Blogger Widgets

గురువారం, ఏప్రిల్ 09, 2015

ధ్వని రికార్డు చేసుకునే యంత్రం

గురువారం, ఏప్రిల్ 09, 2015

మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం.  అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి.  మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం.  అంతకు ముందు  టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు.  వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను  కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం ( Phonautograph ).  
దీనిని మొట్ట మొదట  ఫ్రెంచ్ మెన్  Édouard-Léon Scott de Martinville కనుక్కోనాడు.  దానిమీద పూర్తి అధికారాలు  మార్చి 25 1857 లో పొందాడు.   Edouard-Léon Scott de Martinville.jpg  ఇతను ఫ్రెంచ్ ప్రింటర్ మరియు పుస్తకాలు అమ్మకం వ్యాపారం చేస్తూవుండేవాడు.  వృత్తిరీత్యా అతను ఒక ప్రింటర్, అతను ఎల్లప్పుడూ కొత్త కొత్త  శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి చదువుతూవుండేవాడు మరియు అతను ప్రయోగాలు కూడా చేసేవాడు . స్కాట్ డి MARTINVILLE కాంతి మరియు ఫోటో కోసం ఫోటోగ్రఫీ అప్పటి కొత్త టెక్నాలజీ ద్వారా అతనికి ఆలోచన వచ్చింది.  ఒక విధంగా ఆలోచించి మనిషి యొక్క ప్రసంగం యొక్క ధ్వనిని రికార్డింగ్  చెయ్యాలి అనే ఆసక్తి కలిగింది. 
1853 నుండి ఆయన స్వర శబ్దాలు లిప్యంతరీకరణ యంత్రాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక భౌతిక పాఠ్య పుస్తకం లోని మానవుని శారిర శాస్త్రంలో  చెవి అంతర్బాగం  డ్రాయింగ్లు వున్నాయి . అతను కర్ణ భేరిని చూసి దాని మాదిరిగా, ఒక దీపపు మసితో కవర్ అయిన ఒక కాగితం, చెక్క లేదా గాజు ఉపరితలంపై వత్తుతారు ప్రతిపాదిత ఒక stylus తో చిన్న ఎముక కోసం లేవేర్ యొక్క ఒక ధారావాహిక కొరకు సాగే పొర చొప్పిస్తూ ఒక యాంత్రిక పరికరం ను తయారు చేసారు. జనవరి 1857 26 న, అతను ఫ్రెంచ్ అకాడమీకి  తన సీల్ చేయబడిన కవర్లో డిజైన్ అందించాడు. 

Phonautograph ను తయారు చేయటానికి ఒక దీపం నలుపు పూత, చేతితో త్రిప్పే క్రాంక్ సిలిండర్పై ఒక చిత్రం చెక్కబడివుంది.  ఇది ఒక గట్టి bristle తో కంపింపచేసే ఇది ఒక డయాఫ్రమ్ జత, ధ్వని సేకరించడానికి ఒక కొమ్ము ఉపయోగించారు . స్కాట్ ధ్వని వాయిద్యం మేకర్ రుడోల్ఫ్ కోనిగ్ సహాయంతో పలు పరికరాలను నిర్మించారు. 1877 యొక్క ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాకుండా, ఫోనోగ్రాఫ్, Phonautograph మాత్రమే ధ్వని మరియు దృశ్య చిత్రాలు రూపొందించినవారు.  కానీ దానిని రికార్డింగ్ ఆడడానికి వీలు లేదు. స్కాట్ డి MARTINVILLE యొక్క పరికరం మాత్రమే ధ్వని తరంగాల శాస్త్రీయ పరిశోధనలు కోసం ఉపయోగించారు.

స్కాట్ డి MARTINVILLE ధ్వని రికార్డర్ ను మాత్రమె శాస్త్రీయ ప్రయోగాల కోసం ప్రయోగశాల లో ఉపయోగించేవారు. అంతే కాదు  phonautographs అమ్మకములను కూడా చేయగలిగారు .  ఇది అచ్చు శబ్దాలు యొక్క అధ్యయనానికి ఉపయోగపడుతుంది అని నిరూపించాడు. 

శనివారం, మార్చి 14, 2015

Take a look about Albert Einstein

శనివారం, మార్చి 14, 2015

Today is Albert Einstein's birthday.  So take a look about Einstein
Documentary on the Life and Discoveries of Physicist Albert Einstein.


బుధవారం, జనవరి 08, 2014

అపర మార్కండేయుడు స్టీఫెన్ హాకింగ్

బుధవారం, జనవరి 08, 2014

తనంతట తాను కనీసం కదలలేని ఎలాంటి సహకారం లేని శరీరము, మాట్లాడాలి అంటే కంప్యుటర్ సహాయంతో చక్రాల కుర్చికి అతుక్కుపోయిన మనిషి అతి అరుదైన మోటార్ న్యురాన్ వ్యాధి కలిగి తన శరీరాన్ని మొత్తం పనిచేయకుండా వుంన్నా కూడా విచిత్రంగా అతని మెదడు మాత్రమె పూర్తిగా పనిచేస్తుంది .    ఇది కేవలము అరుదైన విషయం వైద్య శాస్త్రానీకె పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు.  ఇదంతా కేవలము ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క సంకల్ప బలం మాత్రమె.  అతనికి వచ్చిన వ్యాధి చాలా అరుదైన ప్రమాదకరమైనది. ఆవ్యాధిని కూడా లెక్కచేయకుండా అపరమార్కండేయుడుగా వున్నవాడు స్టీఫెన్ హాకింగ్.  కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే.
అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది.  గెలిలియో మరణించి న రోజు జనవరి 8వ తేది నాడే 1942 వసంవత్సరం జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.  లండన్ లోని హైగేట్స్ లో స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించాడు. మిల్ హిల్ ప్రాంతములో తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా, కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా, స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల xbvbdng ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూకాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. 
"శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి అవిఅన్నీ పూర్తిచేస్తాను" అంటారు హాకింగ్.   
అతనికి వచ్చిన ముఖ్యమైన అవార్డులు Prince of Asturias Award 1989 లోను Copley Medal 2006 లోను వచ్చాయి.  
అపర మార్కండేయుడు సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాలబిలాలు,Theoretical cosmology,Quantum gravity అవిష్కారవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు. 

శనివారం, జనవరి 04, 2014

అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ

శనివారం, జనవరి 04, 2014

ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  ఈ రోజు ఆయన పుట్టినరోజు.
లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా. మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను.  గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది.  వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు.  దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి. 

మనం చనిపోయాకా ఎందుకూ పనికి రాని కళ్ళను దానం ఇచ్చి వేరే ఇద్దరికి చూపునిచ్చినవారం అవుతాము. దయచేసి నేత్రదానం చేయండి. 

గురువారం, జనవరి 02, 2014

జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసిన డా.ఖురానా జయంతి

గురువారం, జనవరి 02, 2014

జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసినది  డా.హరగోవింద ఖురానా .  ఈయన పంజాబ్ లోని  కుగ్రామం రాయ్‌పూర్‌లో 1922  జనవరి 2  న లో జన్మించారు. ఈ గ్రామము ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్నది. ఆ గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.  Massachusetts Institute of Technology (MIT) జీవ, రసాయనిక శాస్త్ర విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 

ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. 
మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.  డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు. 

పేదరికంలోనూ తమను చదివించేందుకు తన తండ్రి తన జీవితాన్నే అంకితం చేశారని ఖురానా తన ఆత్మకథలో రాసుకున్నారుఅతని విజయంలో ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు బాగా support  గా నిలిచారని.  తన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వ నకు  ఒక పట్వారి  (ఒక వ్యవసాయ పన్నుclerk) గా పనిచేసేవారనీ .దాదాపు వంద కుటుంబాలు గల తమ స్వగ్రామంలో అక్షరాస్యత సాధించిన తొలి కుటుంబం తమదేనని ఆయన చెప్పుకున్నారు. ముల్తాన్ వద్ద హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఖురానా, పంజాబ్ వర్సిటీ నుంచి 1943లో కెమిస్ట్రీలో డిగ్రీ, 1945లో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే, బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. అక్కడే ఆయన 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు సాగించారు. తను ఈ స్తాయికి చేరటానికి జీవితంలో చాలా కష్టపడ్డారని తన biography లో రాసుకున్నారు.

కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు.  ఈయన నవంబర్ 9 , 2011  న పరమపదించినారు.

సోమవారం, నవంబర్ 18, 2013

భారత జాతీయ జంతువు గా పెద్దపులి

సోమవారం, నవంబర్ 18, 2013

1972 నవంబర్ 18 వ తేదిన భారత జాతీయ జంతువు గా పెద్దపులి'ని స్వీకరించారు. పులిని మన ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించింది.  పులి భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కి కూడా జాతీయ జంతువు. శాస్ర్తీయనామం పాంథేరా టైగ్రిస్‌. టైగర్‌ అనే పదం గ్రీకు భాషలోని టైగ్రిస్‌ నుండి వచ్చింది. దాని అర్థం బాణం. పాంథేరా అంటే పసుపు జంతువు అని అర్థం. సుమారు 11 అడుగుల పొడవు, 300 కిలోల వరుకు బరువు ఉంటుంది. సుమారు 5 మీటర్ల దూరం వరకు దూకుతుంది. గంటకు 65 కిమీ వేగంతో పరుగెడుతుంది. పులి ఒంటి మీద దాదాపుగా 100 చారలు ఉంటాయి. ఏ రెండు పులుల ఒంటి మీద చారలూ ఒకేలా ఉండవు. గత వందేళ్లలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పులులు మనగాడకు అనేకమైనవి ప్రశ్నార్ధకముగా మార్చేస్తున్నాయి.  పాలకుల నిర్లక్ష్యం ముఖ్యముగా చెప్పుకోవచ్చు.  పెద్దపు లులను భవిష్యత్‌ తరాలు జూలోనే చూసేలా పరిస్థితులు తయారవుతున్నాయి. నాగరిక సమాజం పులుల పాలిట శాపంగా మారుతోంది. శాస్ర్తీయ అధ్యయనాలు, గణాంకాలను చూస్తే చేదు నిజాలు వెల్లడవుతున్నాయి. పెద్ద పులి ఉందంటే ఆ అడవిలో పర్యావరణ సమ తుల్యంపరిఢవిల్లుతుందనేది అటవీ అధికా రుల నమ్మకం. ఒక పులి సంచరించే ప్రాం తం చుట్టుపక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్‌ పిరమిడ్‌లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతోకూడిన దట్టమైన అడవి అయ్యి ఉండాలి. ఇది పెద్దపు లి రాజసం. మన దేశంలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జాతి. సైంటిస్టులు రాణా టైగర్‌గా వ్యవహరించే ఈ పులిని మన ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించింది.  పులి (పాన్థెర టైగ్రిస్ )ఫెలిడే కుటుంబానికి చెందినది;పాన్థెరా తరగతికి చెందిన నాలుగు "పెద్ద పిల్లులలో" ఇది ఒకటి. భారతదేశం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అడవులలో నివసించే పులుల జనాభాను కలిగి ఉన్న దేశం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం, ప్రపంచంలోని 3,500 పులులలో, 1,400 భారత దేశంలోనే ఉన్నాయి.  పూర్వకాలములో ను పులులు ఎక్కువగా వుండేవి ప్రజారక్షణ కారణంగా రాజులు వాటిని వేటాడేవారు.  ఇప్పుడు వాటికే రక్షణ కరువైంది అనటంలో ఎటువంటి సందేహము లేదు.  పులులు ను వేటాడటానికి , స్మగ్లింగ్ చేయటానికి కారణం పులి చర్మం, గోర్లు, దంతాలు చాలా విలువైనవి గా భావిస్తున్నారు  అందుకే ఇవన్ని ,  అంతేకాదు పులిలో ఔషధగుణాలు వున్నాయి అని నమ్ముతారు.  నిజానికి అలాగేమీ లేదు.  అలా ఔషధగుణాలు వున్నట్టు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారాలు లేనేలేవు.  అందువల్ల మన జాతియజంతువుకు హానికలగకుండా,  రక్షణ ఏర్పరచాలి.  ప్రభుత్వం వాటి మనుగడను కోల్పోకుండా మంచి చర్యలు తీసుకోవాలి.  

ఆదివారం, నవంబర్ 10, 2013

తెలుగుభాషా సాహితీ కర్ణుడు బ్రౌన్.

ఆదివారం, నవంబర్ 10, 2013

1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్. 
1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు పిల్లవాడే ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి! ఒక్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.  సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు.1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చినగుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు.

తెలుగు భాషకు చేసిన సేవ

వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంక్యాఖం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.
"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
చిత్తు కాగితాలు గా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి,  ఆ గ్రంధాన్ని పునర్ముద్రించాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.
ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ “ఇంగ్లిష్ – తెలుగు”, “తెలుగు-ఇంగ్లిష్” dictionary ని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు.

రచనలు
ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కధల తెలుగు అనువాదం
రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను రాసి, 1852, 1854లో ప్రచురించాడు.
తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం 
బ్రౌన్ గురించి తెలుసుకోవాలని నాకు జిజ్న్యాస కలిగించిన నాటకం 
తెలుగు సాహితీ పూ తోటను కాపాదడటానికి  వచ్చిన తోటమాలి బ్రౌన్ తెలుగు భాషాబిమానులందరికి జయంతి  శుభాకాంక్షలు  

గురువారం, నవంబర్ 07, 2013

భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్

గురువారం, నవంబర్ 07, 2013


ఆకాశం నీలంగా వుండడానికి, పగలు నక్షత్రాలు కనిపించకపోడానికి కారణాలు వివరించిన మహా శాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌... వి.రామన్‌ చరిత్ర పుటలకు ఎక్కారు. ప్రపంచ వ్యాప్తంగా భారతావనికి వన్నె తెచ్చిన సి.వి.రామన్‌ తిరుచురాపల్లి సమీపంలో 1888 వ సంవత్సరం నవంబర్ 7న జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1928 ఫిబ్రవరి 28న సి.విరామన్‌ ''రామన్‌ ఎఫెక్ట్‌'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. మనదేశంలో పుట్టి, మనదేశంలోనే చదువుకొని, మనదేశంలోనే పరిశోధన చేసి, తన అత్యంత ... 1928లో రామన్‌కి ''సర్‌'' బిరుదు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది.  భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ . 
భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది.  రామన్ పరిశోధనల్లో సౌందర్య దృష్టికి ప్రాముఖ్యతనిచ్చి ప్రకృతిపై దృష్టి సారించారు. సంగీతంలోని స్వరాలు,ప్రకృతిలోని రంగులు, ఆకాశం, నీటి రంగులు, పక్షులు, సీతాకోక చిలుకల అందాలు, నవరత్నాలు, నత్తగుల్లలు, వజ్రాలు ఇతని పరిశోధనా వస్తువులు."ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. "అని చెప్పారు రామన్. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం" అన్నారు. గులాబీ తోటను అమితంగా ప్రేమించేవారు.


SIR CV Raman's Interview 

రామన్ ఫలితము - అనువర్తనాలు(ఉపయోగాలు)
  • అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
  • స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
  • కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • పలుచటి రాళ్ళలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
  • మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
  • మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
  • డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
  • పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్ళు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
  • మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
  • వివిధ రకాలైన మందులు, ఔషధాలు డి.యన్.ఏ.పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
  • వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
  • జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
  • ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
  • ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
  • ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
  • కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
  • ఘన పదార్ధల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ జయంతి శుభాకాంక్షలు 

శుక్రవారం, నవంబర్ 01, 2013

"ధన్వంతరి"

శుక్రవారం, నవంబర్ 01, 2013

ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.

గురువారం, అక్టోబర్ 31, 2013

ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం

గురువారం, అక్టోబర్ 31, 2013

'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా పైదాకరేగా' అనేది హిందీ సామెతలో ఒకటి తెలుగులో ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం తయారు అవుతుంది అని .  ఒక్క రూపాయి అంటుంది నన్ను వంద వరకు పెంచు తరువాత నిన్ను నేను పెంచుతాను అని ఇవన్నీ మీకు తెలిసినవే,  ఇవన్ని పోడుపుగురించి చెప్పటానికే పుట్టినవి. కాలు వంకర పోకుండానే, కంటిచూపు తగ్గిపోకుండానే వీలైనంత కూడబెట్టు అనేదే మన పెద్దలు మనకి వుగ్గుపాలతో నేర్పే మొట్టమొదటి ప్రాథమిక ఆర్థిక సూత్రం. 'సేవ్‌ ఫర్‌ ఎ రెయినీ డే, టు మేక్‌ ఇట్‌ ఆల్‌సో ఎ సన్ని డే' అన్న ఇంగ్లిష్‌ సామెతలో కూడా, పొదుపు యొక్క  ప్రాముఖ్యత తెలుస్తోంది .  ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే  ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా అందుకే మరి .  ఈ పొదుపు దినోత్సవం గురించి చెప్పాలనుకుంటున్నాను.  1924, అక్టోబర్‌ 31వ తేదీన, ప్రప్రథమ ‘ఇంటర్నేషల్‌ థ్రిఫ్ట్‌ కాంగ్రెస్‌’ సమావేశం ముగి సిన వెంటనే, ప్రొఫెసర్‌ ఫిలిప్పో రవిజ్జా ఆరోజుని, ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’గా సాధికారంగా ప్రకటించారు. సామాన్య పౌరులకి ‘పొదుపు’లోని ముఖ్యత్వాన్ని వివరించడం ఈ ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’ ముఖ్యోద్దేశం. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న సేవింగ్స్‌ బ్యాంక్స్‌ అన్నీ ‘వరల్డ్ సేవింగ్స్‌ డే’ని వైభవోపేతంగా జరుపుకోవడం ఆరంభించాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ‘ఇంటర్నేషనల్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కి చెందిన 940 సేవింగ్స్‌ బ్యాంక్స్‌ క్రియాశీల కంగా,నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి.ఏటేటా, అక్టోబర్‌ 31వ తేదీనాడు, ‘వరల్‌‌డ సే వింగ్స్‌ డే’ / ‘వరల్డ్‌ థ్రిఫ్ట్‌ డే’ జరుపుకునే సందర్భంలో, ప్రపంచమంతటా కొన్ని రిటేల్‌ బ్యాంక్స్‌ వారం రోజుల పాటు, వైభవంగా వు త్సవాలు నిర్వహిస్తూ, ‘పొదుపు’ ప్రాముఖ్య త విషయంలో, ప్రజలలో చైతన్య స్ఫూర్తి కలిగిం చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అలా, చిన్న చిన్న మొత్తాలతో ‘పొదుపు’ చేసుకోవడ మనే అలవాటుని ప్రజలలో కలిగించాలనే సదాశయం ఈనాటికి ఒక మహోద్యమంగా రూపొంది, ప్రపంచ వ్యాప్తమైపోయింది.  అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విధ్యుత్ ను పోదుపు చేయటం, నీటిని, ఆహారాన్ని,  అనావసరంగా వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. చిన్న పిల్లలకు  పొదుపు యొక్క విశిష్టత చిన్న తనము నుండే అలవారచాలి . ప్రతిమనిషి తను సంపాదించిన దానిలో పూర్తిగా 20% పొదుపు చేసుకోవాలిట.  మరి మీరుకూడా పోడుపుచేయటం మొదలుపెట్టండి మరి .  అందరికి ప్రపంచ పొదుపు దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్ జన్మదిన శుభాకాంక్షలు.

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్  జన్మదిన శుభాకాంక్షలు.
వారెన్ బఫ్ఫెట్  ఒక యు.ఎస్ ముదుపరి, వ్యాపారవేత్త, మరియు లోకోపకారి.  చరిత్రలో విజయవంతమైన ముదుపరులలో ఒకరు, బెర్కషైర్ హాత్అవే కి C.E.O మరియు దానిలో అతిపెద్ద వాటాదారుడు,మరియు సుమారు $62 లక్షల కోట్ల నికర ఆదాయము కలిగి ప్రపంచములోనే అధిక ధనవంతుడిగా 2008 లో ఫోర్బ్స్ పత్రిక చేత పరిగణించబడ్డాడు.
బఫ్ఫెట్ "ఒమాహా సర్వజ్ఞుడు" గా తరుచుగ పిలవబడ్డాడు.లేదా "ఒమాహా రిషి"  గా పిలవబడ్డాడు మరియు విలువైన ముదుపు సిద్దాంతము నకు అంటిపెట్టుకొని ఉండటము మరియు అధిక సంపద ఉండి కూడా పొదుపరిగా ఉండటానికి ప్రసిద్ది చెందాడు. 

ఆదివారం, అక్టోబర్ 27, 2013

సింగర్ కుట్టు మిషను

ఆదివారం, అక్టోబర్ 27, 2013


                          ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27 , 1811 - జూలై 23 , 1875మొదటి అమెరికన్ multinational company స్థాపకుడు కుట్టు యంత్రం రూపకర్త ,  నటుడు మరియు పారిశ్రామికవేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరన అయిన కుట్టు మిషను ను ఆవిష్కరించాడు. ఈయన సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు.   అతను 1811 లో అప్ స్టేట్ న్యూయార్క్లోని జన్మించారు , మరియు యంత్రాలు , థియేటర్ , మరియు మహిళలు ఆసక్తి అభివృద్ధి చేయబడింది - బహుశా ఆ క్రమంలో . అతను , 12 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలి బేసి ఉద్యోగాలు పట్టింది , మరియు నాటక నటుల ప్రయాణిస్తున్న బృందంలో ఏర్పాటు . అతను కూడా మహిళల స్ట్రింగ్ తో సంబంధాలు ప్రారంభించారు .
బోస్టన్ లో 1850 లో పెద్ద మనిషి అతనికి కొద్దిగా విజయవంతమైన Lerow మరియు Blodgett కంపెనీ చేసిన ఒక కుట్టు యంత్రం మెరుగుపరిచేందుకు, ఒక సృష్టికర్త వలె తనను తాను  సింగర్ కోరారు. బదులుగా యంత్రం మరమ్మతు , సింగర్ ఫాబ్రిక్ ఆహారంగా అద్దకం అడుగుల ఇన్స్టాల్ ద్వారా పునఃరూపకల్పన . ముఖ్యంగా , కొత్త డిజైన్ దాని చివర సూది పట్టుకొని , worktable విస్తరించి ఒక ఆర్మ్ వంటి ఉపకరణం ఆవిష్కరణతో తక్కువ పోగులు తెగిపోవటం వలన . ఇది చేతితో కుట్టు మొట్టమొదటి ఆచరణాత్మక స్థానంలో , మరియు అది , 40 కుట్లు పడ్డాయి సాధారణ పని ఒక నిమిషం యొక్క ఒక నిష్ణాత కుట్టేది యొక్క ఓవర్ రేటు నాటకీయమైన అభివృద్ధి నిమిషానికి 900 కుట్లు సూది దారం ఉపయోగించు కాలేదు .
మొదటి సింగర్ యంత్రాలు చాలా ఖరీదైన మరియు స్థూలమైన ఉన్నప్పుడు , ఆవిష్కర్త వెంటనే మార్చుకోవటానికి వీలున్న భాగాలుగా యొక్క సామూహిక ఉత్పత్తి వ్యవస్థను తీసుకుంది మరియు పరిమాణం మరియు బరువు యంత్రాలు తగ్గించేందుకు పని . ప్రారంభం నుండి , అతను గృహిణులు అమ్మే లక్ష్యంతో గృహాలు లోకి వాణిజ్య మార్కెట్ గత చూసారు . శుద్ధి తర్వాత , సింగర్ వాటిని సగటు అమెరికన్ కుటుంబం స్థితి మరియు స్వావలంబన యొక్క అందుబాటులో చిహ్నాలు మేకింగ్ , $ 10 ప్రతి తన యంత్రాలు అమ్మగలిగింది . తన భాగస్వామి , ఎడ్వర్డ్ క్లార్క్ , అమ్మకాలు పెరగడానికి దీనివల్ల , వాయిదా కొనుగోలు ప్రణాళికలు మరియు వ్యాపార ఇన్ ముందున్నారు .
సింగర్ దేశవ్యాప్తంగా సేవ నెట్వర్క్ సృష్టించడం , అందమైన దుకాణములు , మరమ్మత్తు మెకానిక్స్ , కుట్టు బోధనా సిబ్బంది, మరియు వేగవంతమైన భాగాలు పంపిణీ అమ్మకాలు మద్దతు . మరియు దాని ఉత్పత్తులను విదేశీ తయారీ విస్తరించింది . 1863 ద్వారా , ఎబెనేజేర్ Butterick అనే దర్జీ దుస్తులు నమూనాలను అమ్మడం ప్రారంభించారు ఉన్నప్పుడు , సింగర్ అమెరికా యొక్క అత్యంత ప్రజాదరణ కుట్టు యంత్రం మారింది . సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని కుట్టుకొనుటకు వాడతారు.  SINGER brand has earned the 2013 Women's Choice Award® for America's Best for Home Sewing Machine

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. 1973లో మరణించాడు.
1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'.  1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.  1962 లో అతడు ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్(International Lenin Peace Prize)ను అందుకొన్నాడు.

గురువారం, అక్టోబర్ 24, 2013

ఐక్యరాజ్య సమితి దినోత్సవం

గురువారం, అక్టోబర్ 24, 2013

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్నినివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికారష్యాబ్రిటన్చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.  
ఐక్యరాజ్య సమితి  ఆశయాలు:

  1. యుద్ధాలు జరగకుండా చూడటం,
  2. అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
  3. దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
  4. అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
  5. సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.
 ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు కలవు.
  1. సర్వ ప్రతినిధి సభ
  2. భద్రతా మండలి
  3. సచివాలయం
  4. ధర్మ కర్తృత్వ మండలి
  5. ఆర్థిక, సాంఘిక మండలి 
  6. అంతర్జాతీయ న్యాయస్థానం

సోమవారం, అక్టోబర్ 21, 2013

నోబెల్

సోమవారం, అక్టోబర్ 21, 2013

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోంస్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమోఇటలీ
ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు.ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంధానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.  
నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

ఆదివారం, అక్టోబర్ 06, 2013

IPC (ఇండియన్ పీనల్ కోడ్) ఏర్పడి నేటికి 153 సంవత్సరాలు పూర్తి

ఆదివారం, అక్టోబర్ 06, 2013

IPC (ఇండియన్ పీనల్ కోడ్) ఏర్పడి నేటికి 153 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా ఇండియన్ పీనల్ కోడ్ ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.  చరిత్ర లోకి వెళ్ళాలి మరి అదితెలుసుకోవాలి అంటే  :)
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది. భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.  ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము, కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని పిలుస్తారు.  
ఇండియన్ పీనల్ కోడ్ మొట్ట మొదట 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ rough గా 1860 లో, మొదటి లా కమిషన్ అజమాయిషి లో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే. ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతీయ సమాజాలలోను, విద్య పరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీలోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు (ఏ.టి.ఎమ్), సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది. 
గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు.


లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'rough' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారతదేశ మత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' rough ని తయారు చేశాడు. 
1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ rough, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.  పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి). బంగ్లాదేశ్కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా (మక్కికి, మక్కి) అమలు చేస్తున్నాయి.
లార్డ్ మెకాలే తయారుచేశిన 'rough' ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించారడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు,ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేదు. కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు. ఇతను అవివాహితుడు.
ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంధం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)