Blogger Widgets

ఆదివారం, జనవరి 07, 2018

నీవీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము పొందగమేమీనాడు వచ్చాము

ఆదివారం, జనవరి 07, 2018

ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దశలోనున్నవారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించినంతనే  పోగొట్టుకోవాలని , తమకులేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై  శ్రీకృష్ణునకు మంగళము పాడుచున్నారు.  ఇట్లే గోపికలు శ్రీ కృష్ణపరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆపాదాములు ఎర్రదనమును  చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి.  ఈ పాశురము చాలా విశేషమైనది.  మన స్వామివారికి హారతి అంటే  చాలా ఇష్టం కదా అందుకే  ఈ పాసురములో స్వామికి వారికి హారతి ఎక్కువగా ఇస్తారు.  విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.

పాశురము:
అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షిణ  దిశనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము . వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.  ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.  శ త్రువులను సములముగా పెకళించి  విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీవీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము పొందగమేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

శనివారం, జనవరి 06, 2018

సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చు

శనివారం, జనవరి 06, 2018

అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరివిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
పాశురము 



మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్పసవర్ణ !
నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

శుక్రవారం, జనవరి 05, 2018

ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.

శుక్రవారం, జనవరి 05, 2018

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
పాశురము 


అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది.  నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షితించితివా !  మేము అనుభావించేతీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

గురువారం, జనవరి 04, 2018

బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము.

గురువారం, జనవరి 04, 2018

గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి!
మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.
ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు.
పాశురం

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి, పొంగిపొరలి నట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.

గోపికలు వారి స్ఠితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.

బుధవారం, జనవరి 03, 2018

ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము.

బుధవారం, జనవరి 03, 2018

ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి,  శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు.  మరి ఎలా వర్ణిస్తున్నారంటే...


పాశురము:


ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై 
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్



తాత్పర్యము:
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.

ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?

ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి .  ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.  లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం.   నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు

పాశురము 
 
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు? ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.  

సోమవారం, జనవరి 01, 2018

భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా !

సోమవారం, జనవరి 01, 2018

గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో . 

పాశురము:

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.  అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.



ఆదివారం, డిసెంబర్ 31, 2017

నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము.

ఆదివారం, డిసెంబర్ 31, 2017

గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.  మరి ఎలా లేపుచున్నారో చూడండి.

పాశురం : 
  
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.   అని గోపికలు ప్రార్ధించిరి. 


శనివారం, డిసెంబర్ 30, 2017

శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము .

శనివారం, డిసెంబర్ 30, 2017

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి  ప్రవేశింతురు .
 


పాశురము:
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము .  స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.  

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ?

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురమున లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో కోసం చిత్ర ఫలితం

పాశురము:
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్ 


తాత్పర్యము:

బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.

గురువారం, డిసెంబర్ 28, 2017

నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా?

గురువారం, డిసెంబర్ 28, 2017

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .

 పాశురము: 

ఉంగళ్ పుళ్ళైక్కడై తోట్టత్తు వావియుళ్
శెంగళ్లునీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కుమ్బినగాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:  
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుండుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాట నేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.

బుధవారం, డిసెంబర్ 27, 2017

నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.

బుధవారం, డిసెంబర్ 27, 2017

వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   
పాశురము:


పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


విశేషార్ధం:
పుళ్ళిన్ వాయ్ కీండానై:
అసురావేశము కలిగిన కొంగనోటిని చీల్చిన వానిని ముందుగా గోపికలు శ్రీ కృష్ణుని కీర్తించుచున్నారు.  భాగవత్ప్రాప్తికి భగవంతుడే ఉపాయం అని నిశ్చయము కల్గుటకు దంభము, అహంకారము, ప్రదానమైన శత్రువులు.  ఆ రెండిటిని తొలగించి తానే ఉపాయం అని చెప్పుటకు బకాసుర వధ వృత్తాంతము కీర్తిస్తున్నారు. తరువాత రావణవధ వృత్తాంతం ప్రస్తావిస్తునారు.  వారు అంతకుముందే రాముడు కృష్ణుడు ఒకటే అని వారి కీర్తిని కీర్తిస్తున్నారు. ముందుగా కృష్ణుని తరువాత రాముని వృత్తాంతమును కీర్తింస్తున్నారు.
ప్పొల్లావరక్కనై  కిళ్ళి క్కళైందానై :
దుష్ఠరాక్షసుని గిల్లి పారవేసిన వానిని కీర్తించుచున్నారు. తమకు పరిచయమున్న కృష్ణుని వృత్తాంతము కీర్తిచి తరువాత తమతో సజాతీయయగు సీతాదేవిని విడచియుండలేక ఎంతో వ్యధ చెందిన సౌజన్యమూర్తి యని శ్రీ రాముని కీర్తిస్తున్నారు. శరీరమును ఆత్మను విడదీసినట్లు తల్లిని తండ్రిని ఒకచోట వుండనీక వారికి ఎడబాటు కల్గించిన నిక్రుష్టుడు  రావణుడు.  సర్వేశ్వరుని నుండి లక్ష్మిని విడదీయగాలిగిన రాక్షసుడు వేరొకడు లేదు అందుచే దుష్టరాక్షసుడు అంటున్నారు.  అలా అనగానే దుష్టరాక్షసుడు అనగానే స్పురించేది రావణునిపీరు మాత్రమె.  వారు పేరు కూడా చెప్పటంలేదు. అలాంటి వారిద్దరిని కీర్తిస్తున్నారు గోపికలు.
కీర్-త్తిమై పాడి ప్పోయ్:
కీర్తినిపాడి కొనుచూపోయి,  గోపికలు వ్రతము చేసే స్థలమునకు చేరిరి.  కీర్తనే ఆధారంగా చేసుకొని వ్రాతముచేయుతకు గోపికలు ముందుకు సాగుతున్నారు.
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్:
పిల్లలందరును వ్రతముచేయు క్షేత్రమునకు చేరినారు.  కృష్ణుని పొందుటకు నిర్ణయించబడిన స్థలమునకు ముందుగానే పోయిరి.  నీవును మేల్కొని రమ్ము అని లోనున్న గోపికను ఆహ్వానించిరి.  ఆమె యొక్క కృష్ణ సమాగామునందు ఆతురత గల గోపికలు ఆగలేక ముందుగానే వెళ్ళిపోయారు.  కానీ వారు వెళ్ళుట తెల్లవారుటకు గుర్తు అవునా! కావునా వేరే గుర్తు చెప్పండి అనగా తెల్లవారినది అనుటకు వేరే గుర్తు చెప్తున్నారు. 
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు:
శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు. గొల్లవారుఅగుటచే వీరు నక్షత్రములను బట్టియే వారికి తెల్లవారుట గుర్తిస్తారు.  శుక్రుడు ను ఙ్ఞానాముగా, గురుడును అఙ్ఞానముగా వీరు తలంతురు. అదే చెప్పిరి లోన వున్నా కోపిక మీరు సంతతము కృష్ణ పరమాత్మ సంస్లేషమునే కోరినవారాగుటచే మీకు తెల్లారినట్టు అనిపిస్తోంది. నక్షిత్రాలన్ని మీకు శుక్రుడుగా, గురుడుగానే కన్పిస్తున్నాయి.  అందుచే నమ్మదగిన ప్రాభాతిక చిహ్నము కాదు అని లేవకుడా పడుకున్నది.  అప్పుడు వేరొక గుర్తులు చెప్పుచున్నారు గోపికలు.
 పుళ్ళుం శిలమ్బిన కాణ్ :
పక్షులు ధ్వని చేయుచున్నవి.  వెనుక 6 , 7  పాసురములో పక్షులుగురిమ్చి వచ్చింది మళ్లీ ఇక్కడ కూడా పక్షుల కిలకిల రవములు పేర్కొనబడినది.  పక్షులు అనగా ఆచార్యులని మనం ఇదివరకే అనుకున్నాం.  భగవంతుని అనుభవించమని నిస్తులగు ఙ్ఞానులు మేల్కొల్పును అవి వేల్లుబుచ్చే పలుకులే మొదటి కాలం.  ఆ భగవద్ అనుభవం నీవు ఒకదానివె అనుభవించుట తగదు అంటున్నారు.  కానీ ఈమె వీరి మాటలును లెక్కచేయక మాటాడక పడుకుమ్డెను.  అలా పడుకోనుటకు ఆమె నేత్ర సౌందర్య గర్వమే అని ఆమె నేత్ర సౌందర్యమును ప్రసంసిస్తున్నారు.
పోదరి క్కణ్ణినాయ్:
తామరపూలు మద్య తుమ్మెద ఉన్నట్లు ఒప్ప్చున్న కన్నులున్నదానా!  తామరపువ్వుతో పోటీపడు కనులుకలదానా! ఇటు అటు సంచరించు లేడి కళ్ళను పోలు కనులు కలది అనుతచే మౌనము స్పురించును.  ఇలా పరిపూర్ణ బ్రహ్మనుభావమున మునిగియున్న ఈమెను నేడు మేల్కొల్పుచున్నారు.
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే పళ్ళి క్కిడత్తియో:
చల్లగా చల్ల్బడునట్లు మునిగి స్నానము చేయక పానుపు పై పడుకొని ఉంటావా? భక్తులగు మాతో భాగావదనుభావం పొందుటకు మాతో రావా?  మాతో కలిసి గుణానుభవ మొనర్చి భాగవత్సార శ్లేష మొనర్చాలి అని అర్ధిస్తున్నారు.
పావాయ్!:
సుకుమారమైన స్త్రీ త్వము కలదానా నీవు కృష్ణుని తో కూడి ఉండి మమ్ములను అనుగ్రహించు.
నీ నన్నాళాల్:
మంచి రోజులు కదా.  ఈ గోపికలు లోపలున్న గోపిక యోగ్యతా గుర్తించి భగవదనుభవ యోగ్యతా కలిగి ఏకాంతముగా నీవిట్లుండుట.  ఆ కృష్ణుని మనసునకు కూడా భాద కలిగించును మాతో వచ్చి వానిని అనుభవించు.
కళ్ళమ్ తవిరుందు కలన్దు:
కపటమును వీడి కలువు. కృష్ణుని అనుభావస్తున్నట్టు భావించి వీరు నీవు ఆడుతున్న నాటకాలు చాలు ఇక రా అని అంటున్నారు.  ఇలా ఈ పాసురమున గల అన్ని సన్నివేసమును బట్టి, సంబోధనమును బట్టి పెరియాళ్వారు ఈ పాసురమున ప్రబోధించినట్టు తెలుస్తోంది.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా! పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ.  ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును.  ఇది ఒక నిద్ర వంటిదే.  ఇంతవరకు నాల్గు పాశురములలో  నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం.  ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.
"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః 
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ll "
తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు  ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది.  ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు.  మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా. 
పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
యస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి.  ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా  బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం.  అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము.  అయినాను నీవు పెదవి విప్పలేదు.  ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా!  పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు. 

ఓ సంపన్నురాలా ! నీ నిద్ర కి కారణం ఏమిటో తెలియచేయుము.

ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము.  గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు.  నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది.  అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది.  సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.

 పాశురము:

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:  లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాము యోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా?  రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు.  నీ వాకిలి ముందు చేరియున్నారు.  నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు.  ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి?  ఓ సంపన్నురాలా ! నీ నిద్ర కి కారణం ఏమిటో   తెలియచేయుము.

విశేషార్ధాము:
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు:
లేగదూడలు కల చాలా ఆవుల మందలకు పాలుపితికి.  దూడలుగా గల ఆవులే ఐనను శ్రీ కృష్ణస్పర్శ, వేణుగానాము. వేణుగానమును విని కృష్ణ స్పర్శచే బలసి సమృద్దిగా పాలిచ్చుచ్చున్న ఆవులవి.   ఆవుల పాలు పిండు నేర్పునఉనంత మాత్రమున లాభములేదు.  పొంచియుండి  ఆ ఆవుల కాపదలు కల్గించెడి విరోధుల నెదిరించెడి బలము కూడా గలదీ గోపాలురకు అని చేబుచున్నారు.
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం:
శత్రువుల బలము నశించునట్లు ఎదురించి యుద్ధము చేయువంశము.  శ్రీ కృష్ణ పరమాత్మ అతిశయమును ఓర్వలేనివారే గోపాలురకు శత్రువులు.  భగవద్సంభంధము కలిగి భగవంతుని ప్రేమించియున్న వారికి భగవద్వేషులుగా కన్పెట్టుచుందురు.  అటువంటి బలప్రతాపము తమపై కూడా చూపునో ఏమో అని " అమ్మా! అలా బలమును చూపి త్రోసిపుచ్చుట శత్రువులనే కాని ఆశ్రయించిన వారిని కాదమ్మా! దిక్కు లేనివారిని కాదమ్మా!" అది మీ గోపాలురకు లక్షణము కాదని,
కుత్తం ఒన్ఱిల్లాద:
ఏ దోషమునులేని గోపాలవంశమున పిట్టినదాన వనుచున్నారు. శత్రువు ఎదిరించివచ్చిన ఉపేక్షించినవారను దోషములేదు. శత్రువైనను చేతిలో ఏమియు సాధనములేనిచో హింసించరాదు.  "ఎంత చెడ్డవాడైనను సరే! నన్ను ఆశ్రయించి సేవించినచో అతడు మంచి వాడే! అతడు గౌరవించదగినవాడే" అని భగవద్గీత లో శ్రీ క్రుష్ణులవారు అన్నారు కదా!  ఆ వంశములో పుట్టిననీకు ఆ లక్షణములు వుండాలి కదా!
కోవలర్-దం పొఱ్కొడియే:
గోపవంశము నందలి బంగారుతీగా! అని సంబోధించుచు మేల్కొల్పుతున్నారు. తీగ అనుటచే ఒకదాని చేరికలేనిదే నిలువనిది అని తెలుయుచున్నది.  బంగారు తీగెఅనుటచే విశదం, దృడమైనది అని అర్ధం అగుచున్నది. స్త్రీలకూ కూడా మోహము కల్గించు సౌందర్యవతి అని ఆమె సౌందర్యమును వర్ణిస్తున్నారు.  అది సౌందర్యమునకు అతిశయం అని ఆమె ను వర్ణిస్తున్నారు.
పుత్తరవల్ గుల్ పునమయిలే:
పుట్టలోని  సర్పము వంటి నితంబము కలదానా! అడవిలోని నెమలి వంటిదానా!. పుట్టలోని శరీరమునంతటను ముడుచుకొని దానిపై పడగవిప్పి పరున్న పామువలె నితంబమున్నదని ఇక్కడ వర్ణిస్తున్నారు.  ఈ వర్ణన కొత్తగా వున్నది.  అలా వుండగా ఈమెకి పునమయిలే అని అడవి నెమలివంటి జుట్టు కలది అంటున్నారు.  ఆ జుట్టు కూడా నెమలి పురివిప్పినట్టు వుందిట.  అంటే నెమలి మేఘాలను చూచి ఎలా నృత్యము చేయునో అలా జుట్టు వికసించి వుందిట.  బంగారుతీగ అనుట కూడా ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు.  జుట్టు అనగా వ్యామోహం, ఆమెకి పరమభక్తి, భక్తి, పర భక్తి అను భక్తి వ్యామోహాలు కలిగివుంది.  "నీ అందము చూచి పరమపురుషుడే వచ్చునని నిర్బరంగా పడుకోటం కాదమ్మా!  మమ్ములను కలుసుకొని పరమాత్మకు చేర్చాలి అని లేపుచున్నారు.
పోదరాయ్: 
లేచి రావమ్మా!  నీ అందముచే నీ వద్దకు పరమపురుషున్ని ఆకర్షించుట కాదు.  నీ అందము తో అతని ఆకర్షించి వసపరచుకొని మమ్ములను అతని చేర్చాలని.  నీవే మాకు ఆదారం కావునా నీవు నడచి రమ్ము. అలా నడచివచ్చి తమ బృందములో చేరుమని కోరగానే, ఆమె లోపలినుండి అందరూ వచ్చినారా? అని ప్రశ్నించగా
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు:
చుట్టరికముగల చేలికత్తేలందరును వచ్చిరి అని సమాదానము చెప్పుచున్నారు.  ఈ వ్రేపల్లెలోని వారందరును ఈమెకు చుట్టములె ఈమెకు చెలికత్తేలే.  సమానమైన బుద్ధికలవారిని సఖులందరు.  అందరూ నీ వాకిలికి వచ్చినారు.
నిన్ ముత్తం పుగుందు :
నీ ముంగలి చొచ్చి నీ వాకిట చేరినాము.  ఆమెచే బందము కలుగటచే ఆ వాకిలి పరమపదము కంటే కూడా ప్రాప్యమును భావముతో చూచుచున్నది.  సర్వశేషియగు సర్వేస్వరుడు వచ్చి నిలుచు ముంగిలి కదా ఇది. ఆ ముంగిట చేరి పొందదలచిన దేమిటో చెప్పుచున్నారు.
ముగిల్ వణ్ణన్ పేర్-పాడ:
మేఘవర్ణుని నామమును కీర్తించుతాకే వచ్చితిమి. నీలమేఘశ్యాముని వర్ణించుట, అతని స్వరూపమును కీర్తించుట మా ఆనందమునకు కాదు.  నీ మనసుకు ఆనందము కలిగించుటకు కీర్తిస్తున్నాం.
శిత్తాదే పేశాదే:
అలా కీర్తిస్తున్నను నీవు ఉలుకక పలుకకు ఉన్నావేమి? భగవద్భక్తులు భాగావదనుభావము చే పొందే ఆనందాతిరేఖము చేసే చేష్టలు, పల్కులు, చూచి , విని ఆనందించుటనే ఆకాంక్షింపదగినది.
 శెల్వప్పెణ్డాట్టి:
సంపన్నురాలగు ఓయమ్మా! భగవద్అనుభవం ఒక రాసిగా చేసికొని అనుభావిమ్చుగల ఐస్వర్యము ఈమెకి కలదు. భగవద్పరతంత్రం ఉన్నది.  అలా భగవంతుని వసపరచుకొని ఆ పారవశ్యములో పాడుకొనుట  కాదు కదా
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్:
నీ నిద్రకు అర్ధం ఏమిటమ్మా?   ఇక్కడ నిద్ర అనగా పరిపూర్ణమైన భాగావదనుభావం లో బాహ్య స్మ్రుతి లేకుండుట.  అలాంటి ఎకానుభూతి కైవల్యము వంటిది.  అలాంటి కైవల్యము కల అమ్మాయిని పరకాలులు ఈ పాసురములో మేల్కొల్పినారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)