గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి! మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.
ఒక సంవత్సరములో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేది పుష్య శుద్ధ ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠములోని తలుపులు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం దర్శనమునకు భగవద్ భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది.
దేవతలు రాక్షస కృత్యాలకు భరించలేక బ్రహ్మ తో కూడి
వైకుంఠము చేరి ఉత్తరద్వారములోనుండి లోపలి ప్రవేసించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని వారి బాధలు వివరించి స్వామివారి అనుగ్రహము పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. నాటి నుండి
వైకుంఠ ఏకాదశి విశేషము కలిగివుంది. ఆరోజు ఉపవాసము వుంటే మంచిది. రాక్షస పీడ మనకు చేరదు అంటారు.
మనము కూడా ఉత్తర ద్వారా దర్శనము చేసుకుందాం. స్వామివారిని దర్శించుకుందాం. కనులార్పకుండా దర్సిమ్చుకోవాలి. స్వామివారి అందము చెప్పలేము మన దిష్టి తగులుతుందేమో. ఆ దిష్టిని హారతి ఇచ్చి తీస్తారు. మనము ఆ హారతిని మళ్ళీ కళ్ళకు అద్దుకొని మళ్ళీ దిష్టి పెట్టేస్తాం. అందుకే స్వామివారి హారితికి నమస్తే చేయాలి కాని కళ్ళకు అద్దుకోవద్దు అని మనవి.
మరి ఉత్తర ద్వార దర్శనము చేసుకోలేనివారు ఏమిచెయ్యాలి అంటే! మనదేహమే దేవాలయము అని మన పెద్దలు చెప్పారు కదా. మన తలపైన ఉత్తరము కదా. so కళ్ళు మూసుకొని మనము
ఙ్ఞానదృష్టి తో స్వామీ దర్శనము చేసుకోవాలి అని అంటారు. మానసికంగా భగవంతుని దర్శనము చేసుకోవచ్చు. తప్పకుండా ఉత్తర ద్వారదర్శనము చేసుకోండి మరి.
ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా ఎదిగాడు బ్రెయిలీ. పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై చాలా చాలా కృషిచేసాడు.
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది. అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు. బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా. మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది. వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు. దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి.
ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి, శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు. మరి ఎలా వర్ణిస్తున్నారంటే... పాశురము: ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
తాత్పర్యము: ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.