Blogger Widgets

శుక్రవారం, జులై 24, 2009

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

శుక్రవారం, జులై 24, 2009


ఈ రోజు శ్రావణమాసంలో వచ్చిన మొదటి శుక్రవారము కదా. అందుకు అమ్మమ్మ పూజ చేసుకుంది . అయితే అమ్మమ్మ మహాలక్ష్మి పూజ చేసింది. అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు నేను ఈ పాట పాడాను. అన్నమాచార్యులవారు రచించినది. క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మినికి నీరాజనం. పాట చాలా బాగుంటుంది.




క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ll


జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ll


చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ll


పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ll

నాకు ఈ పాట చాలా ఇష్టం అందుకే ఈ పాటని మీరు వింటారని . సరె మరి వచ్చే వారానికి అమ్మవారిపాట ఇంకొకటి పెడతాను . సరెనా. bye.

9 కామెంట్‌లు:

  1. well written, మీరు పెట్టిన హెడ్డింగ్ మాత్రం గుర్తుంది నాకు. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. నాకు కూడా ఇది చాలా ఇష్టమయిన పాట. బాగుంది. ఏడవతరగతి వేళకే ఇంత చక్కని బ్లాగు మొదలు పెట్టి, నడుపుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది.
    నీకు నా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యో మళ్లీ ఇప్పుడే చూసేను. ఏడు కాదు రెండవతరగతి అని. ఇంకా అద్భుతం. నీకు నా ఆశీస్సులు.

    రిప్లయితొలగించండి
  4. dear vaishu talli,
    your comments are always situtaion related keep it and it shows your intelligence and dedication towards your work nice keep it bye
    with love
    ramu

    రిప్లయితొలగించండి
  5. great song, vaishnavi ! nice to know you can sing this song !

    this tune is not as good as ms subbulaxmi's version !

    listen here for subbulaxmi's version :

    http://cid-272cd1502e1bbc2c.skydrive.live.com/self.aspx/Annamacharya/04%20-Ksheerabdhikanyakaku.mp3

    ( click on download and listen ).

    you can listen here too :http://www.youtube.com/watch?v=q-faNEW_EF0

    రిప్లయితొలగించండి
  6. very nice.inta kante emi cheppalo teliya dam ledu.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)