శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012
అమ్మమ్మలు, నాయనమ్మలు చిన్నపిల్లలకు బోజనము పెట్టి వారి పొట్టను మెల్లిగా రాస్తూ
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ వుంటారు. అలా అనేదాని వెనకాల ఒక కదా వుంది. ఆ కధే
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.
|
దక్షిణహిందూ
దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన
రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ
చంపి తినే పద్ధతి కూడా
చాలా విచిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ
అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి
ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి
మాటలు నమ్మి అతని ఇంటికి
వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని
చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు
వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి
ముక్కలు చేసి ఆ మాంసంతో
వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని
పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి
వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి
ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా!
త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల
కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ
పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని
వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం!
ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు.
అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు. |
చాలాకాలం
వరకు ఈ మోసాన్ని ఎవరూ
కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు
పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే
మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు.
అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని.
చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు
వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.
మహర్షిని
చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా
చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి
జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట
చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో
వంటకాలు చేశాడు.
తర్వాత
ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను
వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ
మహర్షికి తెలియకపోతే కదా!
ఆనందంగా
భోజనం చేసి ఎడం చేత్తో
పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం "అనుకున్నాడు.
అది ఇల్వలుడికి వినపడలేదు. ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు
"వాతాపీ! ఓ వాతాపీ! బయటకు
రా! " అని గట్టిగా పిలిచాడు.
కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి
భయం వేసింది. అగస్త్యుడు
చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా
నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే
అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు"
అన్నాడు. తన ఎదుట ఉన్నది
అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ
అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి.
మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.
తాపసి
దయతలచి సరే అన్నాడు. ఇల్వలుడు
మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి
వదలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్వలుడనే
చెడు మనసుగల వాని జిత్తులు జ్ఞాని
అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి.
జాన్
ఫ్రాన్క్లిన్ ఎండర్స్ ప్రసిద్ధ అమెరికన్ శాస్త్రవేత్త ఫిబ్రవరి 10th, 1897, న జన్మించాడు.
ఈయన అమెరికా సంయుక్త వైమానిక దళం లో పైలట్‌గా
పనిచేసారు . మొదటి ప్రపంచ యుద్ధం
తరువాత అతను BA యొక్క
డిగ్రీ పూర్తి చేసారు, ఆ డిగ్రీ ని
1919 లో ఇవ్వబడింది 1920 లో అది సాధారణ
డిగ్రీ. అప్పుడు అతను అసంతృప్తి
చెందారు. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో
ప్రవేశించాడు, హార్ట్ఫోర్డ్ లో రియల్ ఎస్టేట్
వ్యాపారము లోకి వచ్చారు. నాలుగు
సంవత్సరాలు అతను ఆంగ్ల గురువుగా
పనిచేసారు కానీ అతని ఆలోచనలు
ఆంగ్ల సాహిత్యం మరియు జర్మనిక్ మరియు
సెల్టిక్ భాషలు మీద అధ్యయనం
చేసారు, కానీ అతను ఈ
జీవితం తో సంతృప్తి చెందలేదు.
అతను జీవశాస్త్రం మీద కూడా చాలా
ఆసక్తి ఉండేది. ఈ
ఆసక్తి అతన్ని Ph.D. కోసం ఒక అభ్యర్థి
గా చేసింది. ఇతను
హార్వర్డ్ వద్ద వైద్య విద్యార్ధులు
స్నేహాము ద్వారా
సూక్ష్మక్రిముల ఇమ్యునాలజీ లో డిగ్రీ అందుకున్నారు
.అతను అప్పుడు హార్వర్డ్ తో సిడ్నీ విశ్వవిద్యాలయం
లోను, ఆస్ట్రేలియా వద్ద బాక్టీరియాలజీలో ప్రొఫెసర్
అయిన డాక్టర్ HK వార్డ్,ద్వారా బాక్టీరియా మరియు ఇమ్యునాలజీ విభాగం
యొక్క హెడ్ ప్రొఫెసర్
హన్స్ Zinsser, ను కలసి చాలా
జీవ శాస్త్రము పై ప్రభావితమైనారు.
1930 లో,
ఎండర్స్ Ph.D. యొక్క పట్టా పుచ్చుకున్నాడు
హార్వర్డ్ వద్ద క్షయ బాసిల్లే
క్రిముల నుండి విడివడిన రసిక
రకం బాక్టీరియా అనాఫిలాక్సిస్ ను మరియు
తీవ్రసున్నితత్వంగా ప్రత్యేకమైన విషయాలు తెలుసుకొని వాటిని ఆధారంలతో
ఒక థీసిస్ కోసం సమర్పించారు .
1930 నుండి
1946 వరకు, ఎండర్స్ బోధనా సిబ్బంది సభ్యుడిగా
హార్వర్డ్ వద్ద ఉండిపోయినారు. ఈ
కాలంలో అతను, మొదటి, బాక్టీరియా,
వైరస్ వల్ల కలిగిన వ్యాధి
యొక్క తీవ్రత మరియు హోస్ట్ జీవి
యొక్క ప్రతిఘటన సంబంధించిన కొన్ని కారకాలు వివరాల పై అధ్యయనం
చేసారు. నిర్దిష్ట ప్రతిరక్షకం ద్వారా బ్యాక్టీరియా opsonization ఒక ఉత్ప్రేరక-వంటివి
పెంచి వాటి ఆధారం తో
పోలిసాకరైడ్ మరియు ఉత్పత్తి పద్ధతి
యొక్క ఒక కొత్త రూపం
కనుగొన్నారు.
1946 లో,
ఎండర్స్ బోస్టన్ వద్ద పిల్లల మెడికల్
సెంటర్ వద్ద అంటు వ్యాధులు
లో పరిశోధన కోసం ఒకప్రయోగశాల ఏర్పాటు
కోరారు. మనిషి యొక్క వైరల్
వ్యాధులు ఈ ప్రయోగశాల చాలా
ఉద్భవించిన మిగిలిఉన్న పని తన ఆధ్వర్యములో
జరిగింది మరియు అది Th వెల్లెర్
మరియు FC రాబిన్స్, నోబెల్కలిసి, పని ఎండర్స్ లభించింది
ఇది కోసం పోలియో వ్యాధి
వైరస్ యొక్క సాగు చేయబడుతుంది
అనిఇక్కడ ఉంది 1954 లో జీవశాస్త్రం లేదా
మెడిసిన్ కోసం బహుమతి.
1949లో జాన్ ఫ్రాన్క్లిన్
ఎండర్స్, థామస్ హెచ్.వెల్లర్
మరియు ఫ్రెడరిక్ చాప్మన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్‌ను సజీవమయిన జంతు
కణాల కల్చర్‌లో పెంచారు. అప్పటి
నుంచి వారి పద్దతిలో చిన్నాచితకా
మార్పులు చేస్తూ మిగతా వైరస్‌లను
కూడా సెల్ కల్చర్లలో
పెంచడం మొదలయింది. ఇదే
పోలియో వాక్సిన్ కనుక్కొటానికి నాంది అయ్యింది. ఈయన నిరంతరము ఏదో సాధించాలి అన్నట్టు జీవితాన్ని సాగించారు.
1931 వ సంవత్సరము ఫిబ్రవరి 10 న కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
బ్రిటిష్ రాజ్య పరిపాలన కాలంలో డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది. కొన్నాళ్ళు తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చబడినది. ప్రాచీనకాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రముగా వుంటూ వస్తున్నది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి మరీ ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్‌కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. అప్పటి భారత చక్రవర్తి 5వ జార్జి, యునైటెడ్ కింగ్డం, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలని ప్రకటించాడు.
గురువారం, ఫిబ్రవరి 09, 2012
అష్టావదానము అన్నపదము వినేవుంటారు కదా. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలగిన ప్రక్రియ, ఈ ప్రక్రియ సంస్కృతంలో ను తెలుగులోనూ బాగా పరిచయము వున్నది. మా తాతగారు చింతా. రామకృష్ణా రావు గారు చాలా వివరముగా వివరించారు. మీరు కూడా తెలుసుకోవాలని కుతూహలముగా వుందా. అయితే సింపుల్ గా చెప్పెయలంటే.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అష్టావధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు భాష సొత్తా అన్నట్టు వుంటుంది. ప్రప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలొ ముఖ్యమైన వ్యక్తి అవధాని. అతను అపారమైన ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం వంటివి వారిలో వుంటుంది. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. మద్యలో మద్యలో గంట కొడతారు అవి లెక్కపెట్టి ఎన్ని గంటలు కోటారో చెప్పాలి. చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను. ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.
ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి. మీకు పూర్తి సవివరంగా తెలుస్తుంది.
ఇలాంటి అవదానాన్ని ప్రత్యక్షముగా చూస్తే చాలా తమాషాగా వుంటుంది. టీవీ లో చూసే వుంటారు ఈ అష్టావదానము. టీవీ లో కంటే ప్రత్యక్షముగా చూడటం చాలా బాగుంటుంది. మీకు వీలయితే మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. దీని మీరు చూసారంటే మన తెలుగు భాషకు వున్నా ప్రత్యేకత మీకు తెలుస్తుంది.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ