నాలగవరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.
'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.
భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాండ మాతగా కూడా కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు.
బుధవారం, సెప్టెంబర్ 23, 2009
సోమవారం, సెప్టెంబర్ 21, 2009
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.
- తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి
- డామిట్! కథ అడ్డంగా తిరిగింది
- పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
- పాడి పంటలు పొంగిపొరలే
- దారిలో నువు పాటు పడవోయ్
- తిండి కలిగితే కండ కలదోయ్
- కండ కలవాడేను మనిషోయ్
- పాడి పంటలు పొంగిపొరలే
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
- దేశాభిమానం నాకు కద్దని
- వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
- పూని ఏదైనాను ఒక మేల్
- కూర్చి జనులకు చూపవోయ్
- దేశాభిమానం నాకు కద్దని
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
- సొంత లాభం కొంత మానుకు
- పొరుగు వానికి తోడుపడవోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
- సొంత లాభం కొంత మానుకు
అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.
ఈ రోజు అయన గురించి తెలుసుకున్నాను. మా అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఆ వురిలోనే పెరిగారుట నాకు ఇవి అన్నీ అమ్మా, తాత నాకు చెప్పారు. నా బ్లాగుద్వారా నేను తెలుసుకున్నది మీరూ తెలుసుకున్నారు కదూ..........
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి (అన్నపూర్ణాష్టకము)
ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణేశ్వరి అవతారములో దర్శనము ఇచ్చును.ఆమెను నిత్యం కొలిచిన వారికి అన్నానికి లోటు ఉండదని ప్రతీతి. మానవులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు ఆహారం అనేది ఆమె కృపవల్లనే... లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. పార్వతీ దేవీ అవతారమైన దుర్గాదేవీ సాక్షాత్తు భర్త అయిన పరమేశ్వరునికి ఓ సమయంలో భిక్షాటనకు వస్తే పాయసాన్నాన్ని వడ్డిస్తుంది. అంటే ఆకలిగొని ఎవరైనా తన ఇంటికి వస్తే... కలిగిన దాంట్లో సగమైనా పెట్టాలనే విధానాన్ని లోకానికి బోధించడమే దీని అర్థమని పండితులు చెబుతున్నారు.