తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు
మోతనీటి మడుగులో యీతగరచినవాడు
పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మట్టిముద్ద పెల్లగించువాడు
రోతయన పేగుల పేరులు గలవాడు
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు
బూడిద బూసిన వాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూడల నావుల గాచి దొఱయనవాడు
ఆకసానబారే వూరి అతివల మానముల
కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి
యేకాలము బాయని యెనలేని వాడు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.