Blogger Widgets

ఆదివారం, జనవరి 10, 2010

తిరుప్పావై ఇరవై ఏడవ పాశురం

ఆదివారం, జనవరి 10, 2010

గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా ........... గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరనముచే తామూ పోంద కోరిన ఫలమును వివరించుచున్నారు.
పాశురము

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 



Pasuram27-HH.mp3

తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు. 

శనివారం, జనవరి 09, 2010

తిరుప్పావై ఇరవై ఆరవ పాశురం

శనివారం, జనవరి 09, 2010

:ఆండాళ్ తిరువడి గలే శరణం :


శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు .
వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోకదానిని కాంక్షించారు కదా?
మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.
వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసినపరికరములు అర్ధించుచున్నారు. ఈ పాశురములో


Pasuram26-HH.mp3

మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.

ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.

సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

శుక్రవారం, జనవరి 08, 2010

తిరుప్పావై ఇరవై ఐదవ పాశురం

శుక్రవారం, జనవరి 08, 2010

ఆండాళ్ తిరువడి గలే శరణం:
ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమదసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళ ములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.
ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధ పడి మంగళము పాడిరి. 

పాశురము

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి

కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి

ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్



Pasuram24-HH.mp3

తాత్పర్యము :
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .

రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము .

శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .

వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.

ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.

శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.

ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

గురువారం, జనవరి 07, 2010

తిరుప్పావై ఇరవై నాల్గవ పాశురం

గురువారం, జనవరి 07, 2010

ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకు పర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునా మంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.


పాశురం:


ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి
 మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద

కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి

వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 











Pasuram25-HH.mp3


తాత్పర్యము:
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.

భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)