ఉత్తరద్వార దర్శనము |
ఒక సంవత్సరములో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేది పుష్య శుద్ధ ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠములోని తలుపులు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం దర్శనమునకు భగవద్ భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది.
దేవతలు రాక్షస కృత్యాలకు భరించలేక బ్రహ్మ తో కూడి
వైకుంఠము చేరి ఉత్తరద్వారములోనుండి లోపలి ప్రవేసించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని వారి బాధలు వివరించి స్వామివారి అనుగ్రహము పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. నాటి నుండి
వైకుంఠ ఏకాదశి విశేషము కలిగివుంది. ఆరోజు ఉపవాసము వుంటే మంచిది. రాక్షస పీడ మనకు చేరదు అంటారు.
మనము కూడా ఉత్తర ద్వారా దర్శనము చేసుకుందాం. స్వామివారిని దర్శించుకుందాం. కనులార్పకుండా దర్సిమ్చుకోవాలి. స్వామివారి అందము చెప్పలేము మన దిష్టి తగులుతుందేమో. ఆ దిష్టిని హారతి ఇచ్చి తీస్తారు. మనము ఆ హారతిని మళ్ళీ కళ్ళకు అద్దుకొని మళ్ళీ దిష్టి పెట్టేస్తాం. అందుకే స్వామివారి హారితికి నమస్తే చేయాలి కాని కళ్ళకు అద్దుకోవద్దు అని మనవి.
మరి ఉత్తర ద్వార దర్శనము చేసుకోలేనివారు ఏమిచెయ్యాలి అంటే! మనదేహమే దేవాలయము అని మన పెద్దలు చెప్పారు కదా. మన తలపైన ఉత్తరము కదా. so కళ్ళు మూసుకొని మనము
ఙ్ఞానదృష్టి తో స్వామీ దర్శనము చేసుకోవాలి అని అంటారు. మానసికంగా భగవంతుని దర్శనము చేసుకోవచ్చు. తప్పకుండా ఉత్తర ద్వారదర్శనము చేసుకోండి మరి.
జై శ్రీమన్నారాయణ్
|
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.