శనివారం, ఫిబ్రవరి 03, 2024
నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం
మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం. కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు. అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి. కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు. అంతలా చేస్తాయి నిరాశా నిస్పృహ . మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని. మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే.
కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు. మనకోసం చెప్పివుంటాడేమో . ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు. అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు. అయితే మనజీవితంలో అన్వయించుకుంటే ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది. చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది.
ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి.
సమస్య ఏమిటంటే :
ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు. మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే . ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో . మనసునిండా tension . మనసు కృంగిపోతుంది.
ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.
నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం.
గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి.
||శ్లోకము 2-3||
క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||
చూడండి. దీని అర్ధం ఏమిటంటే
“ ఓ పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”
హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు.
అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటే…గమ్యం చేరువ అవుతూ ఉంటుంది…చివరికి లక్ష్యాన్ని చేరుతాం .
పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే దైర్యం తెచ్చుకో . నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు.
ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది. మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.