ఈరోజు ప్రపంచ శాఖాహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
1977 లో నార్త్ అమెరికన్ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది. సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. - ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
- ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం.
- మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
- రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం.
- తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
- పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి.
Good information!
రిప్లయితొలగించండిThank u Tarangini ji.
తొలగించండి