ఇక్కడ పక్షులను చూస్తూవుంటే ఇవి వలస పక్షులు అని తెలిసి పోతోంది కదండి. నిజంగా ఇవి వల స పక్షులే ప్రపంచం నేడు వల స పక్షుల రోజుగా జరుపుకుంటోంది. వలస పక్షులు అనగానే మనకు కొల్లేరు సరస్సు దగ్గర కు వచ్చే పక్షులు గుర్తుకు వస్తాయి . ఈ పక్షులన్నీ ఎక్కడో పుట్టి వున్న ప్రదేశాన్ని విడిచి కొన్ని వేల మైళ్ళు ఎగురుకొని కొండలూ కోనలు సముద్రాలు , నదులు , చెరువులు , అడవులు , వూర్లు, ఎడారులు దాటుకొని కొత్త ప్రదేశానికి చేరుకుంటాయి. అక్కడ కొన్ని రోజులు వుండి తరువాత వాటికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మరలా తిరిగి వాటి ప్రదేశానికి వెళ్లి పోతాయి కావున వాటిని వలస పక్షులు అంటారు. ఇవి గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాన్ని చేస్తాయి. ఇవి మామూలుగా పగటి జీవులే అయినప్పటికీ ఇవి ఈ వలస ప్రయాణము మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం చీకటి పడ్డాక మొదలు పెట్టి తెల్లారేలోపు వరకు ప్రయాణం సాగిస్తాయి. ఇలా రాత్రులే ఎందుకు ప్రయాణిస్తున్నాయో ఉహించగలరా. రాత్రులు అయితే వాటికి శతృభయము వుండదు అందుకే అలా ప్రయాణిస్తాయి. రాత్రులు గంటకి తొమ్మిదివేల పక్షులు ప్రయాణిస్తాయి. కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? చాలా కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి. ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణము చెయ్యాలి వాటికి తెలుస్తుంది అంటారు . అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి. సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు. పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియ ఇది సృష్టిలో మహాద్భుతం గా చెప్పుకోవచ్చు .
పక్షులును చూసి మనలాంటి వారు కష్ట కాలంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఎలాగైనా గమ్యాన్ని తిరిగి చేరుతాయి. ఇదే వలసపక్షులు వాటి యాతన .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.