మంగళవారం, సెప్టెంబర్ 16, 2008
- ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ? ----కరంటు తీగలు
- ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?----చేతి కర్రా,చెప్పుల జత.
- ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది? ---- మర్రి చెట్టు.
- ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి? -----మెప్స్
- ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?------గొడుగు.
బాగున్నాయా . రేపు మరి కొన్ని చూద్దాం. బాయ్ ................
సోమవారం, సెప్టెంబర్ 15, 2008
ఈ రోజు నాకు స్కూల్లో ఈ రైం నేర్పించారు నాకు చాలా నచ్చింది. నా లాగే మీకునచ్చుతుందేమో చూడండి . నాకు వచ్చేసింది కుడా.
Waves lap lap
Fish fins clap clap
Brown sails flap flap
Chop-sticks tap tap
Chop-sticks tap tap
Brown sails flap flap
Fish fins clap clap
Waves lap lap.
శ్రీ వైష్ణవి.
- ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ?
- ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?
- ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది?
- ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి?
- ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?
సమాధానాలు పంపండి. నేనైతే రేపుచేప్తా. అప్పటి దాకా వేచి వుండాలి మరి.
శ్రీ వైష్ణవి.
ఆదివారం, సెప్టెంబర్ 14, 2008
జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెడుతుండగా కొంతమంది ఆయనగురించి చెడ్డగా చెప్పుకుమ్టుండడం వినిపించింది. జీసస్ ముఖమ్లో ఎటువంటి బాధా లేదు. పైగా ప్రేమపురకమైన దరహాసం చిందిస్తూ వారి గురించి తనతో వున్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.
జీసస్ వికారి వారికి అర్ధం కాలేదు . `అదేమిటి పభు ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మీరు వారి గురించి ఇలా మీరు మంచిగా మాటలాడుతున్నారు ?' అని అడిగారు.
` దానికీముంది ? ఎవరైనా తమ దగ్గర వున్నదే ఇతరులకు ఇస్తారు' అని అన్నారు జీసస్.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ