ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం
కొత్త బట్టలు మాకిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం
బట్టల కన్నా పౌడరు కన్నా - మట్టిలో ఆటలు మాకిష్టం
టీచర్లంటే మాకిష్టం - పాఠాలంటే మాకిష్టం
టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం
వెన్నెలంటే మాకిష్టం - వానలంటే మాకిష్టం
వెన్నెల కన్నా వానల కన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం