Blogger Widgets

గురువారం, సెప్టెంబర్ 24, 2009

HAPPY BIRTHDAY TO MY............

గురువారం, సెప్టెంబర్ 24, 2009



మా తాత చింతా. రామకృష్ణారావు(ఆంద్రామృతము బ్లాగ్) గారికి ఈరోజు జన్మదినము . మా తాత పుట్టినరోజు మాకు పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతగారికి నా తరుపున నా బ్లాగ్ మిత్రులద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తాతా ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.అమ్మమ్మ, అమ్మ, మామయ్య, కాబోయె అత్తయ్య,నా చెల్లెల్లు తరుపున కూడా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

శ్రీమహాలక్ష్మి LAXMI DARSHAN ॐ


ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన
(ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.


కాత్యాయినీ మాత


నవదుర్గలలో ఈ రోజు కాత్యాయిని మాత.

"కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.


ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.


బుధవారం, సెప్టెంబర్ 23, 2009

సరస్వతి మాత

బుధవారం, సెప్టెంబర్ 23, 2009


అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు.
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)