Blogger Widgets

శుక్రవారం, జనవరి 13, 2012

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు

శుక్రవారం, జనవరి 13, 2012

మనం రోజు తిరుప్పావై పాసురములు చదువుతున్నాము.  పాసురములు ౩౦ కదా ఆ పాసురములను మన అమ్మ గోదాదేవి పాడారు.  అయితే రోజు గోపికలు అందరు ఒకరిని ఒకరు నిద్రమేల్కొల్పుతున్నారు కదా.  ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నపుడు నిద్రలో వున్న ఆ గోపిక ఒక్క విశిష్టత ముందు చెప్తున్నారు కదా.  ఆ విశిష్టతలు అన్నీ ఒకచోట చేసి అవన్నీ అమ్మలోనే మనకు అన్నమాచార్యులవారు చూపిస్తున్నారు. ముప్పై పాసురాలు లోని వి నీకు నిజం కావాలని అమ్మకి చెప్తున్నారు.  నీకు మంచే జరగాలని అంటున్నారు.  ఇదిగో ఇలాగ.
 

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు

బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోముకభ్యుదయమస్తు
కడివోని నీరజపు కళికలను గేరు, నీ
నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

వొగరు మిగులగ తేనె లొలుకు నున్నటి నీ
చిగురు మోవికిని ఫల సిద్ధిరస్తు
సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు
అగణిత మనోరథావ్యాప్తిరస్తు

తనరు తుమ్మెదగములఁ దరము నీ కురులకును
అనుపమంబైన దీర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన నీకు
అనుదినము నిత్య కల్యాణమస్తు
అందమైన యువతీ! నీవు పలికే మాటలకు క్షేమము అగుగాక. ప్రమోదము కలిగించే నీ వయసు నీకు గొప్ప సంపద అగుగాక.  అందమైన కళలు చాలా ఎక్కువగా పెంపొందించుకున్న నీ చంద్రబింబము వంటి మొగమునకు మంగళము అగుగాక.  చెడిపోని కలువల కాంతుల వలే/నీటిలో కలువలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయో అంత ఎక్కువగా నీ హృదయ సీమ ను అలరారు నీ అధ్బుత పయోదరములు/ స్తనములు/ కుచములు అభివృద్ధి చెందు గాక!.  కొంచెం వగరు మిగిలిన తేనెలు ఒలికేటి నున్నటి నీ ఎర్రని చిగురు పెదవులకు ఫలము సిద్ధించుగాక.  అందమైన చక్రాలవలే ఉన్ననీ పిరుదులకు  అపరిమితమైన మనోరధా వ్యాప్తి సిద్ధించు గాక.  నల్లని తుమ్మెద రెక్కలను పోలిన నీ కురులకు అసదృశ్యము కాని దీర్ఘాయువు కలుగు గాక .  నన్ను (శ్రీ వేంకటేశుని) ద్వారకను పరిపాలించిన కృష్ణుడనుచు దగ్గరకు వచ్చిన నీకు ప్రతి దినము మంగళప్రదమౌదు గాక.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)