
నీల్స్ బోర్ 1913 సంవత్సరములో పరమాణు నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని' ఉపయోగించాడు. 1918 లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం కోపెన్హాగన్కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై ప్రచారం చేశాడు. CERN అనే ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్ బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.