Blogger Widgets

మంగళవారం, మే 15, 2012

హనుమంతుడు

మంగళవారం, మే 15, 2012

హనుమాన్  జయంతి శుభాకాంక్షలు.
  
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

కాటన్ దొరగారి పుట్టినరోజండి

ఈరోజు గోదావరి ప్రజలు ఎంతో అబిమానించే కాటన్  దొరగారి  పుట్టినరోజు.  ఈ దొరగారి అసలు పేరేమో జనరల్  సర్ ఆర్ధర్ కాటన్ .  ఈయన  బ్రిటిష్  సైనిక అధికారి మరియు నీటి పారుదల  ఇంజీనీయర్.  ఈయన తన జీవితం అంతా నీటి పారుదల  గురించే ఎక్కువ  కృషి చేసారండి.  ఈయన  May 15 న 1803 వ సంవత్సరం లో ఆక్సఫోర్డ్ లో  హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు.   దొరగారు  తన   15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.    దొరగారు తెలుగు భాషమీద  కూడా ఎక్కువ  అభిమానం కలవారు.  గోదావరి ప్రజలు మీద ఈయన  అభిమానం ఎక్కువ  చూపేవారు.  ఈయన  ఎక్కువగా  కృషి చేసి విజయం సాధించిన   ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన  కాలువల నిర్మాణంగా చెప్పుకోవచ్చు . ఈ కాలువల విభజన వల్ల  మరియు అన్ని ప్రదేశాలను  కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. 
దొరగారు ఈ  ఆనకట్ట  లే కాకుండా 1836 - 38 సంవత్సరాలలో  కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం నాకు వచ్చింది .  అన్నిటికంటే ముఖ్యంగా 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు.  గోదావరి డెల్టా ప్రదేశాలు సస్యశ్యామలమై కలకలలాడింది. ఈ  ఆనకట్టల వల్ల  ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది.  ఇంత  గొప్పకార్యానికి  ఆయన కేవలం అయిదేళ్ళలో కాలంలోనే పూర్తి చేశాడు. ఇది చాలా గోప్పవిషయంగా తోచుతోంది  కదండి.  దొరగారు అంతటితో తృప్తి చెందక  కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కృషి చేసారు . మొత్తం భారత  భూమిని  సస్యశ్యామలం చేయటానికి నదులను మనం ఎలావుపయోగించాలా అన్న  ఆలోచనలు చేసారు .  దానికోసం ఎన్నో పరిసోదనలు చేసారు.   భారతీయులు అందరు దొరగారికి శాశ్వత రుణగ్రస్తులు అయిపోయారు.  దొరగారికి 1861లో సర్‌ బిరుదును పొందాడు .  ఈయన  బ్రిటిష్ వాడు అయినాసరే మనదేశబౌగోళిక  పరిస్తితులు తెలుసుకొని  మనదేశాభివ్రుద్దికి కృషిచేసారు.  కాటన్ దొరగారు భారత  జల సంపద  అనే పుస్తకంలో  “భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.” కాదు అని రాసారుట. మన  దేశం గురించి ఆయన బాగా అర్ధం చేసుకున్నాడు కదండి.  నిజంగా కాటన్  దొరగారు గ్రేటండి  బాబు.  సారూ గారిని ఈరోజు ఇలా అయినా గుర్తుతెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుండండి .  మరి మీకో.

సోమవారం, మే 14, 2012

వలస పక్షులు వాటి యాతన.

సోమవారం, మే 14, 2012

ఇక్కడ పక్షులను చూస్తూవుంటే ఇవి వలస పక్షులు అని తెలిసి పోతోంది కదండి.  నిజంగా ఇవి వల స పక్షులే ప్రపంచం నేడు వల స పక్షుల  రోజుగా  జరుపుకుంటోంది.  వలస పక్షులు అనగానే మనకు కొల్లేరు సరస్సు దగ్గర కు వచ్చే పక్షులు  గుర్తుకు వస్తాయి .    ఈ పక్షులన్నీ ఎక్కడో పుట్టి వున్న ప్రదేశాన్ని విడిచి  కొన్ని వేల  మైళ్ళు  ఎగురుకొని  కొండలూ కోనలు  సముద్రాలు , నదులు , చెరువులు , అడవులు , వూర్లు, ఎడారులు దాటుకొని కొత్త ప్రదేశానికి చేరుకుంటాయి.  అక్కడ  కొన్ని రోజులు వుండి తరువాత  వాటికి అనుకూలమైన  వాతావరణం  ఏర్పడినప్పుడు మరలా తిరిగి వాటి ప్రదేశానికి వెళ్లి పోతాయి కావున  వాటిని వలస  పక్షులు అంటారు.  ఇవి గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాన్ని చేస్తాయి.  ఇవి మామూలుగా పగటి జీవులే అయినప్పటికీ ఇవి ఈ వలస  ప్రయాణము  మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణం చేస్తాయి.  ఈ ప్రయాణం చీకటి పడ్డాక  మొదలు పెట్టి తెల్లారేలోపు వరకు ప్రయాణం సాగిస్తాయి.  ఇలా రాత్రులే ఎందుకు ప్రయాణిస్తున్నాయో ఉహించగలరా.  రాత్రులు అయితే  వాటికి శతృభయము వుండదు అందుకే అలా ప్రయాణిస్తాయి.  రాత్రులు గంటకి తొమ్మిదివేల  పక్షులు ప్రయాణిస్తాయి.   కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? చాలా  కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి.  ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణము చెయ్యాలి వాటికి తెలుస్తుంది అంటారు . అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి.  సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు.  పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియ ఇది సృష్టిలో మహాద్భుతం గా చెప్పుకోవచ్చు .  
పక్షులును చూసి మనలాంటి వారు కష్ట కాలంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఎలాగైనా గమ్యాన్ని తిరిగి చేరుతాయి.  ఇదే వలసపక్షులు వాటి యాతన .  

ఆటలమ్మ

Chicken pox vaccine
ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.  ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.  అలాంటప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్  అను శాస్త్రవేత్త.    18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్ 1879 లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు.  మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.  చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster) అని తెలుసుకొని దానికి టీకా కనిపెట్టి మొట్టమొదట  ఇద్దరు పిల్లలు మీదప్రయోగిమ్చారు వారు ఇద్దరు పిల్లలు మీద  ఆ మందు బాగా పనిచేసింది.  చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయిచుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.  సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి. అని నిర్ణయించుకున్నారు. 1796 May 14 న  ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)