Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

Catch Me Live

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

ఆకాశంలో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆ హరివిల్లు కూడా సాయంత్రం 05:00 నుండి సాయంత్రం  06:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలముప్రత్యక్ష ప్రసారము మాత్రమే కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.

మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే

Radio Josh
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype Me™!
                                                                                
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

ధన్యవాదములు 

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

ఈ పాదమే కదా

బుధవారం, సెప్టెంబర్ 18, 2013


ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది 
ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది

ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది 
ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది 
ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది


ఈ పాదమే కదా యిభరాజు దలచినది 
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది 
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది


ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది 
ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము 
ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

సుబ్బలక్ష్మి గారి జయంతి శుభాకాంక్షలు.

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

"Nightingale" of Carnatic music

ఆమె పాట పాడకపోతే దేవుళ్ళ క్కూడా తెల్లవారనే తెల్లవారదు!? తెరతీయగ రాదా అంటూ పాట పాడుతూ వుంటే ఆ దేవదేవుడు మేలుకోకుండా వుండగలడా.   తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమె పొందిన గొప్పవరం.  ఆమె కారణ జన్మురాలు అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా! 
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతీ తెలుగువాడి గుండెల్లోను భక్తి భావం కలుగుతుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదకరంగా  వుంటుంది.
ఆమె ఎవరో కాదు మనం అందరికి M . S  గా బాగా తెలిసిన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి సంగీత సరస్వతి.  మనదేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గొప్ప  గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు. ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్.   ఆమెను చూడగానే ఒక దేవతను చూసినట్టు వుంటుంది. 
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ MS గురించి ఇలా అన్నారు  "సుబ్బులక్ష్మి గారు సంగీతం రాణి నేను  కేవలం ప్రధాన మంత్రిని".  
సుబ్బలక్ష్మి గారి జయంతి నేడు ఆమె జయంతి సందర్భముగా ఇక్కడ కొన్ని మంచి పాటల లింక్స్.  వినండి. 

  1. అఖిలాండేశ్వరి
  2. అన్నపూర్ణేశ్వరి
  3. బంటురీతి
  4. భావములోన
  5. భాగ్యద లక్ష్మి బారమ్మా
  6. భజ గోవిందం
  7. భావయామి గోపాల బాలం
  8. భావయామి రఘురామమం 
  9. బ్రహ్మ కడిగిన పాదం
  10. బ్రోచేవారెవరురా
  11. దసన మదికో ఎన్నా
  12. దేవాది దేవ
  13. ఎందరోమహానుభావులు
  14. ఎవరిమాత
  15. గణేష పంచరత్నం (ముదాకరాత్త మోదకం) 
  16. హనుమాన్ చాలీస
  17. జగదోద్దారన
  18. జో అచ్చుతానంద
  19. కాలై నిరాయ్ గణపతే
  20. కాన్చదలయదక్షి
  21. లక్ష్మి అష్టోత్తరం
  22. మరుగేలర
  23. మీరా భజన
  24. నారాయణ నిన్నే నమ్మేద
  25. నామ రామాయణం 
  26. ఒకపరి ఒకపరి
  27. పాలించు కామాక్షి 
  28. రామ రామ గుణసీమ
  29. సరగుణ పాలింప
  30.  సీతమ్మ మాయమ్మ
  31. శివ శివ శివ భు
  32. శ్రీమన్నారాయణ
  33. శ్రీనివాస తిరువేంకట
  34. శ్రీ రంగ పుర విహార
  35. వనజాక్షి
  36. వేంకటేశ్వర సుప్రభాతం
  37. విష్ణు సహస్రం                                      

సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భముగా  ఆమె అభిమానులందరికి సుబ్బలక్ష్మి గారి జయంతి శుభాకాంక్షలు.  

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

వినాయకుని మణిహారమ్

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

తొండమునే కదంతమును తోరపు బొజ్పయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు  గజ్జెలును మెల్లని చూపులు మంద హాసమున్
కొండొక గజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ మోయి గణాధ పనీకు మ్రొక్కెదన్ || 1

తొలతన విగ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెదనే కదంతనా
వలపటి చేతి గండమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణా ధీప! లోక నాయకా ! 2

తలచితినే గణనాధుని! తలచితినే విగ్న పతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విగ్నములను తొలగుట కొరకున్ || 3

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను బ్రాలు చెరకుర సంబున్
విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందు చేత ప్రార్ధింతు మదిన్ || 4

అంగముజేరి శైలతనయాస్తన దుగ్ద ములాను వేళబా
ల్యాంక విచేష్ట తుండమున యవ్వలి చన్గ వళింపబోయియా
వంకకుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
ళాంకుర శంకనంటెకు గజాస్యునిగొల్తు నభీష్ట సిద్దకిన్

ఈశునంత వాని నెదిరించి పోరాడి
మడిసినానిచేతె మరల బ్రతికి
సర్వవంద్యుడైన సానుజవదనకున్
అంజలింతు విఘ్న భంజనునకు

"తలచెదనే గణనాథుని 
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 
దలచెదనే హేరంబుని 
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌" 

"అటుకులు కొబ్బరి పలుకులు 
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్రసుతునకు 
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌."

విద్యార్ధులకు  వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.


శ్రీ వినాయక పూజ విధానం 

ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||

పదహారు రూపాల గణపతులు.

 1. బాలగణపతి 2. తరుణగణపతి 3. భక్తగణపతి 4. వీరగణపతి 5. శక్తి గణపతి 6. ధ్వజ గణపతి 7. పింగళ గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విఘ్న గణపతి 10. క్షిప్ర గణపతి 11. హేరంబ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. భువనేశ గణపతి 15. నృత్త గణపతి 16. ఊర్ధ్వగణపతి.

వినాయకుని అందమైన పాటల మణిహారమ్ 


ఆదివారం, సెప్టెంబర్ 01, 2013

Catch me Live

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013


శనివారం, ఆగస్టు 31, 2013

ఆట పాటల మేటి ఆదిభట్ల

శనివారం, ఆగస్టు 31, 2013


 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధానిగా రాణించారు.  మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు హరికథసృష్టి చేశారు. వారు హరికథను సర్వ కళల సమాహారంఅని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ,  సంస్కృతంలోను,  అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర శ్రీరామ కథ, తెలుగు హరికధలుహరికధామృతం పేర శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి  హరికథ ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరమరియు హరికథ పితామహలాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరబిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే పంచముఖిఅంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతిఅనడం అతిశయోక్తి కానే కాదు.   నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటిఅనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  
శ్రీ కృష్ణ మాయ హరికధ 
 ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైనఅనన్య సామాన్యమైనఅనితర సాధ్యమైనఅజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా  వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం.   హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.  

బుధవారం, ఆగస్టు 28, 2013

శ్రీ కృష్ణాయ ఇదం నామమ! శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

బుధవారం, ఆగస్టు 28, 2013


శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
ఈ  భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.  శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన
వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణజన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడు  గుర్తు వచ్చేస్తాడు.  శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన  చెరసాలలో జన్మించాడు. 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు
,
 కీర్తనలు పాడతారు.   వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
  దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీ కృష్ణుడు జన్మించినాడు.  అప్పుడు శ్రీ మహా విష్ణు ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.శ్రీ కృష్ణుని జన్మించిన విషయం ఎవరికీ తెలియకుండా వుంది. వాసుదేవుడు ఆ చిన్ని శ్రీ కృష్ణుని దేవకీ నుండి తీసుకుని యమునా నదిని దాటి మరి యశోదమ్మ దరికి చేరి ఆమె పక్కలో పడుకోబెట్టి.  యశోదకు జన్మించిన మాయను తీసుకుని వెళ్లి పోయాడు.  యశోదమ్మ దగ్గర బిడ్డను చూసి అక్కడ జనులు ఈ విధంగా అనుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు. 
 
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞాన  జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.  
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ గోపికలుకు మాయ ఆవహించి వుండటం వాళ్ళ ఆ నల్లవాడు చేసే అల్లరిని తట్టుకోలేక యశోదమ్మకు పిరియాదులు చేస్తున్నారు.  ఆ అల్లరిని వారు ఎంతో ఆనందంగా అనుభవించేవారు.  మరి ఈ పిరియాదులు చూడండి మరి. 
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి నామృతాన్ని ప్రసాదించాడు.

శ్రీ కృష్ణుని జననం :
సత్యసంకల్పుడైన పరమాత్మ స్వాయంభువమనువు కోరికెను తీర్చెందుకు, తొలి జన్మ లో పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి కస్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి వసుదేవులకు గొవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ నిర్వహించలేని నిస్సహాయ స్థిథి లో ఉన్నాడు, స్వామి జననము కారాగౄహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము లాడిరి రంభాది కాంతలానందమునన్ గూడిరి సిద్ధులు, భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!! అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.



దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!

లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.

చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండువ చెసాడు .

అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము నేడే. కృష్ణుడు భూమి పై పుట్టింది మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది. దశవతారాలలో కృష్ణవతారం ఎనిమదవది.  స్వామి జన్మించింది ఎనిమిదవ నెలలోనే...అష్టమి తిధి నాడు. కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమదవిది.

దేవతల విశిష్ట గుణాలను అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.

నిర్గుణ పరబ్రహ్మం ధర్మ సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు ! మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక కల్యాణము కోసము ఎన్నో చేసాడు.
భారతయుద్ధం ప్రారంభములో విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
చాలామంది ముగ్గులతో కృష్ణ పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఎకాకృతితో వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
శ్రీ

ఆదివారం, ఆగస్టు 18, 2013

Catch me Live @ 5:00 PM

ఆదివారం, ఆగస్టు 18, 2013



గురువారం, ఆగస్టు 15, 2013

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు . బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

గురువారం, ఆగస్టు 15, 2013

100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా  సంకెళ్ళ నుండి     విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య 
దినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరము మనము 67వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము.
ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.
దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.
మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. 
చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం. అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ. 
వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 pm

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 Pm to 6:00 pm 

Stay Tune With 
RadioJosh  Masth Maza Masth Music.



2day's Topic : 
About Independence Day.
U r's Fav Freedom fighters.
U r's Fav Patriotic Song.
Skype Me™!

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)