శుక్రవారం, జులై 24, 2009
ఈ రోజు శ్రావణమాసంలో వచ్చిన మొదటి శుక్రవారము కదా. అందుకు అమ్మమ్మ పూజ చేసుకుంది . అయితే అమ్మమ్మ మహాలక్ష్మి పూజ చేసింది. అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు నేను ఈ పాట పాడాను. అన్నమాచార్యులవారు రచించినది. క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మినికి నీరాజనం. పాట చాలా బాగుంటుంది.
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ll
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ll
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ll
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ll
నాకు ఈ పాట చాలా ఇష్టం అందుకే ఈ పాటని మీరు వింటారని . సరె మరి వచ్చే వారానికి అమ్మవారిపాట ఇంకొకటి పెడతాను . సరెనా. bye.
బుధవారం, జులై 15, 2009
హాయ్! అందరికీ అమ్మమ్మ చిన్నకధ చెప్పింది ఇప్పుడే అది మీకూ చెప్పనా. ఐతే కధ చాలా చిన్నది మరి. సరె ఐతే చెప్తున్నాను.
అనగనగా ఒక మంత్రిగారు పనిమీద ఒక వూరు మీదుగా ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రిగారు కి రైతు తన చెరకు తోటలోని తాజాచెరుకు రసం ను తీసి ఇచ్చాడు. తీయని చెరకు రసం తాగిన మంత్రిగారికి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చెయచ్చునో అని మనసులో లెక్కలు వేసుకున్నాడు . మంత్రి ఇంకోంచెం చెరకు రసం తీసుకురమ్మనాడు. ఈ సారి తెచ్చిన రసం అంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యాన్ని వెల్లిబుచాడు. మీ మనసులో అసూయ ప్రవేసించింన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది. అని రైతు సమాధానం ఇచాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి.
అయితే ఈకధలో నీతి ఉంది. అది ఏమిటంటే
చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితము చేస్తాయి అని. కధ బాగుంది కదండి. మరో సారి ఇంకో విషయంతో వస్తాను మరి bye.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ