Blogger Widgets

ఆదివారం, అక్టోబర్ 07, 2012

నీల్స్ బోర్ 127 వ జన్మదినము.

ఆదివారం, అక్టోబర్ 07, 2012

ఈరోజు నీల్స్ బోర్ 127 వ జన్మదినము. నీల్స్బోర్ 1885 అక్టోబర్ 7 క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జన్మించాడు. 1903లో గణితం, వేదాంతం అభ్యసించడానికి కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. నీల్స్ బోర్ వేదాంతానికి బదులు భౌతికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు.1911 సంవత్సరములో లో డాక్టరేట్ పట్టా పొందాడు. మొదట 'జె.జె. థామ్సన్ వద్ద చేరి పరిశోధనలు చేశాడు. మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో'ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ వద్ద పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు.

నీల్స్ బోర్ 1913 సంవత్సరములో పరమాణు నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని' ఉపయోగించాడు. 1918 లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం కోపెన్హాగన్కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై ప్రచారం చేశాడు. CERN అనే ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్ బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18 కోపెన్హాగన్లో నీల్స్ బోర్ మరణించాడు.

శనివారం, అక్టోబర్ 06, 2012

Help Mimicry Harikishan

శనివారం, అక్టోబర్ 06, 2012


Mr. Harikishan, a famous mimicry artiste is suffering from serious health problem. Chaitanya art theaters is organising a programme for the benefit of Harikishan. Please attend the programme on 9th October 2012 at 6.37 p.m. at Ravindrabharati, Hyderabad. You can drop some amount in the drop box which will be arranged at Ravindrabharati near the stage. It is not a ticket show. all are welcome and bless Harikishan.
 Those who are not able to attend the programme can help him by sending amount to his account:
To Help Mimicry Harikishan, Here are the Bank Particulars:

V. HARIKISHAN
A/C # 860210100024350
IFSC BK ID 0008602
BANK OF INDIA
MALKAJGIRI BRANCH

శుక్రవారం, అక్టోబర్ 05, 2012

అమరెగదె నేడు అన్ని

శుక్రవారం, అక్టోబర్ 05, 2012

అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సతి నీమేన

చెలపల చెమటలు చెక్కిళ్ళ మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొకిళ్ళ తొలగని యాసలు తొక్కిళ్ళ

నెరవగు చూపులు నిక్కిళ్ళ మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ తఱచగు వలపుల దక్కిళ్ళ

ననుగోరికొనలు నొక్కిళ్ళ పొనుగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట ఎనసెను పంతము వెక్కిళ్ళ

గణేశపంచరత్న స్తోత్రం & అర్ధం


ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం,
కళాధరావతంసకం  విలాసిలోక  రక్షకం
అనాయకైక నాయకం వినాశితెభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్.. [1]

తాత్పర్యము:  సంతోషము తో ఉండ్రాళ్ళు పట్టుకొనువాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాధులకు దిక్కుయినవాడు చంద్రుని తలపై అలంకరింకున్నవాడు, విల్లసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుడును రక్షించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడగు వినాయకుని నమస్కరించుచున్నాను.

నతేతరాతి భీకరమ్ నవోదితార్క భాస్వరమ్
నమత్ సురారి నిర్జరం నతాదికాప దుద్దరమ్
సురేశ్వరం నిధీశ్వరమ్ గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం.. [2]

తాత్పర్యము:  నమస్కరించనివారికి అతి భయంకరుడు ఉదయించిన సూర్యుడువలే ప్రకాశించువాడు, రాక్షసులను, దేవతలను తన ఆధీనంలో నుంచుకొన్నవాడు, నమస్కరించువారిని ఆపదల నుండి ఉద్దరించువాడు, దేవతలకు రాజు, నిదులకుఅధిపతి, గజేశ్వరుడు, ప్రమాదగణాలకు నాయకుడు, ఐశ్వర్య సంపన్నుడు, పరాత్పరుడు అగు వినాయకుని ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.

సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం  వరేభవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం.. [3]

తాత్పర్యము:  సమస్తలోకాలకు మేలు చేయువాడు, మదించిన ఏనుగులవంటి రాక్షసులను సంహరించినవాడు, పెద్దబోజ్జ కలవాడు, శ్రేష్టుడు, గజముఖుడు, నాశములేనివాడు, దయతలచువాడు, సహనవంతుడు, సంతోషమునకు స్థానము అయినవాడు, కీర్తిని కలిగించువాడు, నమస్కరించువారికి మంచిమనస్సును ఇచ్చువాడు, ప్రకాశించువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచనాష భీషనమ్ ధనంజయాది భూషనమ్
కపోలదానవారణం భజే పురనవారణం.. [4]

తాత్పర్యము:  దరిద్రులభాధాలను తొలగించువాడు వేదవాక్కులకు నిలయముయినవాడు, శివుని పెద్దకుమారుడు,  రాక్షసుల గర్వమును అణగద్రోక్కువాడు, ప్రళయకాల భయంకరుడు, అగ్ని మొదలగు దేవతలకు అలంకారమైనవాడు, చెంపలపై మదజలము కారుచున్నవాడగు గజానుని సేవించుచున్నాను.

నితాంత కాంత దంతకాంతి మంతకాంత కాత్మజం
ఆచిన్త్యరూప మన్తహీన మంతరాయ కృంతనం
హ్రిదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంత మేవతం విచింతయామి సంతతం.. [5]

తాత్పర్యము:  తలతలలాడు దంతము కలవాడు, యమునుని కూడా అంతమొందించు శివునికి పుత్రుడు, ఉహకందని రూపము కలవాడు, అంతము లేనివాడు, విఘ్నాలను భేదించువాడు అగు ఏకదంతుని ఎల్లప్పుడూ ద్యానించుచున్నాను.

ఫల స్తుతి
మహా గణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే  హృది స్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం  సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్

తాత్పర్యము:  ప్రతీదినము ప్రతకాలమున గణేశ్వరుని హృదయములో స్మరించుచు ఎవరు భక్తితో ఈ గణేశ పంచరత్న స్తోత్రమును పాటించునో అతను  ఆరోగ్యమును, నిర్దోషిత్వమును, మంచి విద్యను, చక్కని సంతానమును పొంది చిరాయువై శీఘ్రముగా ఐశ్వర్యములును పొందును.  

మంగళవారం, అక్టోబర్ 02, 2012

లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము

మంగళవారం, అక్టోబర్ 02, 2012

File:Lal Bahadur Shastri.jpg
లాల్ బహదుర్ శాస్త్రి 

ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. 
లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము సందర్బముగా నివాళి అర్పిద్దాం మరి.

Gandhi @ International Non-violence day

International Non-violence Day
 
International Non-violence day గా 2 అక్టోబర్ , మహాత్మా గాంధీ, భారత స్వాతంత్ర ఉద్యమం మరియు కాని హింసతత్వశాస్త్రం మరియు వ్యూహంలో మార్గదర్శకుడు నాయకుడైన మహాత్మా గాంధి గారి పుట్టినరోజు గుర్తుగా  జరుపుకోబడుతున్నది.
ఈ రోజు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి పుట్టిన రోజు 

జన్మ నామం: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జననం: అక్టోబరు 2, 1869, పోరుబందరు(గుజరాత్)
మరణం: జనవరి 30, 1948 న హత్య చేయబడ్డాడు
వృత్తి :న్యాయవాది
పదవి :మహాత్మ, జాతి పిత, బాపూజీ
భార్య :కస్తూర్బా
సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
తండ్రి: కరంచంద్ గాంధీ
తల్లి: పుతలీ బాయి
గాంధిగారి ఆధార్సములు: గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు.
గాంధిగారి తత్వము: గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు.
గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు.
గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది.

చూడటానికి : నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు.
గాంధిగారి మాట:  సత్యమేవ జయతే.
గాంధిగారి రోజు: ఈరోజు గాంధిగారి పుట్టినరోజు ను Non-violence day గా జరుపుకోవాలి .

సోమవారం, అక్టోబర్ 01, 2012

అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు'

సోమవారం, అక్టోబర్ 01, 2012

ఒక పర్యావరణ వ్యవస్థ, జీవ వ్యవస్థ, జీవారణ్య ప్రాంతాలు లేదా మొత్తం భూమిపై ఉన్న జీవ రూపాల యొక్క భేదమే జీవవైవిధ్యం . జీవశాస్త్ర వ్యవస్థల స్వస్థతా పరిమాణంగా జీవవైవిధ్యం తరచూ ఉపయోగించబడుతుంది. నేడు భూగోళంపై ఉన్న అనేక మిలియన్ల విభిన్నజాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామంనుండి అభివృద్ధి చెందింది.  కాలుష్యం, వాతావరణమార్పులు కూడా జీవవైవిధ్యాన్ని అంతరింపజేస్తున్నాయి కదా అందే ముఖ్యవుద్దేసంగా ఈరోజు ప్రపంచ జీవవైవిధ్య  (biodiversity) సదస్సు హైదరబాదులో ఈరోజు ప్రారంభము అయ్యాయి . దీనికి ప్రపంచంలో 193 దేశాల ప్రతినిధులు హాజరు అవుతున్నారు.
భూగోళంలో వున్న భిన్న వృక్ష, జంతుజాతులు, ఆ జాతుల్లో వున్న మొత్తం తేడాలన్నింటినీ కలిపి జీవవైవిధ్యంగా పరిగణిస్తున్నాం. జీవావిర్భావం తర్వాత గత 3,500 కోట్ల సంవత్సరాలకుపైగా జరిగిన పరిణామక్రమంలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. నిపుణుల అంచనా ప్రకారం భూగోళంలో భిన్నమైన, గుర్తించగల 100 నుండి 300 లక్షల వృక్ష, జంతుజాలాలు వున్నాయి. కానీ, వీటిలో ఇప్పటి వరకు అధ్యయనం చేసి, గుర్తించగలిగింది సుమారు 14.35లక్షల రకాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా 7.51లక్షల రకాలు కీటకజాతి కి చెందినవి. ఆతర్వాత 2.81లక్షల జంతుజాతికి చెందినవి. ఉన్నత వృక్షజాతికి చెందినవి 2.48లక్షల రకాలు గుర్తించబడినవి. ఇక మిగ తావి ప్రోటోజోవా, ఆల్గేలు, ఫంజీ, బ్యాక్టీరియా తదితరాలు. అడవుల్లో కొత్తగా అధ్యయనం చేస్తున్న కీటకజాతుల్లో ఆరింటిలో ఐదు కొత్తరకా లుగానే గుర్తించబడుతున్నాయి. తద్వారా మనం గుర్తించిన జంతు జాలాల కన్నా ఇంకా గుర్తించాల్సినవే చాలా ఎక్కువగా వున్నాయని ఈ ధోరణి తెలుపుతుంది. ఇలా గుర్తించిన రకాలలో కూడా అంతర్గతంగా ఎంతో వైవిధ్యం గుర్తించబడింది. ఉదా: వరి శాస్త్రీయపరంగా ఒకే ఒక మొక్క. కానీ దీనిలో మన దేశంలోనే వేల రకాలు గుర్తించబడ్డాయి. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనే జీవప్రక్రియలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మారుతున్న వాతా వరణ, పర్యావరణ ధోరణిని తట్టుకోవడానికి ఈ వైవిధ్యం ఎంతో ఉప యోగపడుతుంది. ఈ వైవిధ్యమే లేకుంటే భూగోళంలో ఏ చిన్న దుష్ప రిణామం వచ్చినా ఈ రకాలు అంతరించి, మానవ ఆహారలభ్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
What is biodiversity

సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, తరగని జీవ సంపదకు భారతదేశం నిలయం. పలురకాల ఆవాసాలకు, ఆవరణ వ్యవస్థలకు, వాటి వైవిధ్యానికి మనదేశం పెట్టింది పేరు. ఉష్ణమండల వర్షారణ్యాల నుండి, ఆల్పైన్‌, సమశీతోష్ణ అడవులు, తీరప్రాంత చిత్తడి అడవులు, మడ అడవులు ఇలా ఎంతో వైవిధ్యభరిత జీవావరణ వ్యవస్థల్ని ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు జీవవైవిధ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వైశాల్యంలో కేవలం 2.4 శాతం ఉన్న మనదేశంలో 7.3 శాతం జీవజాతులు (సుమారుగా 89,451 జాతులు) ఉండటం విశేషం. జీవ భూగోళ ప్రాంతాలు పది ఉన్నాయి. వీటిలో ఎడా రులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఉష్ణ, సమశీతోష్ణ అరణ్యాలు, గడ్డి మైదానాలు, నదీపరీవాహక ప్రాం తాలు, అర్చిపెలాగో ద్వీపాలు, మడ (మాంగ్రూస్‌) అడవులు ఇందుకు నిదర్శనాలు. ప్రపంచపు 18 స్థూల వైవిధ్యం ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. క్షీరదాల్లో 7.6 %, పక్షుల్లో 12.6%, సరీసృపాలు 6.2%, ఉభయచరాల్లో 4.4%, చేపల్లో 11.7%, పుష్పించే మొక్కల్లో 11.7% మనదేశంలోనే ఉన్నా యంటే జీవవైవిధ్యపరంగా మనదేశ ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. ఆసియా ఏనుగు, బెంగాల్‌ పులి, ఆసియా సింహం, చిరుత, రైనాసెరాస్‌ వంటి ఎన్నోరకాల ప్రత్యేక జాతులకు మనదేశం ప్రసిద్ధి. ఈ జీవ వైవిధ్య కేంద్రాల్లోనే మనం పండించే అనేకరకాల మొక్కలు ఉద్భవించాయి. రకరకాల పంట మొక్కల ఉద్భవానికి నిలయమైన 12 కేంద్రాల్లో మనదేశం ఒకటి. ఇంతటి గొప్ప జీవవైవిధ్య వనరులు క్రమంగా అదృశ్యం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అందుకే ముఖ్య వనరుగా, సంపదగా ఉన్న మనదేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఈ జరగబోయే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు' స్ఫూర్తినిచ్చి, కార్మోన్ముఖులను చేస్తాయని ఆశిద్దాం.  మన రేపటి పౌరులకు మన వనరు సంపద ను కాపాడి అందించగలరు అని ఆశిద్దాము.

గురువారం, సెప్టెంబర్ 27, 2012

భగత్ సింగ్ గొప్ప ఉద్యమకారుడు

గురువారం, సెప్టెంబర్ 27, 2012

Bhagat Singh



















ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.


భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."

భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.

అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.

భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

బుధవారం, సెప్టెంబర్ 26, 2012

నిజము పకోడీ!

బుధవారం, సెప్టెంబర్ 26, 2012



చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశేవాడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జన్మదినము సందర్బముగా తెలుగు సాహిత్య అబిమానులకు శుభాకాంక్షలు.
వారికి సరదాగా ఈ పకోడీలు అందుకొండి మరి.
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు.

"కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!


శనివారం, సెప్టెంబర్ 22, 2012

ఆదివారం రేడియో జోష్ లో హరివిల్లు వస్తుంది

శనివారం, సెప్టెంబర్ 22, 2012

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుం
ది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు. 
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే

Radio Josh Live 

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003 

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.

How Smart U R ??


Just do it. Don't cheat! Because of you did, this test would be no fun. We promise that there are no tricks to this test.

Read the sentence below:
          
FINISHED FILES ARE THE
RESULT OF YEARS OF SCIENTIFIC
STUDY COMBINED WITH THE
EXPERIENCE OF YEARS

Now count the F's in that sentence. But here is a small condition.  that is count them ONLY ONCE.   Do not go back and count them again.

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2012

గురజాడ వారి అడుగుజాడ.

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2012





















దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. 
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.
గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.

తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి 
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.  ఈరోజు అప్పారావుగారి 150 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి శుభాకాంక్షలు.  అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము.

గురువారం, సెప్టెంబర్ 20, 2012

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి

గురువారం, సెప్టెంబర్ 20, 2012



గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి }  chorus

గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే
గురువిక్రమాయ గుల్హ్యప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ 
గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయా

గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి
గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయా ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి }  chorus

{గంధర్వరాజాయా గంధాయా గంధర్వ గాన శ్రవణప్రనైమే
గాఢఅనురాగాయ గ్రంధాయా గీతాయ గ్రంధార్థ తన్మైయే 
గురిలే...గుణవతే ..గణపతయే..  }  chorus
 
గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనే
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపఠవే
గేయచరితాయ గాయ గవరాయ గంధర్వప్రీకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే 
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ 
గౌరభాను సుఖాయ గౌరీ గణేశ్వరాయ

గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
ఓ సహస్త్రాయా గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి 
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి } chorus

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)