Blogger Widgets

గురువారం, జనవరి 12, 2012

యల్లాప్రగడ సుబ్బారావు

గురువారం, జనవరి 12, 2012

యల్లాప్రగడ సుబ్బారావు
యల్లాప్రగడ సుబ్బారావు జనవరి 12,1895- ఆగష్టు 9,1948 భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. సుబ్బారావు పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబములో జన్మించారు.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన ఒక cell లోని Adenosine Triphosphate (ATP) యొక్క కదలికలును గుర్తించారు. ఒక భారతీయ జీవశాస్త్రవేత్త  అయిన యల్లాప్రగడ సుబ్బారావు గారు  cancer వ్యాధికి చికిత్సకు చాలా కృషి చేసారు.  ఈయన రూపొందించిన Hetrazan drug  ను కనుక్కునారు ఇది  ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ లేదా బోదకాలు వ్యాధి లేదా ఏనుగు కాలు నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో  బెంజమిన్ డుగ్గర్  1945లోప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.
సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్ తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధముSubbaromyces splendens అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు. సుబ్బారావు గారు మన భారతీయుడుగా మంచి పేరు సాధించారు.  ఆయనను ఒకసారి గుర్తుచేసుకోవటం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను.
జై హింద్ 

2 కామెంట్‌లు:

  1. Dr.యల్లాప్రగడ.సుబ్బారావు గారి గురించి వ్రాసినందుకు సంతోషం.మాmedical fraternityకి బాగా తెలిసిన మహనీయుడు.aureomycin,hetrazanలతోబాటు అనీమియాలో పనికివచ్చే folic acidకనిపెట్టడంలో కూడా ఆయన కృషి ఉందంటారు.నోబెల్ బహుమతి రావలసిన వ్యక్తి.బహుశా ఈర్ష్యా అసూయా రాజకీయాల వలన రాలేదని అంటారు.ఏమైనా ఆ ఆంధ్ర రత్నానికి నివాళి అర్పిద్దాము. -Dr.M.V.Ramanarao.

    రిప్లయితొలగించండి
  2. Dr.యల్లాప్రగడ సుబ్బారావు గారికి రావలసిన నొబెల్ ప్రైజ్ రాలేదు. ఇది కేవలం రాజకీయాలవల్లే పొయింది. ఇది చాలా బాధాకరమైన విషయమండి. మన ఆంద్రరత్నం కు నివాళ్ళు అర్పించాలి. మీరు మంచిగా కమెంటారు. ధన్యవాధములు

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)