బుధవారం, డిసెంబర్ 17, 2008
మంగళవారం, డిసెంబర్ 16, 2008
తిరుప్పావై 2 వ పాశురం -వ్రత నియామాలు
ఆండాళ్ తిరువడిగలే శరణం :
మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొమ్దదగినదె అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తిలిసినా తము చేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.
దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పోడుతయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?
వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .
కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటిమ్చుదురు .
వానిని ఈ పాశురములో వివరించుదురు.
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము : శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.
విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.
జై శ్రీ మన్నారాయణ
తిరుప్పావై మొదటి పాశురం - నారాయణ తత్వము
ఆండాళ్ తిరువదిగాలే శరణం :
గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూల కాలము మనకు లభిమ్చిందే అని ఆ కాలమును ముందుగా పోగాడుచున్నారు.
ఈ వ్రతము ఎవరు చేయుటకు తగినవారో నిర్ణయించుకున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫలమేమో , దానిని పోదిమ్చు సాధనమేమో స్మరించుచు ఈ మొదటి పాటలో అనంధించుచున్నారు.
మన గోపికలు మరియు గోదాదేవి.
పాశురము:
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
ప్రతిపదార్దము:- శీర్ మల్ గుమ్ = సంపదలు పెరుగుచున్న , ఆయ్ ప్పాడి = వ్రేపల్లెలో , శేల్వమ్ = ఐశ్వర్యముతో నిండిన, శిరుమీర్ కాళ్ = పడచులారా! ,నేరళైయీర్ = విలక్షణ్ములయిన ఆభరణములను కలవారలారా! మార్గళిత్తింగళ్ = మార్గశీర్షమాసమున్ను, మది నిఱైంద = నిండు చందురుడుగల , నల్ + నాళ్ = మంచి రోజున్ను (వచ్చినవి) ఆల్ = ఓహో ! కూర్ = వాడి అయిన , వేల్ = వేలాయుధమును ధరిచినవాడై , కొడుం తొళిలన్ = కృష్ణుని విషయములో అపచారము చేయువారిపై క్రూరముగా ప్రవర్తించి కృష్ణునకు సేవచేయు , నంద గోపన్ = శ్రీ నంద గోపుల యొక్క , కుమరన్ = కుమారుడున్ను , ఏర్-ఆర్ నందకణ్ణి = సౌందర్యముతో నిండిన కన్నులు కల , అశోదై = యశోదా దేవి యొక్క , ఇళం శింగం = బాల సిమ్హమున్ను , కార్ మేని = తాపమును పోగొట్టు నల్లని శరీరముకలవాడును, శెంగణ్ = ఎఱ్ఱని నేత్రములు కలవాడును, కదిర్ మదియంబోల్ = సూర్యుని చంద్రుని పోలిన , ముగత్తాన్ = ముఖమును కలవాడైన , నారాయణనే = నారాయణుడినె నమక్కే = మనకే, పఱై = మనచే వాంచింపబడిన సాదనమును-పరను , తరువాన్ = ఇచ్చువాడు, పారోర్ = చూచువారు, పుగళ = పొగడునత్లు , పడిందు = ఈ వ్రతములో చేరి , నీరాడ ప్పోదువేర్ = మార్గశీర్ష స్నానముచేయు గోరువారు, పోదుమినో =రండు , ఏల్ = ఈవిధముగా ఓ జనులారా ! ఎంబావాయ్ = మా వ్రతమయి యున్నది, ఓర్ = ఈ వ్రతమునూ చేరుటకు మనసుపెట్టుడు. " ఏలో రెంబావాయ్ " అనునది ప్రతి పాశురమునకు చివర కు వచ్చు మకుటము.
తాత్పర్యము :- ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.
అని అర్దము