Blogger Widgets

గురువారం, ఏప్రిల్ 25, 2013

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

గురువారం, ఏప్రిల్ 25, 2013


యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్
 శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.

అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
భారతదేశములో ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని విగ్రహరూపంతో ఆలయము లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత ఏమిటో తెలుసుకుందాం! ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షసులకు , దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఎల్లప్పుడూ  రామనామ సంకీర్తనా పరుడు హనుమంతడు . 
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.  ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను. 
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్నిగ్రహించి  స్వామిభక్తి పరాయణుడై   వ్యాకరణం పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.   కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో కదా !.హనుమతుని గురించి చెప్పుకుంటూ పోతే మనకు కాలం తెలియదు.    సరే ఇక మన బ్లాగ్ మిత్రులు అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

మార్కోని జన్మదినము

Marconi Guglielmo
గూగ్లి ఎల్మో మార్కోని ఇటలీ దేశమునకు చెందిన శాస్త్రవేత్త మరియ ఆవిష్కర్త. ఇతడు సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధిచేయుటలో పితామహుడుగా ప్రసిద్ది చెందాడు. ఈయన రేడియో యొక్క ఆవిష్కర్త.1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నారు. 1897 లో బ్రిటన్ నందు వైర్‍లెస్ టెలిగ్రాఫ్ మరియు సిగ్నల్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు.ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసికొని రేడియో అనే కొత్త ఆవిష్కరణచేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించిన వ్యక్తి. 1924 లో మార్కోనీమార్చీజ్ అనే అవార్డుతో గౌరవింపబడ్డాడు.
మార్కోని 25 ఏప్రిల్ 1874 లో బొలొగ్నా నందు జన్మించాడు.ఆయన తల్లిదండ్రులు అన్నీ జేమ్‍సన్ మరియు గుసెప్ మార్కోనీ. మార్కోని బొలోగ్నా యందుగల అగస్టో రిఘి లాబొరేటరీ నందు ప్రైవేటుగా చదువుకొన్నాడు. విద్యార్థి దశలో మార్కోనీ పరిశోధనలు శాస్త్రీయ మరియు విద్యుత్ పరిశోధనల పట్ల మక్కువ చూపేవారు. ఆయన కాలంలో హెన్రిచ్ హెర్ట్జ్ అనే శాస్త్రవేత్త విద్యుదయస్కాంత వికిరణాలపై పరిశోధనలు చేసి -- ప్రస్తుతం గల రేడియో తరంగాలు అప్పట్లో వాటిని హెర్టిజియన్ తరంగాలు అని పిలిచేవారు కనుగొన్నాడు. 1894 లో హెర్ట్జ్ మరనానంతరము ఆయన పరిశోధనలను కొనసాగించి కొత్త ఆవిష్కరణను సృష్టించింది మార్కోని. ఈయన హెర్ట్జ్ యొక్క పరిశోధనలను బొలోగ్నా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రవేత్త ఆగస్టో రిఘి తో కలసి కొనసాగించుటకు అనుమతించబడ్డాడు.పట్ల మక్కువ చూపించేవాడు.  మార్కోని మంచి తెలివైనవాడు. 

పూర్వ ప్రయోగ పరికరాలు

మార్కోని ఇటలీ యందు గల ఫ్రిఫోన్ యందుగల తన యింటిలో తన స్వంత ఉపకరణములు ఉపయోగించి అతని పనివాడు అయిన మిగ్నాని తో కలసి ప్రయోగములు చేయుట ప్రారంభించాడు. వైర్‍లెస్ టెలిగ్రాఫీ వ్యవస్థ నందు ప్రయోగాత్మకంగా రేడియో తరంగాలను ఉత్పత్తిచేసి పంపుట ఈయన లక్ష్యముగా పెట్టుకున్నాదు. ఇది కొత్త ఆలోచన కాదు. అనేకమంది పరిశోధకులు వైర్‍లెస్ టెలిగ్రాఫ్ గూర్చి 50 సంవత్సరములనుండి పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ సాంకేతికంగా సఫలం కాలేకపోయారు. మార్కోని యొక్క వైర్‍లెస్ వ్యవస్థ ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది.
ఒక సాపేక్షంగా గల సాధారన డోలని లేదా స్ఫులింగము సృష్టించు రేడియో ప్రసారిణి.
ఒక లోహపు తీగ లేదా భూమి నుండీ ఎత్తులో గల గ్రహించే సాధనం.
ఒక గ్రాహకం: ఇది బ్రాన్లీ యొక్క అసలు పరికరం గా మార్చబడినది.
ఒక టెలిగ్రాఫ్ కీ: ప్రసరిణి నుండి లఘు మరియు పెద్ద స్పందనలను మోర్స్ కోడ్ ప్రకారం డాట్స్ మరియు డాష్ లుగా పంపుట.  మోర్స్ కోడ్ ను నమోదు చేయుటకు టెలిగ్రాఫ్ రిజిస్టర్( ఇది కాగితం టేప్ లా ఉంటుంది). 
మార్కోని వంటి గొప్ప  శాస్త్రవేత్త గురించి తెలుసుని చాలా సంతోషం కలిగింది . ఈ   శాస్త్రవేత్త ని ఆదర్శముగ 
 తీసుకోవాలి  కదా !



మంగళవారం, ఏప్రిల్ 23, 2013

ప్రపంచ పుస్తకదినోత్సవ శుభాకాంక్షలు.

మంగళవారం, ఏప్రిల్ 23, 2013


వరల్డ్ బుక్ డే లేదా వరల్డ్ బుక్ మరియు కాపీరైట్ డే, పఠనం, ప్రచురణ మరియు కాపీరైట్ ప్రోత్సహించడానికి UNESCO ద్వారా నిర్వహించబడింది 23 ఏప్రిల్ న వార్షిక వేడుకకు. యునైటెడ్ కింగ్డమ్ లో,  బుక్స్కి  ఒక రోజు కావాలని మార్చి మొదటి గురువారం గుర్తించారు .  వరల్డ్ బుక్ డే ఏప్రిల్ 1995, 23 న మొదటి సారి జరుపుకునేవారు.  ఇలా ఈరోజు నే జరుపుకోవాలని ఎందుకు అనుకున్నారంటే దానికి చాలా కారణాలు వున్నాయి. సెవాంతెస్‌, షేక్సిపియర్‌, ఇన్కా గర్సి లాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు.  అంతేకాదు జోసెఫ్‌ ప్లా, వ్లాదిమర్‌, మారిస్‌ ద్రువాం ఇలా ఇంకా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం. ఇదే రోజున సెయింట్‌ జార్జ్‌ జన్మది నాన్ని స్పెయిన్‌లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్‌లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్‌గా ఇస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ‘ప్రపంచ పుస్తక దినం’ గా ప్రకటించిండమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంత వరకూ పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా .  పుట్టినరోజులకు బహుమతులుగా మంచి పుస్తకాలను ఇస్తే చాలా బాగుంటుంది.  అప్పుడు నాలాంటి పిల్లలందరికీ చదవటానికి బాగుంటుంది.  పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పొందటమే కాకుండా, మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది,  మనిషిని మనిషిలా వుంచుతుంది, కోపం వచ్చినప్పుడు పుస్తకం చదివితే మనకు తెలియకుండానే కోపం పోతుంది ఇది నిజం.  పుస్తకం మంచి స్నేహితుడివంటిది.  ఇంకా చాలా ఉపయోగాలు వున్నాయి.  అందుకే పుస్తక  పఠనం చేయండి.  ఇంకెందుకు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా ఈరోజు నుండే పుస్తక  పఠనం మొదలుపెట్టండి. 
ప్రపంచ పుస్తకదినోత్సవ శుభాకాంక్షలు. 

సోమవారం, ఏప్రిల్ 22, 2013

It’s your mother calling.DON’T KEEP HER ON HOLD

సోమవారం, ఏప్రిల్ 22, 2013


Earth Day Is The World’s Birthday! 
Tomorrow's Earth is Today's Responsibility.
Everything Earth day for Earth Day and Everyday:

earthday
It’s your mother calling.DON’T KEEP HER ON HOLD 

Save the world, save yourself. 

Learn to recycle and use your bicycle 
Keep your surroundings clean make the earth green 

Turn off the lights before you perish. 
r-e-c-y-c-l-e. c-o-n-s-e-r-v-e. n-e-v-e-r  p-o-l-l-u-t-e. 

ఆదివారం, ఏప్రిల్ 21, 2013

చిన్ని RJ Vaishu తో కాసేపు

ఆదివారం, ఏప్రిల్ 21, 2013

ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో,  అద్భుతమైన ప్రశ్నలతో ,  సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను 
మీ చిన్ని RJ Sree Vaishnavi ని . 
ఎలా అంటే ప్రతీ ఆదివారము 05:00 pm to 6:00 pm వరకు 
మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music  :) లో 
నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి .
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com



గురువారం, ఏప్రిల్ 18, 2013

శ్రీ సీతారాముల కల్యాణం చూతం రారండి

గురువారం, ఏప్రిల్ 18, 2013


శ్రీ సీతారాముల కల్యాణం చూతం రారండి
శ్రీ రాముడు రోజున జన్మించిన రోజును  మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

మానవునిలో ప్రవర్తనలో ఏ శుభలక్షణాలు౦టే లోకకళ్యాణ౦ జరుగుతు౦దో అలా౦టి మంచి శుభలక్షణ స౦పన్నుడు శ్రీరాముడు. సీతారాములు ఇరువురివి యజ్ఞ స౦బ౦ధమైన జన్మలే. అలా౦టి సీతారాముల కళ్యాణ౦ లోక కళ్యాణ౦.
చైత్రశుధ్ధ నవమి పునర్వసు నక్షత్రాన మధ్యాహ్నవేళ, కర్కాటక లగ్న౦లో సూర్యుడు మేష౦లో ఉ౦డగా, ఐదుగ్రహాలు ఉచ్ఛస్థాన౦లో ఉ౦డగా శ్రీరామావిర్భావ౦ జరిగి౦ది.  ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉ౦టే లోకనాయకుడు అవుతాడని అర్ధ౦. శ్రీరాముడు లోకోత్తర నాయకునిగా అవతరి౦చాడు. శ్రీరాముడు అవతరి౦చి ఒక కోటి 81 లక్షల 50 వేల స౦వత్సరాలు అయినట్లు ప౦డితులు పరిశోధి౦చి చెప్పారు. అయినా నేటికీ శ్రీరాముని ఆరాధన జరుగుతో౦ద౦టే ఆ అవతార వైశిష్ట్యాన్ని గుర్చి౦చవచ్చు.
మహిమాన్విత శ్రీరామనామ౦: 
ర - ఆత్మ
మ - మనస్సు
ర - సూర్య బీజ౦ - అజ్ఞానాన్ని పోగొడుతు౦ది
అ - చ౦ద్ర బీజ౦ - తాపాన్ని పోగొడుతు౦ది్.
మ - అగ్ని బీజ౦ - పాపాన్ని భస్మ౦ చేస్తు౦ది.  
రా - అ౦టే పురుషుడు
మ - అ౦టే ప్రకృతి

పురుషుడు ప్రకృతి కలిస్తేనే ఈ సర్వ ప్రప౦చ౦ ఏర్పడి౦చి. ఈవిధ౦గా రామ శబ్దానికి నిత్యసత్యమైన పరబ్రహ్మ౦ అని అర్ధ౦. విశ్వమ౦తా పరబ్రహ్మస్వరూపమే కాని మరొకటి లేదు. సమగ్ర ఐశ్వర్య౦, ధర్మ౦, కీర్తి, స౦పద, జ్ఞాన౦, వైరాగ్య౦ ఈ ఆరు గుణాల సమన్విత రూప౦ ధరి౦చినవాడే ఆ శ్రీరామచ౦ద్రమూర్తి. సకల సద్గుణ కరమై౦ది శ్రీరామనామ౦. రామోచ్ఛారణే సర్వపాప నివారక హేతువని విజ్ఞులు పలికారు. అ౦దుకని సర్వులూ ఆ స్వామి నామాన్ని జపి౦చి తరి౦చాలి. అ౦తేకాక
రామలో రా అ౦టే రావణ అని, మ అ౦టే మర్దన అని అర్ధ౦ స్ఫురిస్తో౦ది. అ౦టే రావణ మర్దనుడే రామ అన్నమాట. రావణుడ౦టే కామక్రోధాది దుర్గుణ స్వభావ౦. కనుక ఆ దుర్గుణాలను పోగొట్టేది శ్రీరామ పవిత్రనామార్ధ౦ అని మన౦ స౦భావి౦చుకోవచ్చు.
రాఅనే అక్షర౦ పలుకగానే నోరు తెరుచుకొని మనలోని దోషాలు, పాపాలు వెలికిపోతాయి. అనే అక్షర౦ పలుకగానే నోరు మూసుకొని మనల్ని దోష రహితులుగా చేస్తు౦ది. అ౦దుకే రామ అనేది బీజాక్షర యుక్తమైన మ౦త్ర౦.
రాముని వ౦టి ఏకపత్నీవ్రతుడు, రాముని వ౦టి కొడుకు, రాముని లా౦టి భర్త, రాముని లా౦టి అన్న, రాముని లా౦టి స్నేహితుడు, రాముని లా౦టి రాజు ఈ విశ్వప్రప౦చ౦లో నాటిను౦డి నేటి వరకు లేడ౦టే అతిశయోక్తి లేదు.
శ్రీమద్రామాయణానికి ర౦గుల హరివిల్లు శ్రీరాముని గుణ ఔన్నత్యమే. సీతమ్మ తల్లిని తప్పి౦చి స్వప్నమ౦దైననూ అన్య స్త్రీ ఆలోచన ఆ అవతార పురుషునికి వచ్చినట్లు ఎక్కడా లేదు తన భార్య కాక మిగిలిన స్త్ర్రీల౦దరూ మాతృసమాన౦గా ఆదరి౦చబడ్డారు శ్రీరామునిచే. అ౦దుకనే శ్రీరామచ౦ద్రుని వ౦టి భర్త రావాలని ప్రతి కన్య ఆశ పడుతో౦ది.
శ్రీరామునిలో మరో సుగుణమేమ౦టే శరణుకోరిన వారిని క్షమి౦చడ౦. అన్యధా శరణ౦ నాస్తి అనే వారిని వారి పూర్వాపరాలు విచారి౦చక, క్షమి౦చి, కోరిన వరాలిస్తాడు. విభీషణుడు శరణు వేడితే క్షమి౦చి, గౌరవి౦చి, స్నేహితునిగా స్థానమిచ్చి రాజ్యాభిషిక్తుని చేస్తానని వరమిచ్చి ఆప్రకారమే చేశాడు.
యజ్ఞపురుషుడు ప్రసాది౦చిన పాయసఫల౦గా శ్రీరామచ౦ద్రుడు అవతరిస్తే, యజ్ఞ నిర్వహణకై భూమిని శుద్ధి చేసేటప్పుడు నాగేటి చాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత ఆమె జనకుని తనూజకాదు. జనకాత్మజ, అయోనిజ.
యాగరక్షణకోస౦ విశ్వామిత్రుని అనుసరి౦చిన శ్రీరాముడు ఆ మహర్షి వె౦ట మిథిలానగానికి వెళ్ళాడు. అక్కడ జనక మహారాజు విశ్వామిత్రునికి, శ్రీరామలక్ష్మణులకు శివధనస్సును చూపి, దాని విశేషాలను తెలియజేస్తాడు. దానిని ఎక్కుపెట్టినవానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాన౦టాడు. విశ్వామిత్రుని ఆదేశ౦తో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్న౦ చేశాడు. అలా ఎక్కుపెట్టిన విల్లు ఫెళ్ళుమని విరిగి౦ది. సీతారామ కళ్యాణానికి మార్గ౦ సుగమ౦ అయి౦ది.

శివధనస్సు అనేది మాయకు ప్రతీక. శ్రీరామ చ౦ద్రుడు ఆ ధనస్సును నిలిపి తాను మాయను భరి౦చగలనని నిరూపి౦చాడు. ఆ ధనస్సును త్రు౦చి తాను మాయను లోబరచుకొన్నవాడు మాధవుడు. మాయను జయి౦చిన మానవుడు మాధవుడౌతాడు. అతనిలో దాగియున్న దివ్యత్వ౦ అప్పుడు ఆవిష్కరి౦పబడుతు౦ది. యజ్ఞపరమైన కార్యాచరణ దివ్యత్వానికి ఫల౦. అ౦దువల్ల లోకకళ్యాణ౦ జరుగుతో౦ది.
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

మంగళవారం, ఏప్రిల్ 16, 2013

భారతదేశపు మొదటి ప్రయాణీకుల రైలు (పాసెంజర్ ట్రయన్)

మంగళవారం, ఏప్రిల్ 16, 2013

1853 ఏప్రిల్ 16 న మొట్టమొదటిసారిగా భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. ఇదే భారతదేశపు  మొదటి ప్రయాణీకుల (పాసెంజర్ ట్రయన్)  రైలు.  మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణం ముంబై మరియు థానే Bori బందర్ మధ్య జరిగినప్పుడు చారిత్రక తేదీ ఉంది. 34 కిలోమీటర్ల దూరము మూడు ఆవిరితో నడిచే వాహనములు, సుల్తాన్, సింధ్ మరియు సాహిబ్, ఒక 57 నిమిషాల ప్రయాణంలో 14 క్యారేజీలు లో 400 ఆహ్వానించారు ప్రయాణికులు పట్టింది.నేటికి 160 సంవత్సరాలు పూర్తిఅయ్యింది మన దేశంలో రైలు మొదలై.  ఇది చాలా సంతోషించవలసిన విషయం. 

మహోన్నత వ్యక్తి కందుకూరి

మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులుగారి జన్మదినం నేడే. 
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించారు
తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి

పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు.  కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి .  


ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.

సోమవారం, ఏప్రిల్ 15, 2013

గురునానక్ దేవ్

సోమవారం, ఏప్రిల్ 15, 2013

గురునానక్ దేవ్ 1469 ఏప్రిల్ 15 న పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు.  సిక్కు మతము గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో గురునానక్ స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో పరమపదించారు.
శిక్కులకు దేవుడు అమూర్తి సత్యసూత్రం. దీనినే వారు విశ్వసిస్తారు. " ఇది అనేకం కాదు ఒక్కటే" విశ్వాంతర్యామి. పుట్టదు. గిట్టదు. తిరిగి పుట్టడానికి ఇదే వారి ప్రార్థన. మూడవ గురువు ఇలా అన్నాడు

అపూర్వ దేవతలను పూజించావారి
జీవితాలు, నివాసాలు అభిశప్తాలవుతాయి
వారి అన్నం - ప్రతిముద్ద - విషపూరితమవుతుంది
వారి దుస్తులు విషమయాలవుతాయి
వారిజీవితాలు కడగండ్ల పాలవుతాయి
తదనంతర జీవితం నరకం

ఇస్లాం లోని దైవాధీనతా వాదాన్ని బహిరంగంగానె వీరు నిరసించారు. "మీ జాతకాలను నిర్దేసించేది దేవుడు కాదు. మీ భవిష్యత్తును మీరే మలచుకోండి" అన్నాడు గురునానక్. శిక్కు మతం పునర్జన్మలను, కర్మవాదాన్ని అంగీకరిస్తుంది. కాని ఒకడు పునర్జన్మ శృంఖలాలనుంచి బయటపడాలంటే, ముక్తి పొందాలంటె, అతడు మానవుడు కావాలి. మనిషి అయితే (మానవత్వం ఉన్న) మోక్షం లభిస్తుంది. ఒకరు 8,400,000 జీవరూపాలను ఎత్తిన (జైన మతం ప్రకారం) తరువాత మోక్షం లభిస్తుందా. లెక తన వెలుగు దేవుని వెలుగులో మిళితం చేయడంతో ముక్తి లభిస్తుందా అనే విషయం అతడి జీవితం (మానవ జీవితం) నిర్ణయిస్తుంది.
మంత్ర పఠనం చేస్తూ "సత్ నాం, వహ్ గురు" (నిజమైన నామం అద్భుత గురువు) ను జపించడానికి శిక్కుమాంలో మంచి ప్రాముఖ్యం ఉంది. కాని గురువులు కేవలం మానవులు పదవ గురువు ఇలా అన్నాడు.

నేనొక మతాన్ని స్థాపించి, దాని నియమాల
నేర్పరుప నియుక్తుడయ్యాను
నన్నెవడైనా దేవునిగా భావిస్తే
అతడు అశక్తుడవుతాడు, వినాశమవుతాడు

వారి మతంలో మానవ పూజ లేదు., ఏదైనా పూజింపబడితే అది ఒక పుస్తకం. "గ్రంథ సాహిబ్". ప్రత్యేక సమయాలలో దీనిని అట్ట నుంచి అట్ట వరకు చదువుతారు. కొన్ని గృహాలలో నిత్యం ఈ గ్రంథ భాగాలు పారాయణం చేయబడతాయి.

శనివారం, ఏప్రిల్ 13, 2013

కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి

శనివారం, ఏప్రిల్ 13, 2013

హాయ్! 

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే ప్రతీ ఆదివారము    10:00 am to 12:00 pm వరకు  మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! 
మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

గురువారం, ఏప్రిల్ 11, 2013

కొత్త రోజుకి కొత్తరోజు

గురువారం, ఏప్రిల్ 11, 2013

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు   విజయ .  దీనిని  విజయ నామసంవత్సరం అంటారు. 
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. 
మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని  నాకు మా స్కూల్లో చెప్పారు.


యుగయుగాలు గడుపుతూ  యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు  కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా   మట్టి లోన కలపండి
మనసున  భేదభావమును  మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి. 
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న   
శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు  చేద్దాం 
ఈ విధంగా నందన సంవత్సరానికి వీడ్కోలు తెలిపి   
విజయ నామ  సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి ఈ  విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను  సంతోషంగా జరుపుకుందాం.

ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు విజయ  నామ సంవత్సర శుభాకాంక్షలు.

నా జన్మదినము

నేడు నా జన్మదినము కావునా మీరందరూ నన్ను ఆశిర్వదించండి.  అలాగే ఈరోజు ఉగాది కదా! అందరికి విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. 

బుధవారం, ఏప్రిల్ 10, 2013

హోమియోపతీ

బుధవారం, ఏప్రిల్ 10, 2013

హోమియోపతీ మందులు అనగానే మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా!  హోమియోపతి  మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి.  అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత ఎక్కువగా  ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు.  ఈ హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం  లేదట .  హోమియోపతీ అనగా  హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక  రోగ లక్షణం.  ఇది  రెండు గ్రీకు మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం.  మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి  ముల్లును ముల్లుతోనే తీయాలి మరియు  ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క  మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్.  ఈరోజు  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి  చెప్తున్నాను.  సేమ్యూల్ హానిమాన్  1755-1843 అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి  వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన  కొత్త  పద్దతిని కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ.  హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు  "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు.   పూర్వం నుండి హోమియోపతి మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు.  ex : onion వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి.  మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు కూడా చాలా అభివృద్ధి చెందింది.  ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు.  హోమియోపతి మందులు వాడితే ఎటువంటి అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు.  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం.  ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం.  హోమియోపతి వాడకమువల్ల  ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.

శుక్రవారం, ఏప్రిల్ 05, 2013

హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు.

శుక్రవారం, ఏప్రిల్ 05, 2013


మహాత్మా గాంధీగారు  బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ61సంవత్సరాల వయస్సులో  మహాత్మా గాంధీగారుతో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు.  ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు.  ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది.  ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930  న  మొదలు పెట్టారు ఈ దండి యాత్ర .  ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన  ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట  అనేది ముఖ్యమైన ఉద్దేశము.  ఈ  దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు.  ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు.  ఈ దండి యాత్ర  పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు.  ఈ దండి యాత్ర  5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి  చేరుకుంది.  241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు  వేసేన  ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే  (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు.  హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.

గురువారం, ఏప్రిల్ 04, 2013

కృత్రిమ గుండె

గురువారం, ఏప్రిల్ 04, 2013

image


డాక్టర్ డెంటన్ A  కూలే ఒక మానవ శరీరములో మొట్టమొదటగా ఒక కృత్రిమ గుండె ఇంప్లాంట్ చేసిన  మొదటి అమెరికన్ సర్జన్ మరియు గుండె-మార్పిడి అను దానికి మార్గదర్శకుడు గా వున్నవాడు. మొట్ట మొదట 1960 లో ఆయన పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి తో శిశువుల హృదయాలలో న సున్నితమైన శస్త్రచికిత్స చేసారు  తరువాత విజయవంతంగా pulmonary embolism (ఒక గడ్డకట్టిన రక్తము యొక్క భాగము ద్వారా పుపుస ధమని యొక్క ప్రతిష్టంభన) ను తొలగించటము చేసిన  మొదటి సర్జన్ ఈయన. 3 మే 1968, కూలీ తన మొదటి మానవ గుండె మార్పిడి ప్రదర్శించారు.   
కృత్రిమ గుండె
మానవవుని లో అమర్చిన మొదటి మొత్తం కృత్రిమ గుండెను, ఈ పరికరం Liotta చాలా కృషి చేసి అభివృద్ధి చేశారు మరియు హౌస్టన్ లోని సెయింట్ లూకా యొక్క ఎపిస్కోపల్ హాస్పిటల్ వద్ద, ఏప్రిల్ 4, 1969 న సర్జన్ డెంటన్ కూలే ద్వారా అమర్చారు. కార్ప్ అను రోగికి ఈ కృత్రిమ గుండెను ఏర్పాటు చేసారు.  

సంఖ్య దాత గుండె వ్యాధి గుండె కండరాలతో మరణిస్తున్న 47 ఏళ్ల రోగి అందుబాటులో ఎందుకంటే 4 న April 1969,, అతను ఒక తాత్కాలిక చర్యగా సిలికాన్ తయారు చేసిన యాంత్రిక గుండె అమర్చిన. ప్రయోగాత్మక కృత్రిమ గుండె 65 గంటల ఉపయోగించారు, ఈయనకు ఒక దాత గుండె దొరికేవరకు తాత్కాలికంగా వుంచుటకు ఉపయోగించారు. మరియు ఒక మానవ గుండె అందుబాటులోకి వచ్చినపుడు తొలగించారు..  
కార్ప్ నిజమైన గుండె పొందిన తరువాత వెంటనే మరణించారు అయినప్పటికీ ఈ విధానం ద్వారా గుండె రోగులలో కృత్రిమ గుండె మార్చవచ్చు అని ప్రయోగాత్మకంగా చూపించి. గుండెమీద కొత్త ప్రయోగాలు చేయటానికి నాంది వేసారు.  చాలా మంది ఈ శాస్త్ర చికిత్సని  అనైతిక శస్త్రచికిత్స  గా విమర్శించారు.  నేటి రోజున కృత్రిమ హృదయ మార్పిడికి పునాది వేసినది  కూలే. 

మంగళవారం, ఏప్రిల్ 02, 2013

అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు

మంగళవారం, ఏప్రిల్ 02, 2013

ఏప్రిల్, 2013 అనగా ఈరోజు  అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు గా జరుపుకుంటున్నాం.  పుస్తకములు కొత్తవి కొత్తవి చదవటానికి అంతర్జాతీయ బాలల బుక్ డే స్పూర్తినిస్తూ, పిల్లలుకు స్కూల్ బుక్స్ మాత్రమె కాకుండా అన్ని రకాల మంచి పుస్తకాలు చదవాలని వారికి తెలియచేయటం ముఖ్యఉద్దేసముగా ఉంది.

ఏప్రిల్ 2 న హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International children books day గా జరుపుకుంటున్నాము.  The Little Mermaid Story.,  The Ugly Duckling  , The Nightingale  వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టిన  రోజు యువ సాహిత్యం ప్రేమికులకు గుర్తించడానికి ఎంచుకున్నారు.


యంగ్ పీపుల్, లేదా IBBY (IBBY stands for International Board On Books for Young People.)కోసం పుస్తకాలు అంతర్జాతీయ బోర్డ్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీని లక్ష్యం పుస్తకాలు మరియు యువ ప్రజలకు చదివేటందుకు  ప్రోత్సహించడము దీని ముఖ్య  ఉద్దేశము కలిగివుంది. IBBY 1953 లో జురిచ్, స్విట్జర్లాండ్ లో స్థాపించబడింది. 


అంతర్జాతీయ బాలల బుక్ డే సందర్భంగా రచన పోటీల్లో మరియు ప్రసిద్ధ రచయితలు మరియు విశదీకరించుతారు చర్చలు సహా ప్రపంచవ్యాప్తంగా events నిర్వహింస్తున్నారు. 

అందరికీ  వండర్ల్యాండ్, హ్యారీ పాటర్, అండ్ ది ఆలిస్ వంటి రచనలు బాగా తెలిసిన పరిచయం ఉండగా మనకు  అద్భుతమైన పిల్లల పుస్తకాలు మనకు లభిస్తున్నాయి.  ఈ పిల్లల పుస్తకాలు, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునేటట్టు వున్నాయి.

మనం రోజు స్కూల్ బుక్స్ చదువుతాం అవి కాకుండా మంచి పుస్తకాలు కనుగొనుటకు ప్రయత్నించండి, అంతర్జాతీయ బాలల బుక్ డే  సందర్భముగా ఈరోజు నుండి మంచి పుస్తకాన్ని చదవటానికి అలవాతుచేసుకోండి. ఎలాగు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు సంతోషంగా చదువుకోవచ్చు.   ఇప్పుడైతే ఎగ్జామ్స్ కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి.  సరేనా.   నాకు కూడా రేపటినుండి ఎగ్జామ్స్ నేను వెళ్లి చదువుకుంటాను మరి బాయ్. 


Get ready for reading on International Childrens Book Day! so Happy International Children 's  Book Day . 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)