1931 వ సంవత్సరము ఫిబ్రవరి 10 న కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
బ్రిటిష్ రాజ్య పరిపాలన కాలంలో డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది. కొన్నాళ్ళు తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చబడినది. ప్రాచీనకాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రముగా వుంటూ వస్తున్నది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి మరీ ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్‌కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. అప్పటి భారత చక్రవర్తి 5వ జార్జి, యునైటెడ్ కింగ్డం, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలని ప్రకటించాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.