమికి చేరుతుంది . అది  గాలి ionise గా వారు purplish మెరుపు ఏర్పడటానికి కారణమవుతుంది. వారు కేవలం ఒక  సులభమయిన, దుమ్ము మరియు గాలి లో ప్రభావితం  చేస్తుంది.  అతి  చిన్నదైన మార్గం ద్వారా బెంజమిన్ ఫ్రాంక్లిన్  కనుక్కునారు ఈ విషయాన్ని Streamers వాటిని తీర్చేందుకు భూమి నుండి పైకి రావచ్చు.  ఒకసారి వచ్చిన   స్పార్క్ ఛార్జ్ తటస్థంగా  రూపొందిస్తుంది. గాలి రుణావేశం ద్వారా క్లౌడ్ గుడ్డుకోవటం వల్ల ఒక కాంతి ఏర్పడుతుంది అది  సాధారణంగా వేడెక్కే కొద్ది.  దాని స్పార్క్ వేడి లేదు, 20,000 డిగ్రీలగా   ఎక్కువ వుంటుంది.  అది త్వరగా షాక్ వేవ్ మరియు ఉరుము వల్ల గాలి వేడిచేస్తుంది. లైట్ ఒక  సెకనుకు  186.000 మైళ్ళు దూరము  ప్రయాణిస్తుంది .   4.5 సెకన్లు వచ్చిన మెరుపు 1 మైలు దూరము ప్రయాణం చేస్తుంది.  
మెరుపులో  నిజాలు:
• ప్రపంచవ్యాప్తంగా సంభవించే 2,000 తుఫాను పైగా ఉన్నాయి ఏ సమయంలో అయినా, ప్రతి 100 మెరుపు ఉత్పత్తి అవుతాయి  అవి ప్రతి రోజు 8 మిలియన్ల మెరుపులు గా చెప్పచ్చు .
• ప్రతి మెరుపు ఫ్లాష్ 3 మైళ్ల పొడవైన కాని కేవలం ఒక సెంటీమీటర్ గా అనిపిస్తుంది.
• ఒక మెరుపు శక్తి యొక్క 1-10 బిలియన్ జౌలేస్ గురించి డిశ్చార్జెస్ మరియు కొన్ని 30,000 ప్రస్తుత ఉత్పత్తి - 50,000 ఆంప్స్, సెల్సియస్ 20,000 పైగా డిగ్రీల చుట్టూ ఉన్న గాలి వేడెక్కడంతో ఇది,
• ఒక మెరుపు తీగ TNT, ఒక టన్ను కాల్చుకొని గా  చాలా శక్తి unleashes గా వుంటుంది.
ప్రతీ ఒక ఫ్లాష్ వల్ల చాలా విద్యుత్ ఏర్పడుతుంది అని మనకు చెప్పకనే అర్థం అవుతోంది.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క ప్రమాదకరమైన గాలిపటం ప్రయోగం వల్ల  ఇది నిజమని నిరుపితము అయ్యింది.  ఒక ఎగిరే గాలిపటం ద్వారా ఫ్రాంక్లిన్ చే  మెరుపు ఒక విద్యుత్ దృగ్విషయం అని పరికల్పించబడినది.  మరియు మెరుపు యొక్క విద్యుత్ ప్రభావం మరొక వస్తువు కు బదిలీ మరియు విద్యుత్ తన  ప్రభావాన్ని చూపించింది .  1752 లో, ఫిలడెల్ఫియా లో ఒక చీకటి రోజు న  జూన్ మధ్యాహ్నం న, 46 ఏళ్ల బెన్ ఫ్రాంక్లిన్ ఒక గాలిపటం  ఎగురువేసి ప్రయోగం చేసారు . తన కుమారుడు, విలియం సహాయంతో, వారు ఇద్దరు  ఒక  చివర ఒక ఇనుప కీ వ్రేలాడ తీసారు , మరియు ఒక పట్టు స్ట్రింగ్ తన గాలిపటం కు పెట్టారు. తరువాత, వారు కీ నుండి ఒక సన్నని మెటల్ వైర్ టైడ్ మరియు ఒక లైడెన్ జార్, ఒక విద్యుత్ చార్జ్ నిల్వ చేయడానికి ఒక కంటైనర్ లోకి వైర్ చేర్చారు. ఆకాశంలో నల్లని మబ్బులు రావటం వల్ల  ఉరుములతో కూడిన  మెరుపు సమీపించినప్పుడు చివర వారు కీ ఒక పట్టు రిబ్బన్  వుంది .  పట్టు రిబ్బన్ ద్వారా గాలిపటం లోకి హోల్డింగ్, బెన్ గాలిపటం ఎగిరింది మరియు ఒకసారి అది ఎత్తుగా ఎగిరింది , అతను పురిలోకి వెనుతిరిగింది. మేఘం లో ప్రతికూల ఆరోపణలు కీ, మరియు కూజా లోకి, తడి పట్టు స్ట్రింగ్ క్రిందికి తాకటం, తన గాలిపటం లోకి ప్రవేసించి ఉరుము తో కూడిన తుఫాను క్లౌడ్, ఫ్రాంక్లిన్ యొక్క గాలిపటం లోకి  ప్రవేసించి.   అతను కీ న అతనిని వ్యాప్తి నిరోధక, పొడి పట్టు రిబ్బన్ పట్టుకొని ఎందుకంటే బెన్ అయితే,  అతను ఒక షాక్ పొందారు.  అతనుకు షాక్ తగలటం తో అతను మెరుపులో విద్యుత్ కలదు.  అని ఫ్రాంక్లిన్ యొక్క ప్రయోగం విజయవంతంగా మెరుపు స్టాటిక్ ద్వారా విద్యుత్నుచూపించాడు.  ఫ్రాంక్లిన్ సంఘటన తర్వాత నిజాన్ని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేసి నిజాన్ని గ్రహించారు మిగిలిన శాస్త్రవేత్తలు.  

మెరుపులోని విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది అని తెలుస్తోంది.  మన శాత్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఆ విద్యుత్ను గ్రహించి సేవ్ చేయగలిగితే.  మనకు నిరంతరము విద్యుత్ను పొందవచ్చు.  మరి ఏరకంగా గ్రహించాలి అని ఆలోచించాలి మరి.   

గురువారం, జూన్ 14, 2012

ప్రపంచ రక్త దాతల రోజు.

గురువారం, జూన్ 14, 2012

Landsteiner, Karl

2005నుండి ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు.  ఎందుకు ఈరోజే జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఆస్ట్రియన్  ఫిజిసియన్   కార్ల్ లేండ్ స్టీనర్ 14 జూన్ 1868.  అను శాస్త్రవేత్త జయంతి.  ఆయన  ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుక్కొన్నారు.  ఇలా బ్లడ్  గ్రూపులను  కనుగొన్నందుకు కార్ల్ లేండ్ స్టీనర్ కు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు.   ఈయన Rh factor మరియు పోలియో వైరస్ ను వేరుచేశారు.  ఈయన ప్రయోగాలు hemoglobinuria గురించి తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడ్డాయి.

రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.   ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరుచేయబడతాయి.  అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవ భాగం మరియు 40% ఘన భాగంతో చేయబడింది. 90% నీరు మరియు 10% పోషకాలు, హార్మోన్లు మొదలగువాటితో తయారుచేయబడే, ద్రవ భాగమైన ఈ ప్లాస్మా, ఆహారము మరియు మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్ బి సి ( ఎర్ర రక్త కణాలు), డ బ్ల్యు సి ( తెల్ల రక్త కణాలు) మరియు ప్లేట్ లెట్స్ కలిగి ఉండే ఘన భాగం పోతే, యధాతదంగా రావడానికి సమయము తీసుకుంటుంది.  మీరు ఇక్కడే అవసర పడతారు. దానిని తిరిగి యధాతదంగా రోగులయొక్క శరీరం నింపడానికి తీసుకునే సమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు.  రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని అందరికి  తెలుసుకదా. రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.
ప్రతి సంవత్సరము భారత దేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో, 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది.  రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవ్యము రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు (electrolytes), హార్మోన్లని, విటమిన్లని, ప్రతిరక్షకణాలు (antibodies), వేడిని మరియు ఆమ్లజని ని తీసుకువెళతాయి.  శరీరము నుండి వ్యర్థ పదార్థాలని మరియు కార్బన్డయాక్సైడ్ని రక్తం తీసుకువెళుతుంది.  రక్తం, వ్యాధులను ఎదుర్కొని మరియు గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది.  వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్త కణాలు శరీరము యొక్క ప్రాధమిక సురక్ష.  ఒక రకమైన తెల్ల రక్త కణాలైన గ్రేన్యులొకైట్స్, సూక్ష్మక్రిములు (bacteria) వెదకి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి. శరీర అవయవాలకి మరియు కణజాలానికి (tissues), ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని తీసుకు వెళతాయి. రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి. రక్తపట్టికలు (platelets) రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి మరియు లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి. 

రక్త దానము చేయటానికి చాలా మందికి అనేకమైన అపోహ వుంటుంది అవి ఏమిటంటే.  "దానము చేసిన తరువాత నానుంచి ఏదో పోయినట్టు అంతే కాకుండా  అలసి పోయినట్టు ఉంటుంది"  ద్రవ్యాలను మరియు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, మీ నుండి ఏదో పోయినట్టుగాని లేదా మీరు అలసి పోయినట్టుగాని ఉండరు. " సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనలేను అనుకుంటారు "మిమ్మల్ని పాల్గొనవద్దని మీకు చెప్పినప్పటికీ, మీ అన్ని సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనవచ్చు.  "రక్తం తక్కువ అవుతుంది"  మీరు డాక్టరు చేత దానం చేయడానికి, సరే అని అనిపించు కున్న తరువాత, దానం చేసిన తరువాత కూడా మీకు సరిపడా రక్తం ఉంటుంది. "దానం చేసే సమయంలో నొప్పిగా వుంటుంది అనుకుంటారు " కానీ  మీకు ఎటువంటి నొప్పి కలుగదు. " తలతిరిగి సొమ్మసిల్లి పోవచ్చుఅని కూడా అనుకుంటారు " రక్తం దానం చేసిన తరువాత,కొంతసేపు విశ్రాంతి తరువాత, మీరు సొమ్మసిల్లిపోరు లేదా అసౌకర్యం కలుగదు.  " ఎయిడ్స్ కలుగవచ్చు!" అలా జరుగదు  ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్ లను ఉపయోగించేలా మరియు క్రిములబారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. " రక్తం సామాన్యమైనది. దానికి గిరాకి ఉంటుందని నేననుకోవడం లేదు" అందుకే అరుదైన వాటి కన్నా మీ గ్రూపు రక్తానికే ఎక్కువ గిరాకీ ఉంటుంది.
రక్త దానం చేయటం మనకి మంచిదే.  అదీ కాకుండా వేరే ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు.  నాకు ఇవన్నీ ఒక  డాక్టర్  గారు చెప్పారు.  మరి మీరు కూడా తెలుసుకోండి.  మీరు రక్త దానం చేసి హాయిగా జీవించండి.  అలాగే ప్రాణాపాయంలో ఉన్నవారిని జీవింప చేయండి.  Thank  you.

మంగళవారం, జూన్ 05, 2012

ప్రకృతిలో జరిగే అద్బుతము ఈ శుక్రగ్రహం.

మంగళవారం, జూన్ 05, 2012

Your Guide to Venus Transit 2012 (Infographic)
ప్రకృతిలో జరిగే అద్బుతము ఈ శుక్రగ్రహం 
 శుక్రగ్రహ గ్రహణం భారత కాలమానం ప్రకారం సూర్యోదయము తో ప్రారంభము అవుతుంది .ఇది అత్యంత అరుదుగా కనిపించే గ్రహణము.  ఇది సూర్యగ్రహణము కాదు చంద్ర గ్రహణము కాదు.  శుక్ర గ్రహణం అది రేపు కనిపించి మరలా 102 సంవత్సరములు తరువాత కనబడుతుంది.  అంటే ఇది అత్యంత అద్బుతమైన గ్రహణము.  సూర్యుని మద్యలో నల్లని మచ్చ వలె కనిపిస్తుంది.  ఇది  2012 జూన్ 6 వ తేదీన భారతదేశంలో శుక్ర గ్రహణం సంభవించనుంది అని చాలా రోజునుండి ఎదురు చూసాం కదా.  అది దేదీప్యమాన వెలుగుతో వుండే సూర్యుడు తేజోహీనుడైతే, దానిని సూర్యగ్రహణం గాను, రాత్రి సమయంలో వెన్నెలను అందించే కాంతి గల చంద్రుడు కాంతి విహీనమైపోతే చంద్ర గ్రహణంగా భావిస్తున్నాం. మరి మహా కాంతితో నక్షత్రం వలె రాత్రి సమయంలో కనపడే శుక్ర గ్రహం కూడా కాంతివిహీనమై నల్లని మచ్చలా కనపడటాన్ని  గ్రహణంగా పేర్కొంటారు.  సూర్యుడికి భూమికి మధ్య చంద్రుని బదులు శుక్రుడు అడ్డు వస్తే ఓ మినపగింజ ఆకృతిలో సూర్యబింబం పై శుక్రుడు నల్లని చుక్కలా గోచరమగును. దీనినే శుక్ర గ్రహణం అంటారు.   సూర్యునిపై నల్లని మచ్చగల శుక్ర గ్రహణం తోనే భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలు ప్రారంభమగును. అందుచేత భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలనుంచి.... ఉదయం 10.01 వరకు ప్రత్యక్షంగా నేత్రాలతో చూడకుండా, మసి పూసిన అద్దంతో గాని, ఫిల్మ్ తో గాని ఇతర అందుబాటులో వుండే సోలార్ ఫిల్టర్ ద్వారా గాని శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. నేరుగా సూర్యుని చూడవద్దు.  ఇలాంటి ప్రకృతిలో  జరిగే అద్భతాన్ని తప్పక చూడండి.  ఇది అందరు చూడవచ్చు కావున తప్పక చూడండి.  నేను అయితే చాలా ఆత్రుతగా వున్నాను ఈ అద్బుతాన్ని చూడటానికి.  నేను చూడటానికి రడీ మరి మీరు రడీ నా.

ఆదివారం, మే 20, 2012

వాస్కోడిగామ సాహసయాత్ర

ఆదివారం, మే 20, 2012

పూర్వం నుండి  సాహస  యాత్రలు చేసేవారు వారిలో మొట్టమొదట  కొలంబస్ అను నావికా యాత్రికుడు ఎన్నో సాహస  యాత్రలు చేసారు వాటిలో నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాని కన్నుక్కోవాలని ప్రయత్నించి ఇండియాకి దారి కనుక్కోలేకపోయినాడు, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని తను కనుక్కున  ప్రదేశము ఇండియ అనే చాలా కాలం వరకు  భ్రమలో ఉన్నాడు.   అయతే కొంత కాలం తరువాత  ఆ ప్రాంతం ఇండియా కాదని, ​​అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసింది అప్పుడు మళ్ళీ ఇండియా కనుక్కోవాలని తపన  వారిలో మొదలైనది.  అప్పుడు వారు  కొత్త  దారుల వెతుకు లాట  మళ్లీ మొదలుపెట్టారు .  అప్పుడు పోర్చిగీసు నావికుడు దీనికి పూనుకొని తన సాహస  యాత్ర  మొదలు పెట్టాడు.  వారు ఆ యాత్రలో చాలా కష్టాలు అనుభవించారు.  పెద్ద పెద్ద తుఫానులు,  గాలులు, వర్షాలు ఎన్నో అధిగమించి చిట్ట చివరికి మన ఇండియాని కన్నుక్కున్నాడు.  ఇండియాని చేరక పూర్వం ఇండియా అనుకోని రెండు ప్రదేశాలకు చేరి అవి ఇండియా కాదు అని తెలుసుకొని తన ప్రయాణం కొనసాగించారు.  అ తను ఆఫ్రికా చుట్టూ  వెళితే ఇండియా చేరుకోవచ్చు అని అనుకున్నాడు.  అయితే మూడోసారి ప్రయాణం చేసాక అప్పుడు ఇండియాని కనిపెట్టేసాడు ఈ  సాహస యాత్రికుడు వాస్కోడిగామ.   ఇతను కనుక్కొన తరువాతే అందరికి మన దేశం అందరికి తెలిసిపోయింది.  అప్పుడే మనకు బ్రిటిష్ వారి వంటి వారు చేరి మనలను కస్టాలు పాలు చేసారా అనిపిస్తోంది.  ఈరోజు నాడు 1498 మే 20 న ఈ యాత్రికుడు సముద్ర  మార్గము ద్వారా ఇండియాని అప్పటి కాలికట్  ఇప్పటి కోజికోడ్ ను చేరాడు. ఇంత  పట్టుదలతో ఇండియాని మొట్ట మొదట చేరిన  వాస్కోడిగామ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినందుకు ధన్యవాదములు.        
 

సోమవారం, మే 14, 2012

ఆటలమ్మ

సోమవారం, మే 14, 2012

Chicken pox vaccine
ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.  ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.  అలాంటప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్  అను శాస్త్రవేత్త.    18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్ 1879 లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు.  మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.  చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster) అని తెలుసుకొని దానికి టీకా కనిపెట్టి మొట్టమొదట  ఇద్దరు పిల్లలు మీదప్రయోగిమ్చారు వారు ఇద్దరు పిల్లలు మీద  ఆ మందు బాగా పనిచేసింది.  చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయిచుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.  సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి. అని నిర్ణయించుకున్నారు. 1796 May 14 న  ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.

ఆదివారం, మే 13, 2012

సర్ రోనాల్డ్ రాస్

ఆదివారం, మే 13, 2012


సర్ రోనాల్డ్ రాస్  మలేరియ  చక్రం 
సర్ రోనాల్డ్ రాస్  తెలియని వారు వుండరు అనుకుంటున్నా.  ఈయన ప్రముఖ ఆంగ్లో ఇండియన్ శాస్త్ర వేత్త.  నేడు సర్  రోనాల్డ్ రాస్  పుట్టిన రోజు  సందర్బముగా సింపుల్ గా ఈయన గురించి తెలుసుకుంనే ప్రయత్నం చేద్దాం.  ఈయన మలేరియా పారసైట్ యొక్క జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడినది. ఈయన హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపారు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్" గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.  రొనాల్డ్ రాస్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా లో జన్మించారు. ఇతని తండ్రి జనరల్ సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పనిచేశారు.   ఎనిమిది సంవత్సరాల వయసులో రాస్ ను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండు పంపించారు. రైడ్ లో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత 1869లో సౌతాంప్టన్ లోని బోర్డింగ్ పాఠశాల కు పంపించారు.
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. తర్వాత రోయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం (Membership of the Royal College of Surgeons:MRCS) పొందాడు. ఇతడు 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసు లో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.
Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases హైదరాబాద్ లో ఈ  మలేరియ వ్యాధి గురించి పరిశోధించి విజయం సాధించారు.  ఇందుకు గాను ఈయనికి నోబెల్ బహుమతి ఇచ్చారు.

మంగళవారం, ఏప్రిల్ 24, 2012

రేడియో@మార్కొని

మంగళవారం, ఏప్రిల్ 24, 2012



Radio పితామహుడు గూగ్లీమో మార్కొని గురించి మనం చెప్పుకుందాం.  
వైర్‌లెస్‌ను మొట్ట మొదట  ఇటలీ దేశానికి చెందిన గూగ్లీమో మార్కొని కనుగొన్నాడు. మార్కొని 1874 ఏప్రిల్ 25న ఇటలీలో దేశములో జన్మించాడు. ఈయన  గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రవేట్‌గానే చదువు కొనసాగించాడు. ఈయనికి చిన్నతనము నుండి కొత్తవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనబరిచేవారు.  ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టే ప్రయత్నం చేసేవారు.  ప్రతీ విషయాన్ని బాగా లోతుగా పరిశీలించేవారు.

వివోర్నో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్శించింది. ఆ వ్యాసం పేరు ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది.  అప్పట్లో 1894 నాటికి టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కొని ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకూ తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు.   ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ  ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని  కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో  అని అంటారు.  తన పరిశోధనను ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో బ్రిటిష్ వారికి ఇచ్చాడు. 1897 వ సంవత్సరములో ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.  అప్పట్లో మార్కొని కనుక్కొన్న  రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.  క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్ లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కొని 1909లో భౌతికశాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందాడు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీ లు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి.   అలాంటి రేడియోని కనుక్కొన్న మార్కొని పుట్టినదినము ను గుర్తు చేసుకున్నందుకు  నాకు చాలా సంతోషంగా వుంది.  అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.

గురువారం, ఏప్రిల్ 19, 2012

ఛార్లెస్ డార్విన్

గురువారం, ఏప్రిల్ 19, 2012

మహావిశ్వాన్నీ, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్  చెప్పారు.  మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!.  మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా!  చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809  జన్మించాడు. వీరి తండ్రిగారు తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు.  అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది.  ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడుతన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడుతన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.  175 ఏళ్ల క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది.  చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు.   అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి.  మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి.  డార్విన్  గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని"
NewsListandDetails
లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది.  ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.  అప్పుడు ఆ  యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒకదానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది.  ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19 డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)