Blogger Widgets

శనివారం, డిసెంబర్ 26, 2009

తిరుప్పావై పన్నెండవ పాశురం

శనివారం, డిసెంబర్ 26, 2009


ఆండాళ్ తిరువడిగళేశరణం :
వెనుకటి పాశురము స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామె మేల్కొలుపబడినది.
శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది. ఒక్క క్షణము మైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు. అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును.
అందుకుగాను "
యజ్ఞము ,దానము, తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు . ఆచరిచితీరాలి. యజ్ఞము,దానము,తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి ఙానము, తద్వారా భక్తి కలుగుటకు సాయపడును.
కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు. కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును, ఫలమునందాశను ,సంగమును విడచుటయే కర్మ సన్యాసము. కాని నియతమగు కర్మను విడచుట సన్యాసమను మొహముతో విడచుట తామస త్యాగము. శరీర క్లేశము కల్గునను భయముచే కర్మలను మానుట రాజసత్యాగము. భగవద్గీతలొ కర్మన్యాసము అని చెప్పబడి ఉన్నది.
వెనుకటి పాశురములో గోపాలుర స్వధర్మమును ఫల సంగ కర్తృత్వాభిమానములను వదలి యాచరించెడి స్వభావము కలవారని వర్ణించబడింధి.
ఈ పాశురములో అట్టి స్వధర్మము ను కూడా ఆచరించని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నధి.
గోపాలురందరును పరమాత్మయే ఉపాయము -ఉపేయము అని నమ్మినవారు. వారి యెమి చేసినా పరమాత్ముని ప్రీతి కొరకే చేస్తున్నామన్న కోరిక లక్ష్యము కలవారు.
ఇంద్రియ ప్రవ్రుత్తి నిరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుచున్నారు.

పాశురము :
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్



తాత్పర్యము :

లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.

శుక్రవారం, డిసెంబర్ 25, 2009

చార్లెస్ చాప్లెన్

శుక్రవారం, డిసెంబర్ 25, 2009



ఈరోజు చార్లీ చాప్లెన్ వర్ధంతి. December 25th,

చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దాషు , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.

చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు.

ఆయను ను ఈరోజు ఈరకంగా తలచుకుంటున్నందుకు నేను చాలా happy గా వున్నాను.

గురువారం, డిసెంబర్ 24, 2009

తిరుప్పావై పదకొండవ పాశురం

గురువారం, డిసెంబర్ 24, 2009

ఆండాళ్ తిరువడిగలే శరణం :
ఈశ్వరుడే ఉపాయము -ఉపేయము లని నమ్మినవారు గోపికలు. తనను పొందించు సాధనము తానె అని భగవానుని ఉపాయత్వమునమ్దు గలవారే ఈ లేపబడుచున్న గోపికలా.
ఈ పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడైయున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలె పృశంచించుట విశేషము .
గోపికలందరు కౄష్ణపరతంత్రులే.
పాశురము :




కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
లేగ దూడలు గలవియు, దూడల వలె నున్నవియు నగు ఆవులు మందల నెన్నింటినో పాలు పితుక కలవారును,
శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును , ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ! పుట్టలోని పాము పడగవలె నున్న నితంబ ప్రదేశము గలదానా! అడవిలోని నెమలివలె అందమైన కేసపాసముతో ఒప్పుచున్నదానా! రమ్ము. చుట్టములును, చెలికత్త్లును మొదలుగా అందరును వచ్చిరి. నీ ముంగిట చేరిరి , నీలమేఘవర్ణుడగు శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కీర్తిమ్చుచున్నా ఉలకవేమి. ఓ సంపన్నురాలా లే మేలుకో అని గోపికలు మేలుకోల్పుతున్నారు .

బుధవారం, డిసెంబర్ 23, 2009

తిరుప్పావై పదవ పాశురం

బుధవారం, డిసెంబర్ 23, 2009

శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను .
నమ్మాళ్వారులు వంటి మహాపురుషులు వారే విధమైన సాధనా లేకుండానే పుట్టినది మొదలు యోగాసాదనలో ఉండి భగవదనుభావమును అనుభవించువారివలె పరిపుర్ణానుభావమును అనుభవించిరి. ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.
ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది.
ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.

పాశురము :


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫముగా సుఖనుభావమును పోందినతల్లి ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలమ్కరిచుకోనిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుశార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాదా నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషనమైనదానా! నిద్రనుండి లేచి, మైకము వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు ఆవరనములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు.

భగవదనుభావము గలవారు లోకులు నిమ్దిచని తీరున లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్దరింతురు.
వారి వాక్కు,వారి రూప దర్శనము కూడా భాగాత్ర్పాప్తికి సాధనములే!
ఈ పాశురములో ఏకేంద్రియావస్తలో నుండి ఇంద్రియము లేవియు పనిచేయక మససు భగవదదీనమై సిద్దోపాయనిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడినది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)