Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం వస్తోంది

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాశమ్ వచ్చింది దనుర్మాశమ్ కూడా మొదలు కాబోతుంది. అది ఎంతో విశేషమైన వైకుమ్ఠఏకాదశి రోజు ప్రారంభమవుతోంది.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల.

అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజు లు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.

సోమవారం, డిసెంబర్ 13, 2010

చల్లని చూపులవాని

సోమవారం, డిసెంబర్ 13, 2010



పల్లవి:
చల్లని చూపులవాని చక్కనివాని పీలి
చొల్లెపుం జుట్లవానిఁ జూపరమ్మ చెలులు


చరణం:
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయును దానై యెలయించె నన్నును |వాని
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు


చరణం: 

మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలులు


చరణం:
ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే  వాడు
దంటవాడు కలికి చేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుండై నన్ను గూడెనే | వాని |
వొంటి బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.

శనివారం, డిసెంబర్ 04, 2010

పరశురామ జయంతి

శనివారం, డిసెంబర్ 04, 2010

ఈరోజు పరశురాముడు జయంతి. 
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు.  తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి  రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం.

గురువారం, నవంబర్ 18, 2010

ఝాన్సీ లక్ష్మీబాయి

గురువారం, నవంబర్ 18, 2010


ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి.1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.
నేడు ఝాన్సీ రాణి పుట్టినదినము.  ఝాన్సీ లక్ష్మి అసలు పేరు మనికర్ణిక. కాశిలో జన్మించింది.  మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబా లకు జన్మించింది ఝాన్సి.  ఝాన్సి లక్ష్మి  స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నవీరనారి.  రాణి 1858జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది.  ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
అలాంటి ఝాన్సి లక్ష్మీబాయిని గుర్తుచేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా వున్నది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)