Blogger Widgets

శుక్రవారం, జనవరి 13, 2012

తిరుప్పావై త్రింశతి పాశురము

శుక్రవారం, జనవరి 13, 2012

ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
పాశురము: 
  వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్

అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్

శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్

ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.


తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.



సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

ఆండాళ్ తిరువడి గళే శరణం 
 జై శ్రీమన్నారాయణ్ 
సర్వేజనా సుఖినో భవంతు 
ఓం శాంతి శాంతి శాంతీః 

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు

మనం రోజు తిరుప్పావై పాసురములు చదువుతున్నాము.  పాసురములు ౩౦ కదా ఆ పాసురములను మన అమ్మ గోదాదేవి పాడారు.  అయితే రోజు గోపికలు అందరు ఒకరిని ఒకరు నిద్రమేల్కొల్పుతున్నారు కదా.  ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నపుడు నిద్రలో వున్న ఆ గోపిక ఒక్క విశిష్టత ముందు చెప్తున్నారు కదా.  ఆ విశిష్టతలు అన్నీ ఒకచోట చేసి అవన్నీ అమ్మలోనే మనకు అన్నమాచార్యులవారు చూపిస్తున్నారు. ముప్పై పాసురాలు లోని వి నీకు నిజం కావాలని అమ్మకి చెప్తున్నారు.  నీకు మంచే జరగాలని అంటున్నారు.  ఇదిగో ఇలాగ.
 

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు

బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోముకభ్యుదయమస్తు
కడివోని నీరజపు కళికలను గేరు, నీ
నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

వొగరు మిగులగ తేనె లొలుకు నున్నటి నీ
చిగురు మోవికిని ఫల సిద్ధిరస్తు
సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు
అగణిత మనోరథావ్యాప్తిరస్తు

తనరు తుమ్మెదగములఁ దరము నీ కురులకును
అనుపమంబైన దీర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన నీకు
అనుదినము నిత్య కల్యాణమస్తు
అందమైన యువతీ! నీవు పలికే మాటలకు క్షేమము అగుగాక. ప్రమోదము కలిగించే నీ వయసు నీకు గొప్ప సంపద అగుగాక.  అందమైన కళలు చాలా ఎక్కువగా పెంపొందించుకున్న నీ చంద్రబింబము వంటి మొగమునకు మంగళము అగుగాక.  చెడిపోని కలువల కాంతుల వలే/నీటిలో కలువలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయో అంత ఎక్కువగా నీ హృదయ సీమ ను అలరారు నీ అధ్బుత పయోదరములు/ స్తనములు/ కుచములు అభివృద్ధి చెందు గాక!.  కొంచెం వగరు మిగిలిన తేనెలు ఒలికేటి నున్నటి నీ ఎర్రని చిగురు పెదవులకు ఫలము సిద్ధించుగాక.  అందమైన చక్రాలవలే ఉన్ననీ పిరుదులకు  అపరిమితమైన మనోరధా వ్యాప్తి సిద్ధించు గాక.  నల్లని తుమ్మెద రెక్కలను పోలిన నీ కురులకు అసదృశ్యము కాని దీర్ఘాయువు కలుగు గాక .  నన్ను (శ్రీ వేంకటేశుని) ద్వారకను పరిపాలించిన కృష్ణుడనుచు దగ్గరకు వచ్చిన నీకు ప్రతి దినము మంగళప్రదమౌదు గాక.

గురువారం, జనవరి 12, 2012

తిరుప్పావై నవవింశతి పాశురము

గురువారం, జనవరి 12, 2012


మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.

అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.

పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
జై శ్రీమన్నారాయణ్

యల్లాప్రగడ సుబ్బారావు

యల్లాప్రగడ సుబ్బారావు
యల్లాప్రగడ సుబ్బారావు జనవరి 12,1895- ఆగష్టు 9,1948 భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. సుబ్బారావు పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబములో జన్మించారు.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన ఒక cell లోని Adenosine Triphosphate (ATP) యొక్క కదలికలును గుర్తించారు. ఒక భారతీయ జీవశాస్త్రవేత్త  అయిన యల్లాప్రగడ సుబ్బారావు గారు  cancer వ్యాధికి చికిత్సకు చాలా కృషి చేసారు.  ఈయన రూపొందించిన Hetrazan drug  ను కనుక్కునారు ఇది  ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ లేదా బోదకాలు వ్యాధి లేదా ఏనుగు కాలు నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో  బెంజమిన్ డుగ్గర్  1945లోప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.
సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్ తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధముSubbaromyces splendens అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు. సుబ్బారావు గారు మన భారతీయుడుగా మంచి పేరు సాధించారు.  ఆయనను ఒకసారి గుర్తుచేసుకోవటం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను.
జై హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)