Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

భూలోక స్వర్గం

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

దివాన్-ఎ-ఖాస్
"భూమి మీద ఎక్కడైనా స్వర్ఘము అంటూ వుంటే అది ఇదే" అని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ద్వారా నిర్మించబడినది  ఈ భవనము.  ఈ భవనం ఢిల్లీ లో వుంది మరి ఆభవనం పేరు ఏమిటో తెలుసా  దివాన్-ఎ-ఖాస్.  ఇది రెడ్ ఫోర్ట్ లోని ఒక భాగము.  ఇది అద్భుతమైన కట్టడము. చక్రవర్తి గారి ప్రవేట్ విషయాలు చర్చించుకోవటానికి నిర్మించారు.  మొత్తం పాలరాయితో నిర్మించబడింది.  అక్కడ విలువైన నెమలి సింహాసనం మీద కూర్చొని విషయాలు చర్చించటానికి నిర్మించారు.  ఈ హాల్ నిర్మాణానికి పాలరాయి నవరత్నాలను ఉపయోగించి బంగారంతో నిర్మించారు.  నెమలి రూపంలో నిర్మించారు.  ఇలా తీర్చి దిద్దటానికి ఏడు సంవత్సరాలు కాలం పట్టిందిట. ఇలా చెప్తూ వుంటే ఈ నిర్మాణాన్ని చూడాలి అనిపిస్తోంది.  షాజహాన్ అన్నట్టు నిజంగా భూలోక స్వర్గంగా అనిపిస్తోంది కదండి. 

గురువారం, ఏప్రిల్ 19, 2012

ఛార్లెస్ డార్విన్

గురువారం, ఏప్రిల్ 19, 2012

మహావిశ్వాన్నీ, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్  చెప్పారు.  మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!.  మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా!  చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809  జన్మించాడు. వీరి తండ్రిగారు తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు.  అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది.  ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడుతన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడుతన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.  175 ఏళ్ల క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది.  చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు.   అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి.  మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి.  డార్విన్  గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని"
NewsListandDetails
లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది.  ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.  అప్పుడు ఆ  యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒకదానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది.  ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19 డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.  

బుధవారం, ఏప్రిల్ 18, 2012

చూడచిన్నదానవింతే సుద్దులు

బుధవారం, ఏప్రిల్ 18, 2012

అన్నమాచార్యులు వారు రచించిన  మంచి పాట .  ఈ పాటను మనం గొప్ప సంగీత విద్వాంసులు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అద్బుత గళం నుండి మనం విందాం.

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి

యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి

సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి

కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి

మంగళవారం, ఏప్రిల్ 17, 2012

బెంజమిన్ ఫ్రాంక్లిన్

మంగళవారం, ఏప్రిల్ 17, 2012

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక ప్రముఖ  అమెరికా శాస్త్రవేత్త.  ఈయన  శాస్త్రవేత్త మాత్రమె కాదు రచయిత, గొప్ప చిత్రకారుడు,  రాజకీయ నాయకుడు మరియు గొప్ప మేధావి.  ఈయన అనేక కళలలో ప్రావీణ్యుడు, ప్రాంక్లిన్ కు మొదటి అమెరికన్" అనె బిరుదు కూడా కలిగివున్నాడు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేక ఆవిష్కరణలు చేసారు.  బెన్ ఫ్రాంక్లిన్  కీర్తి ప్రధానంగా విద్యుత్ తో కూడిన  ప్రయోగాలు చేసారు.  ఈయన  ఆవిష్కరణలు చాలా రూపొందించినవారు. మీరు క్రింద ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆవిష్కరణలు క్రింద పొందుపరచాను.
Bifocals అను ఛత్వారపు కళ్ళద్దాలు కనుక్కొన్నారు.  అనారోగ్యము తో కదలలేని వారికి సౌకర్యవంతముగా మూత్ర కాథెటర్ ను ఫ్రాంక్లిన్ తన రోజు ఒక కాథెటర్ వలె ఉపయోగించిన హార్డ్ ట్యూబ్ స్థానంలో ఒక సౌకర్యవంతమైన కాథెటర్ రూపొందించినవారు.  దీనివల్ల  బెడ్  మీద  వుండే మూత్రం విసర్జించి రోగి ఉపశమనం పొందుతారు.  ఫ్రాంక్లిన్ పొయ్యి అనునది 1742 లో సంప్రదాయ పొయ్యి గా అభివృద్ధి రూపొందించినవారు, అది మరింత వేడి కలిగించేవిధంగా  రూపొందించినవారు మరియు దీనికి అతి తక్కువ కట్టెలు ఉపయోగించారు, నీటికి కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత నిప్పు గూళ్లు ఫ్రాంక్లిన్ డిజైన్ పైనే ఆధారపడి ఉంటాయి.  మెరుపు రాడ్ - విద్యుత్ ప్రవర్తనకు సంబంధించి బెన్ ఫ్రాంక్లిన్ యొక్క ఆవిష్కరణలు అతనికి 1752 లో మెరుపు రాడ్ సృష్టించటం జరిగింది.  
ఫెర్గూసన్ యొక్క క్లాక్ - ఫ్రాంక్లిన్ మూడు చక్రాలు మరియు రోజు చాలా గడియారములు కంటే మరింత సమర్ధవంతంగా అని రెండు pinions ఉపయోగించి గంటలు, నిమిషాలు మరియు సెకన్లు చెప్పారు ఒక గడియారం రూపొందించినవారు.  Streetlights - ఫ్రాంక్లిన్ ప్రజా లైటింగ్ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా అంతటా కనిపిస్తుంది ఆ సాధారణంగా ఉపయోగించే నాలుగు పలకను వీధి కాంతి రూపొందించినవారు.మునుపటి డిజైన్ ఇన్ గ్లోబ్ ఆకారంలో మ్యాచ్లను బర్నింగ్ చమురు నుండి మసి వృద్ధి వలన కొన్ని గంటల్లో కృష్ణ పెరిగింది. ఫ్రాంక్లిన్ యొక్క డిజైన్ మసి తో నల్లబడిన నుండి చూపు నిరోధించే మరియు ప్రకాశవంతమైన అన్ని రాత్రి మిణుగురు లు కూడా కలిగేలా చేసారు.  కరేజ్ ఒడోమేటర్ను ముఖ్యంగా అతను మొదటి మాస్టర్ జనరల్ గా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్ని మైళ్ళ తెలుసుకోవడం ఆసక్తి కలిగి odometers వివిధ రకాల పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి, కానీ ఫ్రాంక్లిన్ ఒక రవాణా లో ప్రయాణించారు మైళ్ళ ట్రాక్ చేయడానికి 1763 చుట్టూ ఒక కొత్త వెర్షన్ రూపొందించినవారు యునైటెడ్ స్టేట్స్ మరియు వివిధ పోస్టల్ మార్గాలను దూరం కొలిచటానికి ఉపయోగిస్తున్నారు.  లైబ్రరీ కుర్చీ - శ్రద్ధగా చదువుకోవటాని వీలుగా ఈ  కూర్చి తయారు చేసారు.  ఎక్స్టెన్షన్ ఆర్మ్ - ఫ్రాంక్లిన్ అధిక చాలా అని ఫలకాలు మీద పుస్తకాలు చేరుకోవడానికి ఉపయోగించే దీర్ఘ స్టిక్ రూపొందించినవారు. పుస్తకాలు అందుకొని గట్టిగా పట్టుకొను చేయడానికి, ఆర్మ్ దిగువన చివరిలో ఒక తాడు ఈర్పాటు చేసారు, 1785 న లాగటం ద్వారా మూసుకుపోయి ఇది చివర రెండు వేళ్లు వచ్చింది.   నాకు పుస్తకాల అర అయితే బాగా నచ్చింది.స్విమ్ రెక్కల ను కూడా తయారు చేసారు.  అతను తన చేతుల్లో తగిన రెక్కలను పెట్టుకొని ఒక కలువలో ఈ  ప్యాడ్ వంటి ఆకారంతో ఈది బెన్ వేగంగా గమ్యాన్ని చేరుకున్నారు !, 1717 లో ఈతకు  సహాయపడింది.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ మనకు కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు వాటిలో కొన్ని ఇవిగో.
పొదుపు చేయటం కూడా ఒక సంపాదన.
ఎక్కువ అభిరుచులు కలవారు ఎక్కువ సంతోషంగా వుంటారు.
ఖాళీ సమయం దొరకాలి అనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)