పంచపాండవులుకు మరి వారి బార్య అయిన ద్రౌపది కి అండగా వుండి శ్రీ కృష్ణుడు వారిని కాపాడేవాడు. ద్రౌపదికి శ్రీ కృష్ణునిపై చాలా భక్తివిశ్వాసాలు కలికి వుంది. నిండు సభలో దుర్యోధన, దుశ్శాసనులు ఆమెను వివస్త్రను చేసి అవమానించే సమయములో కాపాడినవాడు శ్రీ కృష్ణుడు అని అందరికీ తెలుసు. అలాంటి సమయములో మహాబలశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జునుని కానీ, ధర్మనిరతుడైన ధర్మరాజు ను కానీ, భావిష్యదర్సాకుడు అయిన సహదేవుని కానీ, సహాయము అడగలేదు. " హే కృష్ణా! హే మాధవా! ద్వారకావాసా! పాహిమాం పాహిమాం!" అని ఆర్తితో గడ్డిగా పిలిచింది. శ్రీ కృష్ణుడు ఒక పిలుపుతో పలికేవాడు కదా! అక్షయ వలువలను ప్రసాదించి ఆమెను కాపాడాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత ఒక రోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయములో ద్రౌపది "కృష్ణా! నాకు ఒక చిన్న సందేహం వుంది. అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్ధించాను కానీ నువ్వు వెంటనే రాలేదేమి? కొంత ఆలస్యము చేసావు కదా!" అన్నది. కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి అమాయకంగా "అమ్మా! నేనేమిచేసేది? నీవు హృదయవాసా అని పిలవక ద్వారకావాసా! అని పిలిచితివి కదా, మరి నేను ద్వారకకు
వెళ్లి రావలసి వచ్చింది. నీవు ఇంకా నా శాశ్వత చిరునామాను గుర్తించలేదు" అన్నాడు. అదేమిటి? " ఈశ్వర స్సర్వాభూతానాం హృద్దేశేర్జునతిష్టతి" ఈశ్వరుడు సర్వ భూతాముల హృదయాలను అదిష్టింఛివుంటాడు. అని చెప్పాడు శ్రీ కృష్ణుడు.
బాగుంది.
రిప్లయితొలగించండిఅద్బుతం
రిప్లయితొలగించండిబహు చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిthank you very much syaamaleeyam, Sai Ram, bhaarati gaariki.
రిప్లయితొలగించండి