శనివారం, జూన్ 16, 2012
శుక్రవారం, జూన్ 15, 2012
మెరుపులో నిజాలు.
శుక్రవారం, జూన్ 15, 2012
ఆకాశం వైపు చూస్తే మనకు నీలి మేఘాలు మెత్తటి దూదిపింజలుగా కనిపిస్తాయి. అవి అమాయకముగా ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి యాక్టివ్ గా వెల్తున్నాయి. నీరు, మంచు లోపల ఆకర్షణ శక్తి ద్వారా వెచ్చని గాలి ప్రవాహాల ద్వారా చుట్టూ కదిలే, మరియు గడ్డకట్టి, మేఘము లో నీరు evaporating చెందుతుంది . ఒక బెలూన్ rubbing వంటి స్టాటిక్ విద్యుత్ సృష్టించవచ్చు, అలాగే క్లౌడ్ లో రేణువులు ఆవేశం వల్ల విధ్యుత్ పుడుతుంది అని మొట్టమొదట బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను శాస్త్రవేత్త తన గాలిపటం ప్రయోగము ద్వారా నిరూపించారు. ఈరోజు బెంజమిన్ ఫ్రాంక్లిన్ జన్మదినము సందర్బముగా మనము ఆయన ప్రయోగము గురించి తెలుసుకుందాం.
ఒక ముఖ్యమైన విద్యుదావేశ వేర్పాటు వల్ల నిర్మించిన ఒకసారి, క్లౌడ్ గ్రౌండ్ లో సానుకూల ఛార్జ్ ప్రేరేపిస్తుంది. ఆ చార్గే చివరకు భూమికి చేరుతుంది . అది గాలి ionise గా వారు purplish మెరుపు ఏర్పడటానికి కారణమవుతుంది. వారు కేవలం ఒక సులభమయిన, దుమ్ము మరియు గాలి లో ప్రభావితం చేస్తుంది. అతి చిన్నదైన మార్గం ద్వారా బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుక్కునారు ఈ విషయాన్ని Streamers వాటిని తీర్చేందుకు భూమి నుండి పైకి రావచ్చు. ఒకసారి వచ్చిన స్పార్క్ ఛార్జ్ తటస్థంగా రూపొందిస్తుంది. గాలి రుణావేశం ద్వారా క్లౌడ్ గుడ్డుకోవటం వల్ల ఒక కాంతి ఏర్పడుతుంది అది సాధారణంగా వేడెక్కే కొద్ది. దాని స్పార్క్ వేడి లేదు, 20,000 డిగ్రీలగా ఎక్కువ వుంటుంది. అది త్వరగా షాక్ వేవ్ మరియు ఉరుము వల్ల గాలి వేడిచేస్తుంది. లైట్ ఒక సెకనుకు 186.000 మైళ్ళు దూరము ప్రయాణిస్తుంది . 4.5 సెకన్లు వచ్చిన మెరుపు 1 మైలు దూరము ప్రయాణం చేస్తుంది.
మెరుపులో నిజాలు:
• ప్రపంచవ్యాప్తంగా సంభవించే 2,000 తుఫాను పైగా ఉన్నాయి ఏ సమయంలో అయినా, ప్రతి 100 మెరుపు ఉత్పత్తి అవుతాయి అవి ప్రతి రోజు 8 మిలియన్ల మెరుపులు గా చెప్పచ్చు .
• ప్రతి మెరుపు ఫ్లాష్ 3 మైళ్ల పొడవైన కాని కేవలం ఒక సెంటీమీటర్ గా అనిపిస్తుంది.
• ఒక మెరుపు శక్తి యొక్క 1-10 బిలియన్ జౌలేస్ గురించి డిశ్చార్జెస్ మరియు కొన్ని 30,000 ప్రస్తుత ఉత్పత్తి - 50,000 ఆంప్స్, సెల్సియస్ 20,000 పైగా డిగ్రీల చుట్టూ ఉన్న గాలి వేడెక్కడంతో ఇది,
• ఒక మెరుపు తీగ TNT, ఒక టన్ను కాల్చుకొని గా చాలా శక్తి unleashes గా వుంటుంది.
ప్రతీ ఒక ఫ్లాష్ వల్ల చాలా విద్యుత్ ఏర్పడుతుంది అని మనకు చెప్పకనే అర్థం అవుతోంది.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క ప్రమాదకరమైన గాలిపటం ప్రయోగం వల్ల ఇది నిజమని నిరుపితము అయ్యింది. ఒక ఎగిరే గాలిపటం ద్వారా ఫ్రాంక్లిన్ చే మెరుపు ఒక విద్యుత్ దృగ్విషయం అని పరికల్పించబడినది. మరియు మెరుపు యొక్క విద్యుత్ ప్రభావం మరొక వస్తువు కు బదిలీ మరియు విద్యుత్ తన ప్రభావాన్ని చూపించింది . 1752 లో, ఫిలడెల్ఫియా లో ఒక చీకటి రోజు న జూన్ మధ్యాహ్నం న, 46 ఏళ్ల బెన్ ఫ్రాంక్లిన్ ఒక గాలిపటం ఎగురువేసి ప్రయోగం చేసారు . తన కుమారుడు, విలియం సహాయంతో, వారు ఇద్దరు ఒక చివర ఒక ఇనుప కీ వ్రేలాడ తీసారు , మరియు ఒక పట్టు స్ట్రింగ్ తన గాలిపటం కు పెట్టారు. తరువాత, వారు కీ నుండి ఒక సన్నని మెటల్ వైర్ టైడ్ మరియు ఒక లైడెన్ జార్, ఒక విద్యుత్ చార్జ్ నిల్వ చేయడానికి ఒక కంటైనర్ లోకి వైర్ చేర్చారు. ఆకాశంలో నల్లని మబ్బులు రావటం వల్ల ఉరుములతో కూడిన మెరుపు సమీపించినప్పుడు చివర వారు కీ ఒక పట్టు రిబ్బన్ వుంది . పట్టు రిబ్బన్ ద్వారా గాలిపటం లోకి హోల్డింగ్, బెన్ గాలిపటం ఎగిరింది మరియు ఒకసారి అది ఎత్తుగా ఎగిరింది , అతను పురిలోకి వెనుతిరిగింది. మేఘం లో ప్రతికూల ఆరోపణలు కీ, మరియు కూజా లోకి, తడి పట్టు స్ట్రింగ్ క్రిందికి తాకటం, తన గాలిపటం లోకి ప్రవేసించి ఉరుము తో కూడిన తుఫాను క్లౌడ్, ఫ్రాంక్లిన్ యొక్క గాలిపటం లోకి ప్రవేసించి. అతను కీ న అతనిని వ్యాప్తి నిరోధక, పొడి పట్టు రిబ్బన్ పట్టుకొని ఎందుకంటే బెన్ అయితే, అతను ఒక షాక్ పొందారు. అతనుకు షాక్ తగలటం తో అతను మెరుపులో విద్యుత్ కలదు. అని ఫ్రాంక్లిన్ యొక్క ప్రయోగం విజయవంతంగా మెరుపు స్టాటిక్ ద్వారా విద్యుత్నుచూపించాడు. ఫ్రాంక్లిన్ సంఘటన తర్వాత నిజాన్ని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేసి నిజాన్ని గ్రహించారు మిగిలిన శాస్త్రవేత్తలు.
మెరుపులోని విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది అని తెలుస్తోంది. మన శాత్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఆ విద్యుత్‌ను గ్రహించి సేవ్ చేయగలిగితే. మనకు నిరంతరము విద్యుత్‌ను పొందవచ్చు. మరి ఏరకంగా గ్రహించాలి అని ఆలోచించాలి మరి.
మెరుపులోని విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది అని తెలుస్తోంది. మన శాత్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఆ విద్యుత్‌ను గ్రహించి సేవ్ చేయగలిగితే. మనకు నిరంతరము విద్యుత్‌ను పొందవచ్చు. మరి ఏరకంగా గ్రహించాలి అని ఆలోచించాలి మరి.
లేబుళ్లు:
కధలు,
కమామిషులు,
పరిశోధకులు,
పుట్టిన రోజులు,
Events,
greetings,
photos
గురువారం, జూన్ 14, 2012
ప్రపంచ రక్త దాతల రోజు.
గురువారం, జూన్ 14, 2012
2005నుండి ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు. ఎందుకు ఈరోజే జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఆస్ట్రియన్ ఫిజిసియన్ కార్ల్ లేండ్ స్టీనర్ 14 జూన్ 1868. అను శాస్త్రవేత్త జయంతి. ఆయన ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుక్కొన్నారు. ఇలా బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు కార్ల్ లేండ్ స్టీనర్ కు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు. ఈయన Rh factor మరియు పోలియో వైరస్ ను వేరుచేశారు. ఈయన ప్రయోగాలు hemoglobinuria గురించి తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడ్డాయి.
రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరుచేయబడతాయి. అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవ భాగం మరియు 40% ఘన భాగంతో చేయబడింది. 90% నీరు మరియు 10% పోషకాలు, హార్మోన్లు మొదలగువాటితో తయారుచేయబడే, ద్రవ భాగమైన ఈ ప్లాస్మా, ఆహారము మరియు మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్ బి సి ( ఎర్ర రక్త కణాలు), డ బ్ల్యు సి ( తెల్ల రక్త కణాలు) మరియు ప్లేట్ లెట్స్ కలిగి ఉండే ఘన భాగం పోతే, యధాతదంగా రావడానికి సమయము తీసుకుంటుంది. మీరు ఇక్కడే అవసర పడతారు. దానిని తిరిగి యధాతదంగా రోగులయొక్క శరీరం నింపడానికి తీసుకునే సమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని అందరికి తెలుసుకదా. రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.
ప్రతి సంవత్సరము భారత దేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో, 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవ్యము రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు (electrolytes), హార్మోన్లని, విటమిన్లని, ప్రతిరక్షకణాలు (antibodies), వేడిని మరియు ఆమ్లజని ని తీసుకువెళతాయి. శరీరము నుండి వ్యర్థ పదార్థాలని మరియు కార్బన్డయాక్సైడ్ని రక్తం తీసుకువెళుతుంది. రక్తం, వ్యాధులను ఎదుర్కొని మరియు గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది. వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్త కణాలు శరీరము యొక్క ప్రాధమిక సురక్ష. ఒక రకమైన తెల్ల రక్త కణాలైన గ్రేన్యులొకైట్స్, సూక్ష్మక్రిములు (bacteria) వెదకి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి. శరీర అవయవాలకి మరియు కణజాలానికి (tissues), ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని తీసుకు వెళతాయి. రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి. రక్తపట్టికలు (platelets) రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి మరియు లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి.
రక్త దానము చేయటానికి చాలా మందికి అనేకమైన అపోహ వుంటుంది అవి ఏమిటంటే. "దానము చేసిన తరువాత నానుంచి ఏదో పోయినట్టు అంతే కాకుండా అలసి పోయినట్టు ఉంటుంది" ద్రవ్యాలను మరియు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, మీ నుండి ఏదో పోయినట్టుగాని లేదా మీరు అలసి పోయినట్టుగాని ఉండరు. " సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనలేను అనుకుంటారు "మిమ్మల్ని పాల్గొనవద్దని మీకు చెప్పినప్పటికీ, మీ అన్ని సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనవచ్చు. "రక్తం తక్కువ అవుతుంది" మీరు డాక్టరు చేత దానం చేయడానికి, సరే అని అనిపించు కున్న తరువాత, దానం చేసిన తరువాత కూడా మీకు సరిపడా రక్తం ఉంటుంది. "దానం చేసే సమయంలో నొప్పిగా వుంటుంది అనుకుంటారు " కానీ మీకు ఎటువంటి నొప్పి కలుగదు. " తలతిరిగి సొమ్మసిల్లి పోవచ్చుఅని కూడా అనుకుంటారు " రక్తం దానం చేసిన తరువాత,కొంతసేపు విశ్రాంతి తరువాత, మీరు సొమ్మసిల్లిపోరు లేదా అసౌకర్యం కలుగదు. " ఎయిడ్స్ కలుగవచ్చు!" అలా జరుగదు ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్ లను ఉపయోగించేలా మరియు క్రిములబారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. " రక్తం సామాన్యమైనది. దానికి గిరాకి ఉంటుందని నేననుకోవడం లేదు" అందుకే అరుదైన వాటి కన్నా మీ గ్రూపు రక్తానికే ఎక్కువ గిరాకీ ఉంటుంది.
రక్త దానం చేయటం మనకి మంచిదే. అదీ కాకుండా వేరే ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. నాకు ఇవన్నీ ఒక డాక్టర్ గారు చెప్పారు. మరి మీరు కూడా తెలుసుకోండి. మీరు రక్త దానం చేసి హాయిగా జీవించండి. అలాగే ప్రాణాపాయంలో ఉన్నవారిని జీవింప చేయండి. Thank you.
లేబుళ్లు:
పరిశోధకులు,
Events,
greetings,
photos,
Requests for people.
బుధవారం, జూన్ 13, 2012
Back 2 School.
బుధవారం, జూన్ 13, 2012
హమ్మయ్య స్కూల్ తెరిచారు అని పెద్దవాళ్ళు అనుకుంటూ వుంటారు. మాలాంటి పిల్లలేమో అప్పుడే సెలవులు అయిపొయాయీఈఈఈ . అని అనుకుంటారు కదండి. మరి పెద్దవాళ్ళు అలా అనుకోవటానికి కారణం వుంది . సమ్మర్ హాలిడేస్ లో మనం బాగా అల్లరి చేసాం. చెప్పిన మాట వినకుండా ఎండలో అదేసుకున్నాం. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేముందు మనం ఎన్నో ప్లాన్స్ చేస్తూవుంటాము. ఏవో చేసేయాలి అని అనుకుంటాము . ఆకరికి ఏమీ చేయము కదండి. నేను కూడా అలానే చేసాను అందుకే ఇలా అంటున్నాను. మొత్తానికి సమ్మర్ అయిపోయింది. స్కూల్ తెరిచేశారు. కొత్త స్కూలు, కొత్త క్లాస్సు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త డ్రస్సులు, కొత్త బుక్స్, అన్నీ కొత్తే. పుస్తకాలుకు అట్టలు వేసుకోవటం ఇవన్నీ తలచుకుంటేనే నాకు బలే సరదాగా, గమ్మత్తుగా, ఆనందముగా వుంది. మరి మీకు కూడా నాలేనే వుందా. స్కూల్ కి వెళ్ళగానే మన రోజు prayer తో మొదలు అవుతుంది. prayer లో ముందుగా వందేమాతరం పాడి తరువాత దేవుని ప్రార్ధించి ఆ తరువాత Indian Pledge చెప్తాము. తరువాత ఎవరి క్లాస్సేస్ లో వారు క్యూలో వెళ్తాం. మొదటి బెల్ తో క్లాస్స్లు మొదలు అవుతాయి. మద్యలో breaks తో క్లాస్‌లు అయిపోయాక ఆఖరి బెల్ కొట్ట గానే జనగణమన పాట పాడి జైహింద్ చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలని తొందరలో పెద్దగా అరుచుకుంటూ స్కూల్ బయటికి వచ్చి దూరం వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. అలారోజు మనరోజులు జరుగుతాయి. మద్య మద్యలో సండే హాలిడేస్ ను సంతోషంగా గడుపుతూ , ఎగ్జామ్స్ రాస్తూ సంతోషంగా స్కూల్ రోజులు గడుపుతాం, నాకు బలే exciting గా వుంది ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా స్కూల్ కి ఎప్పుడు వెళ్దామా అని. మరి మీకు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే బాగుంటుంది అని మా అమ్మ నాకు చెప్పింది. ఎలాంటి జాగ్రత్తలో చెప్పెసుకుందాం. స్కూల్ కి నీటుగా యునిఫోరం వేసుకొని, టైం కి వెళ్ళాలి. స్చూల్లో బుక్స్ అన్నీ జాగ్రత్తగా మనవి మనవి జాగ్రత్తగా వుంచుకోవాలి. ఎవరితోనూ కొట్లాడుకోకూడదు. టీచర్ చెప్పే ప్రతీవిషయాని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అబ్సేంట్ కాకూడదు. స్కూల్ నుండి బయటికి ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. మన పరెంత్స్ యొక్క ఫోన్ నెంబర్ ,మరియు స్కూల్ ఫోన్ నెంబర్ మనదగ్గర వుండాలి. ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తెలుసుకొని. ముఖ్యంగా బాగా చదువుకొని మనం మంచి పిల్లలమని అందరు మెచ్చుకునేట ట్టు తయారు అవ్వాలి. నాలాగే కొత్తగా కొత్త క్లాస్సులోకి వెళ్లినవారికి అందరికి All The Best. |
లేబుళ్లు:
కమామిషులు,
Events,
greetings,
photos,
Requests for people.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)