దో - జథా సుఅంజన అంజి దృగ , సాధక సిద్ధ సుజాన ||
కౌతుక దేఖత సైల బన , భూతల భూరి నిధాన || 1 ||
చౌ - గురు పద రజ మృదు మంజుల అంజన | నయన అమిఅ దృగ దోష బింభజన ||
తెహిCకరి బిమల బిబేక బిలోచన | బరనఉC రామ చరిత భవ మోచన || 1 ||
బందఉC ప్రథమ మహీసుర చరనా | మోహ జనిత సంసయ సబ హరనా ||
సుజన సమాజ సకల గున ఖాని | కరఉC ప్రనామ సప్రేమ సుబానీ || 2 || సజ్జనుల మహిమ
సాధు చరిత సుభ చరిత కాపాసు | నిరస బిసద గునమయ ఫల జాసూ ||
జో సహి దుఖ పరఛిద్ర దురావా | బందనీయ జెహిC జగ జస పావా || 3 ||
ముద మంగలమయ సంత సమాజా | జో జగ జంగమ తీరధరాజూ ||
రామ భక్తి జహఁ సురసరి ధారా | సరసఇ బ్రహ్మ బిచార ప్రచారా || 4 ||
బిధి నిషేధమయ కలిమల హరినీ | కరమ కథా రబినందని బరనీ ||
హరి హర కథా బిరాజతి బేని | సునత సకల ముద మంగల దేనీ || 5 ||
బటు బిస్వాస అచల నిజ ధరమా | తీరథరాజ సమాజ సుకరమా ||
సబాహి సులభ సబ దిన సబ దేసా | సేవాత సాదర సమన కలేసా || 6 ||
అకథ అలౌకిక తీరథరాఊ | దేఇ సద్య ఫల ప్రగట ప్రభాఉ || 7 ||
గురుదేవునిపాదపద్మరజము కోమలమైనది. మనోజ్ఞమైనది. అది నేత్ర దోషములను రూపుమాపు నయనామృతసిద్దాంజనము. ఈ అంజనముచే నామనోనేత్రములను నిర్మలమొనర్చుకొని, సంసారబంధములనుండి విముక్తి ప్రసాదించు శ్రీరామచరిత వర్ణించెను . అజ్ఞానజనితములైన సందేహాలను పారద్రోలు భూసురోత్తములకు ముందుగా వందనములాచరించుదును. అనంతరము సద్గుణసంపన్నులగు సాధువులకును, సత్పురుషులకును వినయముతో ప్రణమిల్లేదను. ప్రత్తి ఎండినదై, స్వచ్ఛమై గుణమయమై ఉండును. అట్లే సాధువుల చరిత్ర అనాసక్తమై పాపరహితమై సద్గుణ సంపన్నమై అలరారును . వడకుట, నేయుట మొదలగు సందర్భములలో ప్రత్తితాను కష్టములను సహించి , ఇతరుల ఛిద్రములను కప్పివేయును. గొప్పకీర్తిని సంపాదించును. అట్లే సాధువులు ఎన్ని కష్టములనయినా ఓర్చుకొనుచు ఇతరులను ఉద్దరించును. అట్టి సాధువుల సమాజము ఆనందమయము , కల్యాణప్రదము. అది ఒక కదులుతున్న ప్రయాగ ( త్రివేణి సంగము ) . అచట రామ భక్తి అను గంగా ప్రవాహము. బ్రహ్మ విచారమే సరస్వతి నది. నిధినిషేధ రూపములైన కధలు కలియుగ పాపములు ప్రక్షాళన చేయు యమునాతరంగములు . ఈ మూడునదులు ఇచట కలియును. శివకేశవుల కధలు త్రివేణీసంగమములై శ్రోతలకు ఆనందమును, శుభములను అందించును . ఈ సాధుసమాజ రూపమున ప్రయాగ క్షేత్రమున స్వధర్మమము నందు విశ్వాసము అక్షయవటం. సత్కార్యములే తీర్థరాజా పరివారము . తీర్థరాజమైన ఈ ప్రయాగ వివిధదేశములలో సర్వకాలములు అందు సాధుజనరూపమున అందరికి లభ్యమగును. వారిని సాదరంగా సేవిచుటచే అవిద్యావంటిక్లేశములు అన్నీ పటాపంచలగును. ఈతీర్థరాజము అలౌకికము , వర్ణనాతీతము , సాధ్యఫలదాయకము. దీని ప్రభావము ప్రత్యక్షము.