మంగళవారం, జులై 07, 2009
కొత్త కొత్త గా వుంది ,
హాయ్ ! కొత్త కొత్త గా వుంది అంటున్నాను ఏమిటి అనుకుంటున్నారా...........................? మీతో చాలా కబుర్లు చెప్పాలి అన్నాను కదా ! గుర్తు వచ్చిందా. సరే మరి చెప్తాను . అది ఏమిటంటే ..................
సమ్మర్ అయ్యిపోయింది కదా ! నేను చోడవరంలో వుండే దానిని కదా ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను . హైదరాబాద్ బలే బాగుంది . కొత్త స్కూల్లో చేరాను . కొత్త క్లాస్ లోకి వచ్చాను. కొత్త స్నేహితులు దొరికారు, కొత్త పుస్తకాలు , కొత్త uniform అవీ అవీ కాదు అన్నీ కొత్తవే. అందుకే కొత్త క్రొత్తగా వుండి అన్నాను ఇప్పుడు అర్ధమైందా మరి.
మాకు స్కూల్లో క్లాసు లు మొదలు పెట్టారు హోం వర్క్స్ ఇస్తున్నారు . సంగీతం , డాన్స్ , కరాటే నేర్చుకుంటున్నాను. నాకు కరాటే కంటే డాన్స్ బాగా నచ్చింది. పాటలు నాకు ఎలాగు ఇష్టమే కదా. మిగతా సబ్జక్ట్స్ కుడా బాగున్నాయి. నాకు అన్నిటి లోని మాథ్స్ చాలా నచ్చాయి. నాకు ఫ్రీ టైం దొరికితే మాథ్స్ చేస్తున్నాను . అవి అయిపోయాకా మా అమ్మమ్మ తో స్టోరీస్ చెప్పించుకుంటున్నాను. ఈ మధ్య నేను పోస్ట్ లు పెట్టలేదు కానీ మంచి మంచి కధలు చాలా చెప్పింది . నాకు వీలు కలిగినప్పుడు మీకు చెప్తానే మరి.
ఇక్కడ హైదరా బాదులొ నాకు చెట్లు బాగా నచ్చాయి . మేము వుండే ప్రదేశంలో పక్షులు వున్నాయి . వాటి సౌండ్స్ ఎంత బాగున్నాయో. నేను అప్పుడు అప్పుడు ఫొటోస్ కుడా తీశాను నాకు పక్షులు చాలా నచ్చాయి. అవికూడా మీతో వీలున్నప్పుడు షేర్ చేసుకుంటాను .
మరి నాకు అన్నీ కొత్తే కదా .............