Blogger Widgets

సోమవారం, మే 14, 2012

వలస పక్షులు వాటి యాతన.

సోమవారం, మే 14, 2012

ఇక్కడ పక్షులను చూస్తూవుంటే ఇవి వలస పక్షులు అని తెలిసి పోతోంది కదండి.  నిజంగా ఇవి వల స పక్షులే ప్రపంచం నేడు వల స పక్షుల  రోజుగా  జరుపుకుంటోంది.  వలస పక్షులు అనగానే మనకు కొల్లేరు సరస్సు దగ్గర కు వచ్చే పక్షులు  గుర్తుకు వస్తాయి .    ఈ పక్షులన్నీ ఎక్కడో పుట్టి వున్న ప్రదేశాన్ని విడిచి  కొన్ని వేల  మైళ్ళు  ఎగురుకొని  కొండలూ కోనలు  సముద్రాలు , నదులు , చెరువులు , అడవులు , వూర్లు, ఎడారులు దాటుకొని కొత్త ప్రదేశానికి చేరుకుంటాయి.  అక్కడ  కొన్ని రోజులు వుండి తరువాత  వాటికి అనుకూలమైన  వాతావరణం  ఏర్పడినప్పుడు మరలా తిరిగి వాటి ప్రదేశానికి వెళ్లి పోతాయి కావున  వాటిని వలస  పక్షులు అంటారు.  ఇవి గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాన్ని చేస్తాయి.  ఇవి మామూలుగా పగటి జీవులే అయినప్పటికీ ఇవి ఈ వలస  ప్రయాణము  మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణం చేస్తాయి.  ఈ ప్రయాణం చీకటి పడ్డాక  మొదలు పెట్టి తెల్లారేలోపు వరకు ప్రయాణం సాగిస్తాయి.  ఇలా రాత్రులే ఎందుకు ప్రయాణిస్తున్నాయో ఉహించగలరా.  రాత్రులు అయితే  వాటికి శతృభయము వుండదు అందుకే అలా ప్రయాణిస్తాయి.  రాత్రులు గంటకి తొమ్మిదివేల  పక్షులు ప్రయాణిస్తాయి.   కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? చాలా  కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి.  ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణము చెయ్యాలి వాటికి తెలుస్తుంది అంటారు . అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి.  సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు.  పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియ ఇది సృష్టిలో మహాద్భుతం గా చెప్పుకోవచ్చు .  
పక్షులును చూసి మనలాంటి వారు కష్ట కాలంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఎలాగైనా గమ్యాన్ని తిరిగి చేరుతాయి.  ఇదే వలసపక్షులు వాటి యాతన .  

ఆటలమ్మ

Chicken pox vaccine
ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.  ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.  అలాంటప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్  అను శాస్త్రవేత్త.    18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్ 1879 లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు.  మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.  చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster) అని తెలుసుకొని దానికి టీకా కనిపెట్టి మొట్టమొదట  ఇద్దరు పిల్లలు మీదప్రయోగిమ్చారు వారు ఇద్దరు పిల్లలు మీద  ఆ మందు బాగా పనిచేసింది.  చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయిచుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.  సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి. అని నిర్ణయించుకున్నారు. 1796 May 14 న  ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.

ఆదివారం, మే 13, 2012

సర్ రోనాల్డ్ రాస్

ఆదివారం, మే 13, 2012


సర్ రోనాల్డ్ రాస్  మలేరియ  చక్రం 
సర్ రోనాల్డ్ రాస్  తెలియని వారు వుండరు అనుకుంటున్నా.  ఈయన ప్రముఖ ఆంగ్లో ఇండియన్ శాస్త్ర వేత్త.  నేడు సర్  రోనాల్డ్ రాస్  పుట్టిన రోజు  సందర్బముగా సింపుల్ గా ఈయన గురించి తెలుసుకుంనే ప్రయత్నం చేద్దాం.  ఈయన మలేరియా పారసైట్ యొక్క జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడినది. ఈయన హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపారు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్" గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.  రొనాల్డ్ రాస్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా లో జన్మించారు. ఇతని తండ్రి జనరల్ సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పనిచేశారు.   ఎనిమిది సంవత్సరాల వయసులో రాస్ ను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండు పంపించారు. రైడ్ లో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత 1869లో సౌతాంప్టన్ లోని బోర్డింగ్ పాఠశాల కు పంపించారు.
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. తర్వాత రోయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం (Membership of the Royal College of Surgeons:MRCS) పొందాడు. ఇతడు 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసు లో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.
Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases హైదరాబాద్ లో ఈ  మలేరియ వ్యాధి గురించి పరిశోధించి విజయం సాధించారు.  ఇందుకు గాను ఈయనికి నోబెల్ బహుమతి ఇచ్చారు.

మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు

 
      ఈ రోజు మాతృపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాం  అందుకుగాను ముందుగా  మన మాతృ భూమికి (భారతమాత )కు మరియు ప్రపంచంలో వున్నా మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు.  

సృష్టిలో అమ్మ లేనిజీవి అన్నది లేదు .  ఎక్క డైనా చెడ్డ బిడ్డ  వుండవచ్చేమో కాని చెడ్డ తల్లి అన్నది వుండదుట.  ఏ  తల్లి అయ్యినా తన  బిడ్డ  గొప్పగా వుండాలి అని కోరుకుంటుంది.  మనకు ప్రపంచంలో కెల్లా అతి తియ్యనైన పదం అమ్మ .  అమ్మప్రేమ కంటే  గొప్ప ప్రేమ  , అమ్మకంటే గొప్ప రక్షణ , అమ్మ  కంటే గొప్ప గురువు, అమ్మ కంటే గొప్ప దైవం ఎక్కడా లేదు. ఇది  నిజం .  అలాంటి అమ్మ ఋణము మనం ఎన్ని జన్మలుఎత్తినా తీర్చలేము.  

ఈ సందర్బములో నాకు ఒక కదా గుర్తు వస్తోంది అది ఏమిటి అంటే!!!!! ఈ కదా అమ్మ ప్రేమకు ఒక  నిదర్సనం అని చెప్పుకోవచ్చు.  ఒక ఊరిలో ఒక అమ్మ వుంది ఆ అమ్మకి ఒక బిడ్డ వున్నాడు.  అతను  అన్ని చెడ్డ అలవాట్లు కలిగి వుంటాడు.  అతనికి ఒక ప్రియురాలు వుంది ఆమె ఒకనాడు నాకు తల నొప్పిగా వుంది అని చెప్పింది.  ఆ తలనొప్పి తగ్గాలి అంటే అతని అమ్మ  హృదయపు రక్తం రాస్తే తగ్గుతుంది అని చెప్పింది.  అప్పుడు ఆతను మాఅమ్మ హృదయం ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళాడు.  వెళ్లి అమ్మని అడిగాడు.  అమ్మా నీ హృదయం కావాలి అని అడిగాడు.  ఆమె వెంటనే సరే నాయనా తప్పకుండా తీసుకో అంది.  అప్పుడు ఆతను తల్లిని పొడిచి హృదయాన్ని తీసుకున్నాడు. ఆ హృదయం రక్తం కారుతోంది దానిని తన చేతిలో తీసుకొని వెళ్తూ వుండగా ఆ రక్తం లో జారి పడబోయాడు.  అప్పుడు అమ్మ హృదయం తల్లడిల్లిపోయి బాబూ జాగ్రత్త చూసుకొని నడువు నాయనా అంది.  అప్పుడు ఆ కొడుకులో మార్పు వచ్చి ఇంత మంచి అమ్మనా నేను చంపింది అని ఏడుస్తాడు.  చూసారా ఎక్కడైనా అమ్మ మంచిగానే వుంటుంది.  అలాంటి అమ్మను మనం కష్టపెట్టకూడదు.

మనకు తెలిసిన రామాయణంలో రాముడు  తల్లి (కైకెయి)కోరికకు కట్టుబడి అడవికి వెళ్లి ఎన్నోకస్టాలు అనుభవించాడు.  కృష్ణుడు, యశోద ప్రేమ మనం వర్ణించలేము. అర్జునుడు ద్రుపది స్వయంవరంలో గెలిచిన ద్రుపధిని  పాండవులు తల్లిమాట విని ద్రౌపదిని ఐదుగురు భార్యగా పొందారు. తరువాత చత్రపతి శివాజి తనతల్లి కొరికను నెరవేర్చి. చక్రవర్తి అయ్యాడు.  గాంధి గారుకు తన తల్లి తన చిన్నప్పటి నుండి అనేక కదలు చెప్పేది.  ఆ కధలు గాంధిగారికి మార్గనిర్ధేశకంగా నిలిచాయి.      
మనకు పంచ  మాత లు కలరు అని కుమారశతకంలో ఇలా అన్నారు.

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

భావం:రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - పంచమాతలు గా భావించవలెను.

అమ్మని ఇప్పుడు mommy అని పిలుస్తున్నారు.  mommy అన్న పదం కంటే అమ్మ అన్న పదం లోనే తియ్యదనం వుంది అని తెలుసుకుంటే బాగుంటుంది. 
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం 
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం 
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి .........
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్న పాట రాసారు ఇది అక్షరసత్యం అని గ్రహించగలరు.  ఎందరో కవులు అమ్మ గురించి వర్ణించటానికి ప్రయత్నించారు.  కానీ ఎవరు రాయగలరండి అమ్మ గురించి. 
 అమ్మలందరికి మాతృ పూజా దినోత్సవం శుభాకాంక్షలు.  

(మా అమ్మకి)I love You Amma. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)