Blogger Widgets

బుధవారం, అక్టోబర్ 02, 2013

ప్రపంచ అహింసా మరియు ప్రేమైక జీవుల దినోత్సవం,

బుధవారం, అక్టోబర్ 02, 2013

నేటి విశేషము అందరికి తెలిసినదే,  మహాత్మా గాంధీ  జయంతి.
మరియు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా .  ఈరోజును ప్రపంచ అహింసా దినోత్సవ దినంగా జరుపుకుంటున్నాము.  ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారు చెప్పిన ఒక సూక్తి :
ధర్మ వర్తన లేని విద్యార్జనమ్ము, మానవత్వము లేని విజ్జ్నాన గరిమ
శ్రమము లేకుండ వచ్చెడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి
స్వార్థ పూరితమైనట్టి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభావము
న్యాయ రహితమయిన రాజకీయ పదవి, భూతలమ్మున సాంఘిక పాతకములు.
భావం:    ధర్మ వర్తన లేకుండా విద్యనభ్యసించడం, మానవత్వం లేకుండ శాస్త్ర విజ్జ్యానము ఉపయోగించడం, శ్రమపడకుండా ఉపాయంతో ధనమును అర్జించడం, నీతి పాటించకుండా వ్యాపారం చెయడం, స్వార్ధముతో సంఘసేవ చేయడం, అంతరాత్మ వద్దు అంటున్నా యితరులను హింసించి ఆనందం పొందడం,  న్యాయం లేకుండా రాజకీయాలు నడపడం- అనే ఈ యేడు సాంఘిక పాతకాలు.  ఈ పాతకాలను ఎవ్వరూ చేయకూడదు.
నీతి:  మన లోపాలు సమాజానికి శాపాలు కాకూడదు కనుక ప్రతీవారు తమ లోపాలను తొలగించుకోవాలి.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారికి హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా.  
ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. ఈయన జయంతి సంధర్బముగా హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

ప్రపంచ అహింసా దినోత్సవం లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం ( International Day of Non-Violence) గా  మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.

ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం : జంతువుల పెంపకం మనకి పౌరాణిక యుగంనుంచీ వస్తున్న అలవాటే. మనషూలతో మమేకమై, మనుషూల మనసుని అర్ధం చేసుకుంటూ అవసరాన్ని తీర్చి. మన ఆనందాన్నీ పంచడంలో జంతువులు, పక్షులు ఎంతో తోడ్పడుతున్నాయి.  మానవుడు తన మేధస్సు తో నాటినుండీ ఏ జంతువుల్ని ఏఏ అవసరాలకోసం వినియోగించుకోవాలో ఆయా జంతువుల్ని మచ్చిక చేసుకుంటూ, వినియోగించుకుంటూ వాటి పట్ల ప్రేమానురాగాల్ని కూడా పెంచుకుంటూ చివరికి వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నాడు. గుర్రాలు, గాడిదలు వంటివి రవాణాకి, ఆవులు, గేదెలు, గొర్రెలు, ఎడ్లు వంటివి వ్యాపారానికీ, వ్యవసాయానికీ వినియోగించుకుంటుండగా, ఇక కుక్కలు రక్షణకీ, కుందేళ్ళు, జింకలు, అక్వేరియంలో అందమైన చేపలను, రామచిలుకలు, మైనా, గోరింక వంటి పక్షిజాతుల్ని ఆనందానికి, వినోదానికీ పెంచుకుంటూ ఉంటారు.  
ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం సంధర్బముగా శుభాకాంక్షలు.

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ప్రపంచ శాఖాహార దినోత్సవం

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ఈరోజు ప్రపంచ శాఖాహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది.  శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్‌ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
1977 లో నార్త్ అమెరికన్‌ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్‌ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్‌ యూనియన్‌ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది.  సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. 

  1. ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
  2. ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం. 
  3. మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
  4. రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం. 
  5. తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
  6. పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి. 
ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకి వస్తాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి.  పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి. పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. అందువల్ల శాఖాహారాన్నిమాత్రమే స్వీకరించటం అన్నివిదాలా అందరికి మంచిది.  పర్యావరణానికి మంచిది అని తెలుస్తోంది.  

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

సమరయోధుడు భగత్

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

భగత్ సింగ్
ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.
అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."


భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.  ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ, కీర్తికిసాన్ పార్టి,  హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.

భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు).
చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.
సమరయోధుడు భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు.

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

Catch Me Live

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

ఆకాశంలో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆ హరివిల్లు కూడా సాయంత్రం 05:00 నుండి సాయంత్రం  06:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలముప్రత్యక్ష ప్రసారము మాత్రమే కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.

మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే

Radio Josh
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype Me™!
                                                                                
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

ధన్యవాదములు 

శనివారం, సెప్టెంబర్ 21, 2013

గురజాడ అప్పారావు

శనివారం, సెప్టెంబర్ 21, 2013


దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. 
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.  గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.  అప్పారావుగారు అన్నారు "ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది" అని అన్నారు.  ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.  గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.  వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.
అప్పారావు గారు రచనలలో మనము ఎప్పుడు వినే మాట 
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి 
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

అప్పారావుగారి రచనలలో సారంగధర,  పూర్ణమ్మ,  కొండుభట్టీయం,  నీలగిరి పాటలు,  ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతిశతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, 
లవణరాజు కల, కాసులు,సౌదామిని ,రాయాలనుకున్న నవలకు తొలిరూపం), కథానికలు,మీపేరేమిటి ,దిద్దుబాటు,మెటిల్డా,సంస్కర్త హృదయం, మతము విమతము ఇంకా చాలా రచనలు వున్నాయి. 
ఈరోజు అప్పారావుగారి 151 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి 
" ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "  మరియు  అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము. 

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

"ఫౌకాల్ట్ లోలకం"

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

జీన్-బెర్నార్డ్-లియోన్ అనే ప్రముఖ శాస్త్రవేత్త  సెప్టెంబర్ 18, 1819, పారిస్ నగరంలో జన్మించారు.  అతను ప్రపంచానికి తేలికపాటి సంపూర్ణ వేగంను  కొలిచే ఒక టెక్నిక్ ను అభివృద్ధి చేసాడు.  ఫ్రెంచ్ భౌతికశాస్త్రములో జీన్, తీవ్రమైన ఖచ్చితమైనది భూమి తన అక్షం మీద తిరగడంను  ప్రయోగాత్మక ప్రమాణాత్మకంగా అందించాడు.
అది మన అందరికి అర్ధం అయ్యేలావుంది.   గూగుల్ డూడుల్ లో చూడండి.
                            
జీన్-బెర్నార్డ్-లియోన్ వైద్య వృత్తికి విద్యాభ్యాసం చేసాడు, కానీ తన ఆసక్తిని  భౌతికశాస్త్రంలో ప్రయోగాత్మక నిరూపించారు. అర్మాండ్ Fizeau తో కలసి జీన్-బెర్నార్డ్-లియోన్ కాంతి మరియు వేడిపై  పరిశోధనలు వరుసగా మొదలుపెట్టాడు. 1850 సంవత్సరంలో కాంతి గాలి కంటే నీటిలో నెమ్మదిగా ప్రయాణింస్తుంది అని చెప్పారు.

1851 లో, దీర్ఘకాలంగా వైర్ 67 m (220 అడుగుల) నుండి స్వింగ్ భారీ ఇనుప బంతి మోషన్ ద్వారా, అతను భూమి తన అక్షం చుట్టూ తిరుగుతూ వుంటుంది అని  నిరూపించారు. ఇటువంటి ఒక "ఫౌకాల్ట్ లోలకం" .   విమానం లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు, కానీ ఒక రేటు మరియు లోలకం భౌగోళిక అక్షాంశ ఆధారపడి ఒక దిశలో భ్రమణం భూమిపై, ఈ నిలువు విమానం నెమ్మదిగా అనేక మార్పులు గమనించారు. ఈ ప్రయోగంలో గైరోస్కోప్ ను ఉపయోగించి సారూప్యంతో  1855 లో లండన్ యొక్క రాయల్ సొసైటీ యొక్క కోప్లే పతకాన్ని అందుకున్నారు, మరియు ఇంపీరియల్ అబ్జర్వేటరీ, పారిస్ లో  భౌతికశాస్త్రవేత్త కు  అసిస్టెంట్ గా చేశారు. అతను ఎడ్డీ కరెంట్ లేదా ప్రతిబింబించే టెలిస్కోప్ కోసం ఒక మెరుగైన అద్దం నిర్మించారు బలమైన అయస్కాంత క్షేత్రం లో కదిలే ఒక రాగి డిస్క్ లో "ప్రవాహాలు,", మరియు 1859 లో ఉపరితల కోసం టెలిస్కోప్ అద్దాలు పరీక్ష యొక్క సాధారణ కానీ చాలా ఖచ్చితమైన పద్ధతి కనిపెట్టారు.

మంగళవారం, సెప్టెంబర్ 17, 2013

విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు .

మంగళవారం, సెప్టెంబర్ 17, 2013

విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిశ్రమలలో ఘనంగా జరుపుకుంటారు.  అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ. అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు.  విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు.  త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు.  ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.  విశ్వకర్మ, సేవకులు మరియు వాస్తుశిల్పులు దేవతగా ఉన్నారు. బ్రహ్మ కుమారుడు, అతను మొత్తం విశ్వం యొక్క దివ్య చిత్రలేఖకుడు, మరియు అన్ని దేవతల 'రాజభవనాలు అధికారిక భవన నిర్మాతగా వున్నాడు . విశ్వకర్మ  దేవతల యొక్క అన్ని చదరంగము ఆట మరియు వారి ఆయుధాలను రూపకర్త ఉన్నాడు.
మహాభారతంలో  అతనిని గురించి వివరిస్తుంది వెయ్యి హస్తకళాకృతులను కార్యనిర్వాహణాధికారి దేవతల యొక్క వడ్రంగి, చేతివృత్తుల అత్యంత ప్రముఖత, అన్ని ఆభరణాలు యొక్క రూపకర్త  మరియు ఒక గొప్ప మరియు శాశ్వత కీర్తిని కలిగినటువంటి దేవుడు యొక్క అధిపతి. అతను, నాలుగు చేతులు కలిగి ఒక కిరీటం ధరిస్తే, బంగారు నగల లోడ్లు, మరియు అతని చేతులలో ఒక నీటి కుండ, ఒక పుస్తకం, ఒక ఉరి మరియు శిల్పి యొక్క టూల్స్ కలిగి ఉన్నాడు.
కార్మికులు మరియు ఉత్పాదకతను పెంచడానికి మరియు నవల ఉత్పత్తులు సృష్టించడానికి దైవ స్ఫూర్తిని ఆకర్షించేందుకు సేవకులు కోసం ఒక తీర్మానం సమయం - హిందువులు విస్తృతంగా నిర్మాణ మరియు ఇంజనీరింగ్ యొక్క దేవుడు మరియు సెప్టెంబర్ 16 లేదా 17 ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ గా జరుపుకుంటారు .  సాధారణంగా ఫ్యాక్టరీ ప్రాంగణములో లేదా షాపింగ్ ఫ్లోర్ లోనే జరుగుతుంది.  
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది.  
విశ్వకర్మ జయంతి రోజున అందరూ తమ వృత్తిపనుల్లో ఉపయోగపడే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు పెట్టి పూజించాలి.ఈ రోజున పనిముట్లను పూజిస్తాం కనుక వాటిని వాడకూడదు. వృత్తిపనులను చేయకూడదు. బెంగాల్ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చాలా వైభవంగా భజనలతో, నాట్యాలతో నిర్వహిస్తారు.

విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం.
విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు . 

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

సుబ్బలక్ష్మి గారి జయంతి శుభాకాంక్షలు.

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

"Nightingale" of Carnatic music

ఆమె పాట పాడకపోతే దేవుళ్ళ క్కూడా తెల్లవారనే తెల్లవారదు!? తెరతీయగ రాదా అంటూ పాట పాడుతూ వుంటే ఆ దేవదేవుడు మేలుకోకుండా వుండగలడా.   తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమె పొందిన గొప్పవరం.  ఆమె కారణ జన్మురాలు అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా! 
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతీ తెలుగువాడి గుండెల్లోను భక్తి భావం కలుగుతుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదకరంగా  వుంటుంది.
ఆమె ఎవరో కాదు మనం అందరికి M . S  గా బాగా తెలిసిన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి సంగీత సరస్వతి.  మనదేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గొప్ప  గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు. ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్.   ఆమెను చూడగానే ఒక దేవతను చూసినట్టు వుంటుంది. 
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ MS గురించి ఇలా అన్నారు  "సుబ్బులక్ష్మి గారు సంగీతం రాణి నేను  కేవలం ప్రధాన మంత్రిని".  
సుబ్బలక్ష్మి గారి జయంతి నేడు ఆమె జయంతి సందర్భముగా ఇక్కడ కొన్ని మంచి పాటల లింక్స్.  వినండి. 

  1. అఖిలాండేశ్వరి
  2. అన్నపూర్ణేశ్వరి
  3. బంటురీతి
  4. భావములోన
  5. భాగ్యద లక్ష్మి బారమ్మా
  6. భజ గోవిందం
  7. భావయామి గోపాల బాలం
  8. భావయామి రఘురామమం 
  9. బ్రహ్మ కడిగిన పాదం
  10. బ్రోచేవారెవరురా
  11. దసన మదికో ఎన్నా
  12. దేవాది దేవ
  13. ఎందరోమహానుభావులు
  14. ఎవరిమాత
  15. గణేష పంచరత్నం (ముదాకరాత్త మోదకం) 
  16. హనుమాన్ చాలీస
  17. జగదోద్దారన
  18. జో అచ్చుతానంద
  19. కాలై నిరాయ్ గణపతే
  20. కాన్చదలయదక్షి
  21. లక్ష్మి అష్టోత్తరం
  22. మరుగేలర
  23. మీరా భజన
  24. నారాయణ నిన్నే నమ్మేద
  25. నామ రామాయణం 
  26. ఒకపరి ఒకపరి
  27. పాలించు కామాక్షి 
  28. రామ రామ గుణసీమ
  29. సరగుణ పాలింప
  30.  సీతమ్మ మాయమ్మ
  31. శివ శివ శివ భు
  32. శ్రీమన్నారాయణ
  33. శ్రీనివాస తిరువేంకట
  34. శ్రీ రంగ పుర విహార
  35. వనజాక్షి
  36. వేంకటేశ్వర సుప్రభాతం
  37. విష్ణు సహస్రం                                      

సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భముగా  ఆమె అభిమానులందరికి సుబ్బలక్ష్మి గారి జయంతి శుభాకాంక్షలు.  

సోమవారం, సెప్టెంబర్ 09, 2013

చోడవరం స్వయంభూ కార్యసిద్ది వినాయకుడు.

సోమవారం, సెప్టెంబర్ 09, 2013


 ఈ విగ్రహం మా తాతగారు ఊరు చోడవరం లో ని  వినాయకుని గుడి చాలా ప్రసిద్దమైనది.   ఈ విగ్రహం మానవ నిర్మితమైనధి కాధు. ఈ విగ్రహం స్వయంభూ వినాయకుడు.
విశాఖజిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, విఘ్నేశ్వరాలయాల్లో ఆలయ మూర్తులు స్వయంభువులు. వీటికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖజిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ వుంటారు. చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా పేర్కొంటారు.

ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది. చాలా కాలం క్రితం అక్కడబావి తవ్వటానికి తవ్వుటలో వినాయక విగ్రహం బయటపడింది.  వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర వున్న చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. దాని తొండము చివర ఎవరు కనుక్కోలేకపోయారు. వినాయకుని తొండము చివర తెలుసుకోటానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు.  సుమారు 200 సంవత్సరాల నుంచి స్వయంభూ విఘ్నేశ్వరుని దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడి విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం చివరి భాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి. అక్కడ భక్తి తో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం.  ఆక్కడ వినాయకుని కార్యసిద్ది వినాయకునిగా ప్రజలు కొలుస్తారు

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

వినాయకుని మణిహారమ్

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

తొండమునే కదంతమును తోరపు బొజ్పయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు  గజ్జెలును మెల్లని చూపులు మంద హాసమున్
కొండొక గజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ మోయి గణాధ పనీకు మ్రొక్కెదన్ || 1

తొలతన విగ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెదనే కదంతనా
వలపటి చేతి గండమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణా ధీప! లోక నాయకా ! 2

తలచితినే గణనాధుని! తలచితినే విగ్న పతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విగ్నములను తొలగుట కొరకున్ || 3

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను బ్రాలు చెరకుర సంబున్
విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందు చేత ప్రార్ధింతు మదిన్ || 4

అంగముజేరి శైలతనయాస్తన దుగ్ద ములాను వేళబా
ల్యాంక విచేష్ట తుండమున యవ్వలి చన్గ వళింపబోయియా
వంకకుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
ళాంకుర శంకనంటెకు గజాస్యునిగొల్తు నభీష్ట సిద్దకిన్

ఈశునంత వాని నెదిరించి పోరాడి
మడిసినానిచేతె మరల బ్రతికి
సర్వవంద్యుడైన సానుజవదనకున్
అంజలింతు విఘ్న భంజనునకు

"తలచెదనే గణనాథుని 
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 
దలచెదనే హేరంబుని 
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌" 

"అటుకులు కొబ్బరి పలుకులు 
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్రసుతునకు 
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌."

విద్యార్ధులకు  వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.


శ్రీ వినాయక పూజ విధానం 

ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||

పదహారు రూపాల గణపతులు.

 1. బాలగణపతి 2. తరుణగణపతి 3. భక్తగణపతి 4. వీరగణపతి 5. శక్తి గణపతి 6. ధ్వజ గణపతి 7. పింగళ గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విఘ్న గణపతి 10. క్షిప్ర గణపతి 11. హేరంబ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. భువనేశ గణపతి 15. నృత్త గణపతి 16. ఊర్ధ్వగణపతి.

వినాయకుని అందమైన పాటల మణిహారమ్ 


Happy Grand Parents Day.

తాతామామల - తాతాఅమ్మమ్మలు  మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు.వారికి ఒక ప్రత్యేక రోజు ఉంది.  అదే Grandparents Day గా జరుపుకుంటున్నారు. మనము వారితో  పెంచుకునే ప్రత్యేక అనుబంధమునకు  గుర్తుగా  జరుపుకుంటున్నాము .  Grandparents Day ను మొట్టమొదట గా McQuade  అను మహిళ అనుసరించింది  మరియు తాతామామల కోసం ఒక ప్రత్యేక రోజుస్థాపించడానికి తన ప్రచారాన్నిచేర్చటానికి ఆమెకి  ప్రజల యొక్క ప్రేరణతో ఒక మహిళ, తనఆలోచనగా ప్రారంభమైందినేడు, Grandparents Day ఇతర పాత స్నేహితులు మరియు బంధువులు సందర్శించడానికిమరియు ప్రతిచోటా సీనియర్లచే యొక్క జ్ఞానంశక్తి మరియు శాశ్వత గుర్తించడానికివారి తల్లిదండ్రులు మరియు తాతామామల గౌరవం పెరుగుతుంది   the United States అంతటా లక్షల మంది ప్రజలుజరుపుకుంటారు.  వారు Grandparents Day జరుపుకోవటానికి మూడు కారణాలు చెప్తారు వారు.
1. తాతామామ్మలను గౌరవించుటకు.
2. 
తాతామామల వారి పిల్లల పిల్లలకు ప్రేమ చూపించడానికి అవకాశం ఇవ్వాలని.
3.  
తాతామామల  సహాయం తో పిల్లలు మంచి తెలుసుకొని, పిల్లలు మానసికంగా శారీరకంగా  బలం గా, మంచి సమాచారం మరియు మార్గదర్శకత్వం వారి ద్వారా మంచి గా ఆవగాహనతో పెరుగుతారని .
అసలు వారు Grandparents Day జరుపుకోవటానికి కారణం జాతీయ తాతామామల డే కౌన్సిల్ McQuade, నేషనల్ తాతామామల డే స్థాపకులు descendents నిర్వహించిన ఒక లాభాపేక్షలేని సమూహం, తాతామామల గౌరవం intergenerational ప్రశంసలు మరియు చర్యలు ప్రోత్సహించడానికి వృద్ధాశ్రమం లో వున్నా సీనియర్ సిటిజెన్స్ ను కలసివారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి.  మనదేశం లో అయితే తాత మామ్మల మద్య చాలా మంచి అనుబందము వుంటుంది.  చాలా మంచి    విషయాలు, కధలు, కమామిషులు,  ప్రపంచం లో మనం ఎలా వుండాలి.  మన విజయం వెనకాల మన పేరెంట్స్ కంటే వారే ముందు వుంటారు.   అలాంటి తాతమామ్మలను మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి.  వారిని వృద్దాశ్రమాల పాలు చేయకండి ఎదే నా విన్నపము.  
so, I am wishing all senior citizens Happy Grand Parents Day.
Thank you.
 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)