దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు జయంతి నేడే తెలుగు సాహితీ ప్రియులందరికీ శుభాకాంక్షలు.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా, ఆకులో ఆకునై, పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం, ప్రతి రాత్రి వసంత రాత్రి , పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ, ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు ఈ పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన పాటలు . దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. కృష్ణశాస్త్రి గారి పాటలు అన్ని అమృత గుళికలే. ఈయన ఆధునికాంద్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిబావంతుడైన రచయిత. భావకవిత్వపు, ప్రచారకుడు క్రుష్ణపక్షానికి వెలలేని వెన్నెల వెలుగులు అందించిన చంద్రుడు. తెలుగుకు వెలుగులు తెచ్చి సూటిదనాన్ని, సున్నితత్వాన్ని సాహిత్యపు కమ్మని రుచిని అందించిన ఆధునిక బావకవి దేవులపల్లి వారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు రచించిన మంచి దేశభక్తి గీతం
పల్లవి :
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||
చరణం 1 :
జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||
చరణం 2 :
జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.