బుధవారం, జనవరి 04, 2012
|
లూయి బ్రెయిలీ |
|
Breyili keybord |
|
Alphabet bord
|
ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు.
లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా ఎదిగాడు బ్రెయిలీ. పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై చాలా చాలా కృషిచేసాడు.
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది. అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు. బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు.
బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా.
మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది. వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు. దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.