Blogger Widgets

Monday, September 15, 2008

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

Monday, September 15, 2008

  1. ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ?
  2. ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?
  3. ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది?
  4. ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి?
  5. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?

    సమాధానాలు పంపండి. నేనైతే రేపుచేప్తా. అప్పటి దాకా వేచి వుండాలి మరి.
శ్రీ వైష్ణవి.

2 comments:

  1. 1. వీణ తంత్రియా?
    2. గొడుగూ / చేతి కర్రా + పాద రక్షలూనూ
    3.మర్రి చెట్టా?
    4.తెలీదు
    5. గొడుగు

    బావున్నాయి, ఈ పొడుపు కధలు.

    ReplyDelete
  2. naalugo daaaniki answel plapancha patam(map :):))

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers