హాయ్! అందరికీ అమ్మమ్మ చిన్నకధ చెప్పింది ఇప్పుడే అది మీకూ చెప్పనా. ఐతే కధ చాలా చిన్నది మరి. సరె ఐతే చెప్తున్నాను.
అనగనగా ఒక మంత్రిగారు పనిమీద ఒక వూరు మీదుగా ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రిగారు కి రైతు తన చెరకు తోటలోని తాజాచెరుకు రసం ను తీసి ఇచ్చాడు. తీయని చెరకు రసం తాగిన మంత్రిగారికి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చెయచ్చునో అని మనసులో లెక్కలు వేసుకున్నాడు . మంత్రి ఇంకోంచెం చెరకు రసం తీసుకురమ్మనాడు. ఈ సారి తెచ్చిన రసం అంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యాన్ని వెల్లిబుచాడు. మీ మనసులో అసూయ ప్రవేసించింన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది. అని రైతు సమాధానం ఇచాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి.
అయితే ఈకధలో నీతి ఉంది. అది ఏమిటంటే
చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితము చేస్తాయి అని. కధ బాగుంది కదండి. మరో సారి ఇంకో విషయంతో వస్తాను మరి bye.
శ్రీ వైష్ణవి కధ చిన్నదే అయినా చాలా విషయం ఉంది ఆ కధలో! నిజంగానే మనుషుల్లో చెడు ఆలోచనలు వస్తే వారు చెడిపోవడమే కాకుండా పరిసరాలనూ చెడగొడతారు. కాబట్టి నిరంతరం మనసుని నిష్కల్మషంగా ఉంచడానికి సాధన చెయ్యాలి. మంచి కధ చెప్పినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీధర్ అంకుల్ మీరు మంచిగా కామెంట్ ఇచ్చినందుకు మీకు నా ధన్యవాధములు.
రిప్లయితొలగించండి