ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. సంగీతము అన్నది ఒక అద్భుతము. ఈ సంగీతము అన్నది ప్రకృతి నుండి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. "పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః" అన్నారు పెద్దలు. కానీ పశువులకన్నా, శిశువుల కన్నా పక్షులకు గానం గురించి బాగా తెలుసు అని ప్రకృతి నిరూపిస్తోంది. సంగీతముకు రాళ్ళు కరుగుతాయిట , పశువులు , పక్షులు, మరియు చిన్ని శిశువులు కూడా రెస్పాండ్ అవుతాయి అంటారు. సంగీతానికి అంత మహత్యము వుందిట . భగవంతుడు కూడా సంగీత ప్రియుడు అని మనకు కూడా తెలుస్తుంది. ఎలా అంటారా శివుని చేతిలో డమరుకము సంగీత సాదనం, కృష్ణుని చేతిలో మురళి, నారద తుంబురుడులు సంగీత విద్వాంసులు, మరియు మనం చదువులు తల్లిగా పూజలు చేసే అమ్మ సరస్వతిమాత చేతిలోని కచ్ఛపి (వీణ). వీటిని బట్టి బాగావంతుడు కూడా సంగీతము అంటే ఇష్టం అని తెలుస్తోంది కదండీ. మనము నిత్యమూ వినే కోకిల అరుపులో వుంది సంగీతము. పాటల పల్లకిలోన, చిగురాకు సవ్వడిలోన, నిరంతరము వసంతమే సంగీతము, గుప్పెడు గుండెలలోన , గుడిగంటల సందడిలోన ప్రతీక్షణం నిరంతరం స్వరార్చనే సంగీతము, వెన్నేలలో పొంగే గోదావరి సంగీతము. ఎంత దూరమైనా చిరుగాలిలోన అనుబందం పెంచే రాగం సంగీతము. ఇలాంటి సంగీతము గురించి చెప్పటం ఎవరి తరంకాదు. ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పాట నాకు చాలా నచ్చింది ఘంటసాల గారు పాడిన ఈ పాట చూడండి.