Blogger Widgets

సోమవారం, జనవరి 11, 2016

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై 27

సోమవారం, జనవరి 11, 2016


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 


తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు. 

ఆదివారం, జనవరి 10, 2016

మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్ 26

ఆదివారం, జనవరి 10, 2016




మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము. ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.  సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు


మోతనీటి మడుగులో యీతగరచినవాడు
పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మట్టిముద్ద పెల్లగించువాడు
రోతయన పేగుల పేరులు గలవాడు

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు
బూడిద బూసిన వాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూడల నావుల గాచి దొఱయనవాడు

ఆకసానబారే వూరి అతివల మానముల
కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి
యేకాలము బాయని యెనలేని వాడు

శనివారం, జనవరి 09, 2016

ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్ 25

శనివారం, జనవరి 09, 2016




ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 

తాత్పర్యము:
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.
భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)