ప్రకృతిలో జరిగే అద్బుతము ఈ శుక్రగ్రహం |
మంగళవారం, జూన్ 05, 2012
భగవంతుని చిరునామ
పంచపాండవులుకు మరి వారి బార్య అయిన ద్రౌపది కి అండగా వుండి శ్రీ కృష్ణుడు వారిని కాపాడేవాడు. ద్రౌపదికి శ్రీ కృష్ణునిపై చాలా భక్తివిశ్వాసాలు కలికి వుంది. నిండు సభలో దుర్యోధన, దుశ్శాసనులు ఆమెను వివస్త్రను చేసి అవమానించే సమయములో కాపాడినవాడు శ్రీ కృష్ణుడు అని అందరికీ తెలుసు. అలాంటి సమయములో మహాబలశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జునుని కానీ, ధర్మనిరతుడైన ధర్మరాజు ను కానీ, భావిష్యదర్సాకుడు అయిన సహదేవుని కానీ, సహాయము అడగలేదు. " హే కృష్ణా! హే మాధవా! ద్వారకావాసా! పాహిమాం పాహిమాం!" అని ఆర్తితో గడ్డిగా పిలిచింది. శ్రీ కృష్ణుడు ఒక పిలుపుతో పలికేవాడు కదా! అక్షయ వలువలను ప్రసాదించి ఆమెను కాపాడాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత ఒక రోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయములో ద్రౌపది "కృష్ణా! నాకు ఒక చిన్న సందేహం వుంది. అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్ధించాను కానీ నువ్వు వెంటనే రాలేదేమి? కొంత ఆలస్యము చేసావు కదా!" అన్నది. కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి అమాయకంగా "అమ్మా! నేనేమిచేసేది? నీవు హృదయవాసా అని పిలవక ద్వారకావాసా! అని పిలిచితివి కదా, మరి నేను ద్వారకకు
వెళ్లి రావలసి వచ్చింది. నీవు ఇంకా నా శాశ్వత చిరునామాను గుర్తించలేదు" అన్నాడు. అదేమిటి? " ఈశ్వర స్సర్వాభూతానాం హృద్దేశేర్జునతిష్టతి" ఈశ్వరుడు సర్వ భూతాముల హృదయాలను అదిష్టింఛివుంటాడు. అని చెప్పాడు శ్రీ కృష్ణుడు. సోమవారం, జూన్ 04, 2012
ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ గ్రీన్ ఎకానమి
సోమవారం, జూన్ 04, 2012
ప్రపంచ పర్యావరణ దినోత్సవం : మనజీవన వైవిధ్యం ను పరిరక్షించే ప్రాముఖ్యతను అవగాహన ప్రోత్సహించడానికి జూన్ 5 న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇది మానవ పర్యావరణం పై యునైటెడ్ నేషన్స్ సమావేశం ప్రారంభమైంది ఆ రోజు జరిగింది. మానవ పర్యావరణం పై యునైటెడ్ నేషన్స్ సమావేశం జూన్ 1972 వ సంవత్సరం నుండి 5-16 వ తేదీలు లో జరిగింది . ఇది 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ పర్యావరణ దినం 1973 న జరిగింది.
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కోసం 2012వ సంవత్సర థీమ్ ఏమిటో తెలుసా అదే గ్రీన్ ఎకానమీ:
గ్రీన్ ఎకానమి
ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఒక థీం పేరు పెట్టడానికి చాలా కష్టపడ్డారు. దీనికి స్పష్టముగా చెప్పాలి ఈ థీమ్ కు మొదటి గ్రీన్ ఎకానమీ అన్నదానిమీద ఆధారపడింది . UN పర్యావరణ కార్యక్రమములో ఒకటిగా గ్రీన్ ఎకానమీ నిర్వచిస్తుంది మెరుగైన మానవ జీవితం అనుభవించటానికి బాగా ఉండటం మరియు సామాజిక ఈక్విటీ ఫలితాలు, గణనీయంగా పర్యావరణ సమస్యలు మరియు పర్యావరణ కొరతల తగ్గిస్తూ,. తన సరళమైన వ్యక్తీకరణ, ఒక ఆకుపచ్చ ఆర్థిక వ్యవస్థ తక్కువ కార్బన్, వనరు సమర్థవంతంగా, సామాజికంగా కలుపుకొని, ఇది ఒకటిగా వుంటుంది అని భావించవచ్చు.
ఆచరణాత్మకంగా ఒక గ్రీన్ ఎకానమీ, దీని ఆదాయం మరియు ఉపాధి పెరుగుదల, కార్బన్ ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించేందుకు శక్తి మరియు వనరుల సామర్థ్యం విస్తరించేందుకు, మరియు జీవవైవిధ్యం మరియు పర్యావరణ విధానాల సేవలు కోల్పోవడం నిరోధించడానికి ఆ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఏర్పడతాయి. ఈ పెట్టుబడులను లక్షిత ప్రజా వ్యయం, విధానం సంస్కరణలు మరియు నియంత్రణ మార్పులు ద్వారా ఉత్ప్రేరక మరియు మద్దతు కూడా చాలా అవసరం. గ్రీన్ ఎకానమీ నిజంగా ముందుకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీం గా పెట్టడం మంచిదే. ఈ విధంగా మన చుట్టూ పచ్చదనం నిండి వుంటుంది. నేటి నుండి అయినా మన పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. లేదంటే మనముందు చాలా పెద్ద ప్రమాదాలు ఎదురుచూస్తున్నాయి . పర్యావరణం కలుషితముతో పూర్తిగా నిండితే ప్రమాదమే కదా. కాలుష్యము వల్ల మానవులు కాన్సెర్ వచ్చే వచ్చే అవకాశాలు వున్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అందరికీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
SP. బాలుగారికి పుట్టినరొజు శుభాకాంక్షలు
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 జన్మించాడు. తన గాన మాధుర్యంతో భారతీయ భాషలన్నిటిలోనూ శ్రోతలను అలరిస్తున్న గానగంధర్వుడు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం . ఘంటసాల లేని లోటు తెలుగువారికి తన అమృత గళమును అందించితీర్చారు. ఆ గళంలో పలకని రాగం, భావం లేవు అంటే అతిశయోక్తి కానే కాదు.గొంతులు మార్చి మార్చి పాడి అమృతములా సాగిపోయేపాటలతో సంగీత అభిమానులను సంతోషపెట్టారు బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు బాలుగారి పుట్టినరోజు సంధర్బముగా బాలుగారికి మా బ్లాగ్ తరుపున పుట్టినరొజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నోజరుపుకొవాలని కొరుకుంతున్నాం .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)